Delhi Car Blast : ఢిల్లీ రెడ్ ఫోర్ట్ సమీపంలో చోటుచేసుకున్న కారు పేలుడు దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ దుర్ఘటనలో ప్రాణనష్టం జరగడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్ స్పందించారు. ఈ ఘటన అత్యంత బాధాకరమైనదిగా, కలతపరిచేదిగా అభివర్ణించిన ఆయన, మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విషయంపై ట్విట్టర్లో స్పందించిన రాజనాథ్ సింగ్.. “ఢిల్లీలో జరిగిన కారు పేలుడు ఘటన అత్యంత […]
Delhi Car Blast : దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం సాయంత్రం భారీ పేలుడు సంభవించి భయాందోళనలు చెలరేగాయి. ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నెం.1 సమీపంలోని సుభాష్ మార్గ్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద సాయంత్రం 6.52 గంటల సమయంలో హ్యుందాయ్ i20 కారు ఒక్కసారిగా పేలిపోయింది. రద్దీగా ఉండే ప్రాంతంలో ఈ ఘటన జరగడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. తాజా సమాచారం ప్రకారం ఇప్పటివరకు కనీసం 10 మంది మృతిచెందినట్లు అధికార వర్గాలు నిర్ధారించాయి. పలువురు […]
139 డ్రోన్స్ నిఘాలో పోలింగ్ కేంద్రాలు.. ప్రైవేటు డ్రోన్స్‌కు నో పర్మిషన్..! జూబ్లీహిల్స్ శాసనసభ ఉప ఎన్నిక సందర్భంగా భద్రత, పర్యవేక్షణ విషయంలో ఎన్నికల అధికారులు కీలక చర్యలు చేపట్టారు. ఈ ఎన్నికల నిర్వహణలో మొదటిసారిగా డ్రోన్లను వినియోగించనున్నారు. పోలింగ్ లొకేషన్లలో 139 డ్రోన్లను ఉపయోగించి సెక్యూరిటీ మానిటరింగ్ చేయాలని అధికారులు నిర్ణయించారు. డ్రోన్ల నుంచి వచ్చే ఫీడ్ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం కానుంది. ఈ మేరకు కోట్ల విజయ భాస్కర్ రెడ్డి […]
AP Cabinet Decisions : రాష్ట్రంలో భారీ పెట్టుబడుల దిశగా ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. మొత్తం రూ. లక్ష కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి పార్థసారథి వెల్లడించారు. ముఖ్యంగా క్వాంటం కంప్యూటింగ్ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రత్యేక విధానానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలిపారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన దాదాపు మూడున్నర గంటల పాటు సాగిన కేబినెట్ సమావేశంలో 70 అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. Stampades : దేవాలయాల్లో తొక్కిసలాటల […]
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా కోర్టు ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా కూడా పాల్గొన్నారు.
దేవాలయాల్లో తొక్కిసలాటల నివారణకు కీలక నిర్ణయం రాష్ట్రంలోని దేవాలయాల్లో తొక్కిసలాట ఘటనల నివారణపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి సారించింది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దేవాలయాల్లో తొక్కిసలాటల నివారణ, భద్రతా చర్యల పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేసిన ఈ ఉపసంఘం, క్రమం తప్పకుండా పరిస్థితులను సమీక్షించి సూచనలు ఇవ్వనుంది. ప్రత్యేకంగా, 2019-24 మధ్యలో దేవాలయాలపై జరిగిన దాడులు, వాటిపై తీసుకున్న చర్యలపై […]
Stampades : రాష్ట్రంలోని దేవాలయాల్లో తొక్కిసలాట ఘటనల నివారణపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి సారించింది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దేవాలయాల్లో తొక్కిసలాటల నివారణ, భద్రతా చర్యల పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేసిన ఈ ఉపసంఘం, క్రమం తప్పకుండా పరిస్థితులను సమీక్షించి సూచనలు ఇవ్వనుంది. Patek Philippe Watch: 82 ఏళ్ల క్రితం తయారీ.. వేలంలో రూ.156 కోట్లకు అమ్ముడైన పటేక్ […]
Visakha Steel Plant: తెలుగు ప్రజల గుండె చప్పుడు, ప్రైడ్ ఆఫ్ ఇండియాగా ప్రపంచవ్యాప్తంగా కీర్తి పొందిన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ముంచేసే కుట్ర జరుగుతోందా..? ప్రైవేటీకరణపై కేంద్రం ప్రకటనలు ఎలా ఉన్నా, తెరవెనుక ప్లాంట్ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసే ప్రయత్నం చాప కింద నీరులా జరుగుతోందనే అనుమానాలు ఇప్పుడు తీవ్రమవుతున్నాయి. నాలుగు దశాబ్దాల పాటు దేశీయ ఉక్కురంగంలో తనదైన ముద్ర వేసి, నాణ్యతకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన విశాఖ ఉక్కు ఉత్పత్తులకు ఇప్పుడు ‘నాణ్యతా లోపం’ […]
CM Chandrababu : సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మొంథా తుఫాను సమయంలో క్షేత్రస్థాయిలో చురుకుగా పనిచేసినందుకు మంత్రులను సీఎం చంద్రబాబు అభినందించారు. ప్రతీ మంత్రి స్వయంగా ప్రాంతాల్లో ఉండి ప్రజలకు వేగంగా సహాయం అందేలా చర్యలు తీసుకున్నారని ప్రశంసించారు. మొంథా తుఫాను సమయంలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేయడం వల్లే సహాయక చర్యలు అత్యంత వేగంగా జరిగాయని తెలిపారు సీఎం చంద్రబాబు. […]