Guinness Record : ఫిలిప్పీన్స్‌లో కోడి ఆకారంలో ఉన్న ఓ పెద్ద హోటల్ వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటి వరకు అనేక విభిన్న ఆకారాల్లో హోటళ్లు, రిసార్ట్లు చూశాము, కానీ ఫిలిప్పీన్స్‌లోని ఒక కొత్త హోటల్ ఇప్పుడు అంతర్జాతీయంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ హోటల్ ప్రత్యేకత ఏంటంటే, అది పూర్తిగా ఒక పెద్ద కోడిని పోలిన ఆకారంలో నిర్మించబడింది..! ఈ కోడి ఆకారంలో ఉన్న హోటల్ గినిస్ వరల్డ్ రికార్డు సాధించి, […]
తెలంగాణలో ఏడాది కాలంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని పచ్చి అబద్ధాలతో నడిపిస్తుండగా, ప్రజలను మోసం చేస్తూ అధికారాన్ని నడుపుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. మంగళవారం ముంబైలో జరిగిన మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వచ్చి అబద్ధాలను ఇక్కడి ప్రజలకు చెప్పారని, ఆరు గ్యారెంటీలు, 420 సబ్ గ్యారెంటీల పేరుతో ప్రజలను మభ్యపెట్టి.. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఆ తర్వాత ఎలా మోసం చేస్తోందో.. మహారాష్ట్ర ప్రజలకు వివరించేందుకు..…
DK Aruna : బీజేపీ మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కు వ్యతిరేకంగా ఏం మాట్లాడలేదని మహబూబ్‌నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణ అన్నారు. తాజాగా ఆమె మాట్లాడుతూ, మూసీ ప్రక్షాళనపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మూసీ నీటిని శుద్ధి చేసి మంచి నీటిగా మార్చాలని తమకు వ్యతిరేకం లేదు అని ఆమె స్పష్టం చేశారు. అయితే, మూసీ ప్రక్షాళన పేరుతో లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే ప్రణాళికను మాత్రమే బీజేపీ వ్యతిరేకిస్తోందని ఆమె […]
జగిత్యాల జిల్లా నుంచి మంత్రి కొండా సురేఖ బీఆర్ఎస్ పార్టీని, ముఖ్యంగా గత ప్రభుత్వ విధానాలను తీవ్రంగా విమర్శించారు. 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో విద్యారంగం పట్ల సరైన దృష్టి ఇవ్వలేదని, విద్యారంగం పూర్తిగా నిర్వీర్యమైపోయిందని ఆమె పేర్కొన్నారు. ఆమె మాట్లాడుతూ.. ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వం విద్యారంగాన్ని గాడిలో పెట్టేందుకు, విద్యా రంగాన్ని పునరుద్ధరించడానికి తీవ్రంగా కృషి చేస్తున్నట్లు మంత్రి కొండా సురేఖ తెలిపారు.
విశాఖ రైల్వే జోన్‌కు స్థలం కేటాయించారు.. త్వరలోనే పనులు షురూ.. విశాఖ రైల్వే జోన్ స్థలం కేటాయించారని, త్వరలోనే జోన్ పనులు ప్రారంభం చేస్తామని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ వెల్లడించారు. జంగారెడ్డిగూడెం పట్టణ బీజేపీ సమావేశంలో కేంద్రమంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడారు. భద్రాచలం కొవ్వూరు రైల్వే లైను ఇప్పటివరకు సత్తుపల్లి వరకు పూర్తి అయ్యింది మిగతాది అతి త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు. బీపీసీల్ కంపెనీ 70 కోట్ల రూపాయల ప్రాజెక్టును వేరే రాష్ట్రంలో పెట్టాలనుకున్న […]
రాష్ట్రవ్యాప్తంగా 87 వేల మంది ఎన్యూమరేటర్లతో ఈ సర్వే కొనసాగుతోందని, సర్వే ప్రక్రియ వల్ల సంక్షేమ పథకాలకు ఎలాంటి కోత పడదని మంత్రి పొన్నం ప్రభాకార్ స్పష్టం చేశారు.
జగిత్యాల జిల్లా ధర్మపురి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తండ్రిమాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వం పై చేసిన అసత్యపు ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. 2014 నుండి 2023 వరకు బి.ఆర్.ఎస్ పార్టీ ఇచ్చిన మ్యానిఫెస్టోలో ఎన్ని హామీలను అమలు చేశారో ఒక శ్వేత పత్రాన్ని విడుదల చేయాలన్నారు.
అదానీ, అంబానీ వంటి కొద్దిమంది క్రోనీ క్యాపిటలిస్ట్ నుంచి జార్ఖండ్ కు విముక్తి కల్పించండి... ఇండియా కూటమి అభ్యర్థులను తాజా ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఏఐసీసీ సీనియర్ పరిశీలకుడు, స్టార్ క్యాంపెయినర్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు.
వరంగల్ జిల్లా కేటీఆర్ కామెంట్స్‌కి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఇవాళ హన్మకొండలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, పార్టీ ముఖ్యనాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. దొంగలు వస్తున్నారు అని తెలిసి ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందని, మళ్ళీ వరంగల్ ప్రజలను మోసం చేయడానికి వచ్చారు ఈ దొంగలు అని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ పార్టీ అధికారిక వెబ్సైట్లో అబద్ధాలు.. హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు.. కాంగ్రెస్ పార్టీ అధికారిక వెబ్సైట్లో అబద్ధాలు పెట్టారని మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. రుణమాఫీ చేస్తామని మాట తప్పారుని కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి తన అబద్ధాల ప్రవాహాన్ని మహారాష్ట్ర లో కొనసాగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు గ్యారంటీ లు ఇచ్చి అమలు చేయకుండా తెలంగాణ లో […]