ప్రముఖ మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ ‘మోటోరొలా’ మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను దేశీయ మార్కెట్లోకి తీసుకొచ్చింది. ‘మోటో జీ57 పవర్’ 5జీ పేరిట భారతదేశంలో లాంచ్ చేసింది. రూ.15 వేల లోపు బడ్జెట్‌లో ఈ ఫోన్‌ను తీసుకురావడం ప్రత్యేకం. ఈ ఫోన్ ప్రత్యేకంగా పవర్ యూజర్లు, దీర్ఘకాలిక గేమర్‌ల కోసం రూపొందించబడింది. మోటో జీ57 పవర్‌లో హైలైట్ ఏంటంటే.. 7000mAh బ్యాటరీ ఉండడం. ఇంత తక్కువ బడ్జెట్ ఫోన్‌లో కంపెనీ బిగ్ బ్యాటరీని ఇవ్వడం విశేషం. మోటో జీ57 పవర్ ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం.
మోటో జీ57 పవర్ స్మార్ట్‌ఫోన్ ధర రూ.14,999 (8GB + 128GB)గా కంపనీ నిర్ణయించింది. కస్టమర్లు ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్‌లపై రూ.1,000 పొందనున్నారు. లాంచ్ ఆఫర్ కింద అదనంగా రూ.1,000 తగ్గింపు పొందుతారు. దాంతో ఈ ఫోన్ రూ.12,999కి మీ సొంతం అవుతుంది. ఈ ఫోన్ డిసెంబర్ 3 మధ్యాహ్నం 12 గంటల నుండి మోటరోలా అధికారిక వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్ సహా ఎంపిక చేసిన రిటైల్ స్టోర్‌లలో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. మోటో జీ57 పవర్ ఫోన్ మూడు పాంటోన్-సర్టిఫైడ్ రంగులలో (రెగట్టా, కోర్సెయిర్, ఫ్లూయిడిటీ) వస్తుంది.
మోటో జీ57 పవర్ ఫోన్ 6.72-అంగుళాల FHD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 1050 నిట్‌ల బ్రైట్‌నెస్ కలిగి ఉంటుంది. కలర్ బూస్ట్ టెక్నాలజీ, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ఫోన్ డిస్‌ప్లేను దృఢంగా ఉంచడమే కాకుండా అద్భుత పనితీరును అందిస్తుంది. ఈ ఫోన్ MIL-STD-810H ప్రమాణాన్ని, IP64 రేటింగ్‌ను కలిగి ఉంది. దాంతో దుమ్ము, ధూళి నుంచి రక్షణ ఉంటుంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6s Gen 4 చిప్‌సెట్‌తో వస్తుంది. ఇది 8GB LPDDR4X RAM,128GB UFS 2.2 స్టోరేజ్‌తో జత చేయబడింది. Android 16 OSపై పనిచేస్తుంది.
Also Read: Sree Vishnu: ఇక సపోర్ట్ చేయం.. మరువ తరమా హీరోపై శ్రీ విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు!
మోటో జీ57 పవర్ ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. 50MP సోనీ లైటియా 600 ప్రధాన సెన్సార్, 8MP అల్ట్రా-వైడ్ సెన్సార్ ఉన్నాయి. ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరా ఉంది. మోటో AI ఫోటో ఎన్‌హాన్స్‌మెంట్ ఇంజిన్, ఆటో నైట్ విజన్, AI పోర్ట్రెయిట్ ఎఫెక్ట్స్ సహా ఆటో స్మైల్ క్యాప్చర్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. మ్యాజిక్ ఎరేజర్, ఫోటో అన్‌బ్లర్, మ్యాజిక్ ఎడిటర్ వంటి AI ఆప్షన్స్ ఇందులో ప్రత్యేకమైనవి. కెమెరాలు 2K వీడియో రికార్డింగ్‌కు మద్దతు ఇస్తాయి. 7000mAh బ్యాటరీతో వచ్చిన ఈ ఫోన్ 33W టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. మొత్తానికి ఈ ఫోన్ ఒక శక్తివంతమైన బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ అనే చెప్పాలి.