IPL 2025: ఐపీఎల్ బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్.. రోహిత్ శర్మకు దక్కని చోటు!
- 142 మ్యాచ్‌ల్లో 4,965 పరుగులు
- ఐపీఎల్‌లో 357 సిక్సర్లు బాదిన గేల్
- గేల్ బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్ ఇదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వెస్టిండీస్ దిగ్గజ బ్యాట్స్‌మన్, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్.. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్ల తరపున ఆడాడు. 142 మ్యాచ్‌ల్లో 4,965 పరుగులు చేశాడు. ఐపీఎల్ కెరీర్‌లో ఆరు సెంచరీలు, 31 అర్ధ సెంచరీలు బాదాడు. బెంగళూరు తరఫున రెండుసార్లు ఆరెంజ్ క్యాప్‌ను అందుకున్నాడు. ఐపీఎల్‌లో గేల్ 357 సిక్సర్లు బాదాడు, ఇది ఇప్పటికీ ఓ రికార్డు. అంతేకాదు అత్యధిక వ్యక్తిగత స్కోర్ రికార్డు ఇప్పటికీ గేల్ (175) పేరిటే ఉంది. ప్రపంచంలోని పలు ఫ్రాంచైజ్ క్రికెట్ లీగ్‌లో తన బ్యాటింగ్‌తో అభిమానులను అలరించిన యూనివర్సల్ బాస్.. తాజాగా తన బెస్ట్ ఐపీఎల్ ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎంచుకున్నాడు.
క్రిస్ గేల్ తన జట్టులో ఏడుగురు భారత ఆటగాళ్లకు చోటు ఇచ్చాడు. విదేశీ కోటాలో తనతో పాటు ఏబీ డివిలియర్స్,డ్వేన్ బ్రావో, సునీల్ నరైన్‌కు చోటిచ్చాడు. 12వ ఆటగాడిగా డేవిడ్ వార్నర్‌కు అవకాశం ఇచ్చాడు. యూనివర్స్ బాస్ తన టీంకు ఎంఎస్ ధోనీని సారథిగా ఎంచుకున్నాడు. అయితే ముంబై ఇండియన్స్ ఐదు టైటిల్స్‌ను అందించిన రోహిత్ శర్మకు ఈ జట్టులో చోటు దక్కకపోవడం గమనార్హం. అలానే హార్దిక్ పాండ్యా కూడా గేల్ తన ఐపీఎల్ ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు ఇవ్వలేదు.
Also Read
క్రిస్ గేల్ తన జట్టు ఓపెనర్లుగా తనతో పాటు విరాట్ కోహ్లీని ఎంచుకున్నాడు. 3వ స్థానంలో మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనాను ఎంచుకున్న యూనివర్సల్ బాస్.. 4వ స్థానంలో ఏబీ డివిలియర్స్‌కు అవకాశం ఇచ్చాడు. సర్ రవీంద్ర జడేజాను ఆల్ రౌండర్‌గా.. కెప్టెన్ అండ్ వికెట్ కీపర్‌గా ఎంఎస్ ధోనీని తీసుకున్నాడు. 7వ స్థానంలో డ్వేన్ బ్రావోకు స్థానం కల్పించాడు. సునీల్ నరైన్, యుజ్వేంద్ర చహల్‌లను స్పిన్నర్లుగా.. జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్‌లను పేసర్లుగా ఎంచుకున్నాడు.
Also Read: Virat Kohli Retirement: రిటైర్మెంట్‌పై కీలక వ్యాఖ్యలు చేసిన విరాట్ కోహ్లీ!
గేల్ బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్ ఇదే:
క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ, సురేశ్ రైనా, ఏబీ డివిలియర్స్, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ (కెప్టెన్), డ్వేన్ బ్రావో, సునీల్ నరైన్, యుజ్వేంద్ర చహల్, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్. 12వ ఆటగాడు- డేవిడ్ వార్నర్.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు