టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం తండ్రి అయ్యారు. కిరణ్ సతీమణి, నటి రహస్య గోరక్ గురువారం పండండి బాబుకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని కిరణ్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. తనకు కుమారుడు పుట్టాడని, అందరికి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అంటూ బాబు కాలిని ముద్దాడుతున్న ఫొటో షేర్ చేశారు. అభిమానులు, సినీ ప్రముఖులు అతడికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
2019లో విడుదలైన ‘రాజావారు రాణిగారు’ సినిమాలో కిరణ్ అబ్బవరం, రహస్య గోరక్ నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ సమయంలో ఇద్దరు ప్రేమలో పడ్డారు. దాదాపు ఐదు సంవత్సరాల డేటింగ్ తర్వాత ఆగస్టు 2024లో వివాహం చేసుకున్నారు. 2025 జనవరిలో తాము తల్లిదండ్రులు కాబోతున్నామని కిరణ్, రహస్యలు తెలిపారు. నిన్న (మే 22) ఈ జంటకు పండండి బాబు జన్మించాడు. ‘క’ సినిమాతో గతేడాది మంచి విజయాన్ని అందుకున్న కిరణ్.. ప్రస్తుతం ‘కె- ర్యాంప్’ సినిమాలో నటిస్తున్నారు.
Blessed with a Baby Boy 😇
Happy Hanuman Jayanthi 🙏#Jaisreeram pic.twitter.com/UG5Ztky8gd
— Kiran Abbavaram (@Kiran_Abbavaram) May 22, 2025