BC Poru Garjana: న్యూఢిల్లీలో బీసీల పోరు గర్జన.. హాజరు కానున్న రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి!
- జంతర్ మంతర్ వద్ద బీసీల పోరు గర్జన
- హాజరుకానున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ
- సభకు దూరంగా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ.. బీసీ బిల్లును తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన విషయం తెలిసిందే. ఈ బిల్లులను పార్లమెంట్ ఆమోదించి.. రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు బీసీ సంఘాలు పోరుకు సిద్ధమయ్యాయి. న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీసీల పోరు గర్జన కార్యక్రమాన్ని బుధవారం చేపడుతున్నాయి. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరగనున్న ఈ ధర్నాలో పాల్గొనేందుకు 12 బీసీ సంఘాలకు చెందిన సుమారు1500 మంది ప్రతినిధులు హైదరాబాద్ నుంచి ప్రత్యేక రైలులో సోమవారమే రాజధానికి బయలుదేరి వెళ్లారు.
బీసీల పోరు గర్జనకు కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హాజరుకానున్నారు. ధర్నాలో పాల్గొనేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, బీసీ మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ సహా బీసీ ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, కాంగ్రెస్‌కు చెందిన బీసీ నేతలు మంగళవారం ఢిల్లీ చేరుకున్నారు. ఏపీతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి మరో 1500 మంది బీసీ ప్రతినిధులు హాజరు కానున్నారు. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, డీఎంకే ఎంపీ కనిమొళి, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, బీఆర్‌ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర సహా 29 రాష్ట్రాల ఓబీసీ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.
Also Read
- Sahil Chauhan: 27 బంతుల్లో సెంచరీ.. టీ20 క్రికెట్లో ప్రపంచ రికార్డు.. అతడికి ఇండియాతో సంబంధం ఏంటి..?
- Hamid Ansari row: ‘‘ దేశానికి హిందువులు ముప్పా.?’’.. హమీద్ అన్సారీ వ్యాఖ్యలపై దుమారం..
- Garba Row: గర్బాలో ముస్లింల ఎంట్రీపై వివాదం.. నుదిటిపై తిలకం తప్పనిసరి!
- CM Chandrababu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసరాల ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక యాక్షన్ ప్లాన్..
Also Read: Rishabh Pant: మా ఓటమికి కారణం అదే: పంత్
ఐతే బీసీ పోరు గర్జన సభకు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు దూరంగా ఉన్నాయి. ధర్నాకు రావాలని బీసీ సంఘాలు కోరినా.. రెండు పార్టీలు సైలెంట్‌గానే ఉన్నాయి. బీజేపీ, బీఆర్ఎస్ నుంచి ముఖ్య నేతలు ఎవరూ ఢిల్లీకి వెళ్లలేదు. ఇక బీసీ పోరుగర్జనకు తాము హాజరుకాలేమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పినట్లు బీసీ సంఘాల నేతలు అంటున్నారు. కీలక ధర్నాకు హాజరుకాకపోవడంపై సొంత పార్టీల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయని తెలుస్తోంది.
తాజావార్తలు
-
Kayadu Lohar: కయాదు వెనుక ఇంత కన్నీటి కథ ఉందా? ‘ప్యారడైజ్’ బ్యూటీ జర్నీ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
-
Sahil Chauhan: 27 బంతుల్లో సెంచరీ.. టీ20 క్రికెట్లో ప్రపంచ రికార్డు.. అతడికి ఇండియాతో సంబంధం ఏంటి..?
-
Ravi Teja: హిట్టు పడగానే రేటు పెంచేసిన మాస్ రాజా.. నిర్మాత డ్రాప్.. సంక్రాంతి సినిమా క్యాన్సల్ ?
-
వరంగల్ MGMలో ఒక్కసారిగా కుప్పకూలిన సీలింగ్.. ముగ్గురికి గాయాలు!
-
Hamid Ansari row: ‘‘ దేశానికి హిందువులు ముప్పా.?’’.. హమీద్ అన్సారీ వ్యాఖ్యలపై దుమారం..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!