ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్‌కు ముంబై ఇండియన్స్ దూసుకెళ్లిన విషయం తెలిసిందే. లీగ్ ఆరంభంలో వరుస పరాజయాలతో పట్టికలో అట్టడుగున నిలిచిన ముంబై.. ఆపై వరుస విషయాలతో లీగ్ దశలో మరో మ్యాచ్ ఉండగానే ప్లేఆఫ్స్ బెర్త్ దక్కించుకుంది. ఇక టాప్ 2 స్థానం కోసం పోటీ పడుతోంది. ఓ దశలో లీగ్ స్టేజ్ నుంచే ఇంటిదారి పట్టేలా కనిపించిన ముంబై.. అనూహ్యంగా రేసులోకి రావడానికి కారణం స్టార్ బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సూరీడు తన అద్భుత ఆటతో ముంబై విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్ 2025లో పరుగుల వరద పారిస్తున్న సూర్య.. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండ్యూలర్ 15 ఏళ్ల రికార్డుకు చేరువలో ఉన్నాడు. ఆ రికార్డు ఏంటో చూద్దాం.
ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున ఓ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు సచిన్ టెండ్యూలర్ పేరిట ఉంది. 2010 ఎడిషన్‌లో సచిన్ 47.53 సగటు, 132.61 స్ట్రైక్ రేట్‌తో 618 పరుగులు చేశాడు. 2010లో అద్భుత ఫామ్‌లో ఉన్న సచిన్ ఐదు అర్థ సెంచరీలు చేశాడు. 15 ఏళ్లుగా ఈ రికార్డును ఎవరూ బ్రేక్ చేయలేదు. 2023లో సూర్యకుమార్ యాదవ్ ఈ రికార్డుకు చేరువగా వచ్చాడు. 16 మ్యాచ్‌ల్లో 605 పరుగులు చేసి.. 13 రన్స్ దూరంలో ఆగిపోయాడు. ఐపీఎల్ 2025లో ఇప్పటివరకు సూర్యకుమార్ 13 మ్యాచ్‌ల్లో 583 పరుగులు చేశాడు. మరో 36 పరుగులు రన్స్ చేస్తే సచిన్ రికార్డును బ్రేక్ చేస్తాడు. లీగ్ దశలో ఓ మ్యాచ్, ప్లేఆఫ్స్ ఉన్నాయి కాబట్టి ఈసారి సూరీడు అధిగమించే అవకాశాలు ఉన్నాయి.
Also Read: Kiran Abbavaram: తండ్రైన హీరో కిరణ్ అబ్బవరం!
ముంబై తరఫున ఓ సీజన్‌లో అత్యధిక పరుగులు:
# సచిన్ టెండూల్కర్ – 15 మ్యాచ్‌ల్లో 618 పరుగులు (2010)
# సూర్యకుమార్ యాదవ్ – 16 మ్యాచ్‌ల్లో 605 పరుగులు (2023)
# లెండిల్ సిమ్మన్స్ – 13 మ్యాచ్‌ల్లో 540 పరుగులు (2015)
# రోహిత్ శర్మ – 19 మ్యాచ్‌ల్లో 538 పరుగులు (2013)
# క్వింటన్ డి కాక్ – 16 మ్యాచ్‌ల్లో 529 పరుగులు (2019)