Ishan Kishan smashed a record double Century: 2022 డిసెంబర్ 10, చిట్టగాంగ్ వేదిక.. బంగ్లాదేశ్‌తో జరిగిన సిరీస్‌లో భారత్ 2-0 తేడాతో వెనుకబడి ఉంది. మూడో వన్డేకు స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ అందుబాటులో లేడు, మిగతా బ్యాటర్లు కూడా పెద్దగా ఫామ్‌లో లేరు. భారత్ క్లీన్ స్వీప్ అవుతుందా? అని టీమిండియా ఫాన్స్ ఆందళనలో ఉన్నారు. కెప్టెన్ రోహిత్ గైర్హాజరీలో కేఎల్ రాహుల్ జట్టుకు నాయకత్వం వహించాడు. ఇక హిట్‌మ్యాన్ స్థానంలో ఇషాన్ కిషన్ జట్టులోకి వచ్చాడు. ఆ మ్యాచ్‌లో భారత్ 409 పరుగులు చేసి.. 227 పరుగుల తేడాతో గెలుపొందింది. దాంతో భారత్ సిరీస్‌ను 2-1తో ముగించింది.
రోహిత్ శర్మ గాయం కారణంగా ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. ఆరంభం నుంచే బంగ్లా బౌలర్లపై ఇషాన్ విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో కేవలం 126 బంతుల్లోనే డబుల్ సెంచరీ చేశాడు. ఇది వన్డే చరిత్రలో అత్యంత వేగవంతమైన డబుల్ సెంచరీ. గతంలో ఈ రికార్డు యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ పేరిట ఉంది. 2015లో జింబాబ్వేపై గేల్ 138 బంతుల్లో డబుల్ సెంచరీ బాదాడు. 24 ఏళ్ల ఇషాన్ డబుల్ సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా కూడా నిలిచాడు. ఇక్కడ విశేషం ఏంటంటే.. ఇషాన్ తన మొదటి సెంచరీనే డబుల్ సెంచరీగా మలిచాడు. ఆ మ్యాచ్‌లో మొత్తంగా 131 బంతుల్లో 210 రన్స్ చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 24 ఫోర్లు, 10 సిక్సర్లు ఉన్నాయి. విరాట్ కోహ్లీతో కలిసి ఇషాన్ రెండవ వికెట్‌కు ఏకంగా 290 పరుగులు జోడించాడు. ఈ మ్యాచ్‌లో కింగ్ కూడా సెంచరీ బాదాడు.
Also Read: BCCI: హెడ్ కోచ్‌పై ముగ్గురు సీనియర్ ప్లేయర్స్ దాడి, నుదిటిపై 20 కుట్లు.. చర్యలకు సిద్దమైన బీసీసీఐ!
ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ చెలరేగడంతో భారత్ 409 పరుగుల భారీ స్కోరు చేసింది. బంగ్లాదేశ్ కేవలం 182 పరుగులకే పరిమితమైంది. ఆ మ్యాచ్‌లో భారత్ 227 పరుగుల భారీ తేడాతో గెలిచింది. బంగ్లాదేశ్ 2-1 తేడాతో సిరీస్‌ను గెలుచుకుంది. ఇక 27 ఏళ్ల ఇషాన్ చాలా కాలంగా భారత జట్టుకు దూరంగా ఉన్నాడు. చివరిసారిగా 2023 నవంబర్ 28న గౌహతిలో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20లో భారత్ తరపున ఆడాడు. 2023 అక్టోబర్ 11న ఢిల్లీలో చివరి వన్డే ఆడాడు. 2023 జూలైలో టెస్ట్ ఆడాడు. ఇటీవల సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో జార్ఖండ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. సౌరాష్ట్రపై 93, త్రిపురపై 113 పరుగులు చేశాడు. ఇషాన్ భారత్ తరఫున 2 టెస్టులు (78 పరుగులు), 27 వన్డేలు (933 పరుగులు), 32 టీ20లు (796 పరుగులు) ఆడాడు.