కులగణకు బీజేపీ వ్యతిరేకం కాదని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ గౌడ్ తెలిపారు. ఇవాళ ఆయన బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. బీసీలు ఓటు వేస్తేనే నరేంద్రమోదీ మూడో సారి ప్రధాని అయ్యారన్నారు. బీసీలలో చీలిక తీసుక రావడానికి రాహుల్ గాంధీ పన్నిన కుట్ర ఇది అని, ఎంపీ లక్ష్మణ్ మాట్లాడిన మాటలో ఏది వెనక్కి తీసుకోవాలో మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పాలన్నారు ఆనంద్ గౌడ్.
కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. వరంగల్‌లో స్వాగతం పలికిన జిల్లా కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. గత ఏడాది సరిగ్గా ఇదే రోజు కామారెడ్డి సభలో బి సి డిక్లరేషన్ ప్రకటించి ఏడాది పూర్తయిందని, బీసీ డిక్లరేషన్ హామీలు ఏమయ్యాయి ఒక్కటైనా హామీ చేసిందా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని ఆయన అన్నారు.
తెలంగాణలో పరిశ్రమల స్థాపనకు అనుకూల వాతావరణం ఏర్పడిందని, అది దేశంలో ఎక్కడా లేనంత సులభతర వాణిజ్య విధానాల ద్వారా సాధ్యమైందని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. మలేషియా రాష్ట్రం కౌలాలంపూర్‌లో ఆదివారం జరిగిన తెలంగాణా దశాబ్ది ఉత్సవాలలో పాల్గొనడం ద్వారా, మలేషియా పారిశ్రామిక వేత్తలతో సమావేశం ఏర్పాటు చేసిన శ్రీధర్ బాబు, తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి తాము వారికి ఆహ్వానాన్ని వ్యక్తం చేశారు.
కొత్త కార్లను తరలిస్తున్న కంటైనర్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ బైపాస్ రోడ్డులో జరిగిన ఈ ఘటనలో 8 కొత్త కార్లు దగ్ధమయ్యాయి. కంటైనర్ లో మంటలు ఒక్కసారిగా చెలరేగి, నల్లటి పొగతో అల్లుకున్నాయి. ఇది గమనించిన డ్రైవర్ వెంటనే లారీని పక్కకు నిలిపి మంటలను ఆర్పడానికి ప్రయత్నించారు.
KP Vivekananda : తెలంగాణ బీ.ఆర్.ఎస్. పార్టీకి కేసుల గురించి ఎటువంటి భయం లేదని, ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ స్పష్టం చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్లో కార్పొరేషన్ మాజీ చైర్మన్లైన ఎర్రోళ్ల శ్రీనివాస్, మేడె రాజీవ్ సాగర్‌తో కలిసి మీడియా ముందుకు వచ్చిన ఆయన, కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు రోజురోజుకు దిగజారిపోతున్నదని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో డబ్బులు దోచుకుని కాంగ్రెస్ కేంద్రం లకు పంపిస్తున్నారని, రాష్ట్రాన్ని బంగారు బాతుల్లా ఉపయోగించుకుంటున్నారని అన్నారు. Indian Railways: భార్యాభర్తల […]
రాజకీయాలు, రైతులు, చెరుకు పరిశ్రమకు సంబంధించి ముఖ్యమైన వ్యాఖ్యలు చేసేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సీ.దామోదర్ రాజనర్సింహ రాయికోడ్ మండలం మాటూరు గ్రామంలో, గొదావరి గంగా ఆగ్రో ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (చక్కెర ఫ్యాక్టరీ) ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.
హెబియస్ కార్పస్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ.. 6 హెబియస్ కార్పస్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. పోలీసుల అక్రమ నిర్బంధాలపై బాధిత కుటుంబ సభ్యులు పిటిషన్లు వేశారు. ఈ క్రమంలో న్యాయస్థానం విచారణ చేపట్టింది. అక్రమంగా నిర్బంధించిన ఆరుగురు ఎక్కడున్నారో చెప్పాలని ప్రభుత్వ న్యాయవాదులకు కోర్టు ఆదేశించింది. లోకేష్ అనే సోషల్ మీడియా ప్రతినిధి హెబియస్ కార్పస్ పిటిషన్ పై విచారణలో ఎస్సై జానకి రామయ్య కోర్టుకు హాజరయ్యారు. ఈ క్రమంలో.. ఎస్సై జానకి రామయ్య స్టేట్మెంట్ను […]
Komatireddy Venkat Reddy : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీఆర్ఎస్, కేటీఆర్‌పై మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. అమెరికాలో చదువుకున్న కేటీఆర్‌కు కనీసం బుద్ధి కూడా లేదని వ్యాఖ్యానించారు. కవితకు బెయిల్ వస్తుందని తెలిసి, ఆమెకు జామీన్ వచ్చే రోజు రెండ్రోజులు ముందే ఢిల్లీ వెళ్లిపోయారని మండిపడ్డారు. బీఆర్ఎస్, బీజేపీ ఒకే మాట అనేవి అన్నాడు, తప్పు చేసినప్పుడు పెద్ద పెద్ద నాయకులే జైలుకెళ్లిపోతే కేటీఆర్ ను ఎవరూ అడ్డుకుంటారని ప్రశ్నించారు. Uddhav Thackeray: యోగి వ్యాఖ్యలపై […]
Kishan Reddy : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు కోసం అధికారులు కృషి చేయాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దిశా కమిటీ సమావేశం అనంతరం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మైనారిటీలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం రెసిడెన్షియల్ స్కూల్స్, హాస్టళ్లు మంజూరు చేస్తే అనేక రాష్ట్రాల్లో సరైన రీతిలో అమలు కావడం లేదని, అంగన్ వాడీ స్కూళ్లు, బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టళ్ల నిర్మాణానికి భూమి కొరత నెలకొందన్నారు కిషన్ రెడ్డి. నగరంలో […]
సీఎం రేవంత్ రెడ్డి మూసీ పునరుజ్జీవ సంకల్ప పాదయాత్ర చేపట్టారు. సంగెం-భీమలింగం-ధర్మారెడ్డిపల్లి కెనాల్ నుంచి నాగిరెడ్డిపల్లి వరకు సాగిన పాదయాత్ర కొనసాగింది. మూసీలో నీటి కాలుష్యాన్ని పరిశీలించిన రేవంత్ రెడ్డి.. భీమలింగంకు పూజలు చేశారు. రైతులను అడిగి వారి సమస్యలు తెలుసుకున్నారు.