DK Aruna : ముఖ్యమంత్రి నియోజకవర్గం కొడంగల్ లగాచర్ల ప్రాంతా రైతుల మనోభావాలను దెబ్బతీయకుండా పంతాలకు పట్టింపులకు పోకుండా ఫార్మా కంపెనీని విరమించుకోవాలని ఎంపీ డీకే అరుణ అన్నారు. మంగళవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఎంపీ డీకే అరుణ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొడంగల్ కలెక్టర్ పై దాడి చేయడం విచారకరమని బాధాకరమని దాడిని ఖండిస్తున్నట్లుగా తెలిపారు. ఫార్మా కంపెనీకి కావలసిన భూమి రైతులు ఇవ్వడానికి సుముఖంగా […]
ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి.. ప్రముఖ ద ఇండియన్ ఎక్స్‌ప్రెస్ అడ్డా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... ఈ దఫా 400 సీట్లు అన్న వారు... 240 సీట్లు సాధించారు...
వికారాబాద్ కలెక్టర్‌పై దాడి ముమ్మాటికీ కుట్ర కోణం దాగి ఉందని ఐజీ సత్యనారాయణ అన్నారు. ఇవాళ NTVతో మల్టీ జోన్ 2 ఐజీ సత్యనారాయణ మాట్లాడుతూ.. కలెక్టర్‌పై దాడి చేసిన 16 మందిని రిమాండ్ చేశామని, 55 మంది అనుమానితులను విచరించామన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు సురేష్ ఎవరి ప్రోత్బలంతో కలెక్టర్‌పై దాడి చేశాడు అతని బాక్ గ్రౌండ్ ఏంటి అనే దానిపై దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు.
కరీంనగర్ కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈకార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, ఇతర అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని, కేటీఆర్ సిరిసిల్ల నేతన్న ల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలన్నారు.
మాజీ మంత్రి హరీష్ రావు పై రాష్ట్ర ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. హరీష్ రావు వేములవాడ రాజన్న దర్శనం చేసుకొని తప్పయింది మేము రాజన్న కి ఇచ్చిన మాట తప్పాము అని క్షమించు అని ఆడుగుతాడు అనుకున్నామని, సోనియా తెలంగాణ ఇస్తేనే కదా కేసీఆర్ సీఎం అయ్యాడు, మీకు పదవులు వచ్చాయని రాష్ట్ర ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ అన్నారు.
మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ఇలాంటి చర్యలకు దిగలేదని, బీఆర్ఎస్ వినకుండా ఉంటే.. మేము న్యాయపరంగా వెళ్లే వారమని, పరిశ్రమలు ప్రగతికి ముఖ్యమన్నా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. మీరు పరిశ్రమలు పెట్టినప్పుడు మేము ఇలాగే చేస్తే... అభివృద్ధి జరిగేదా..? అని శ్రీధర్ బాబు ప్రశ్నించారు.
CS Shanti Kumari : తెలంగాణ “ప్రజా ప్రభుత్వం” మొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నవంబర్ 14న హైదరాబాద్‌లో ప్రజా విజయోత్సవం లేదా “ప్రజాపాలన విజయోత్సవం” ప్రారంభం కానుంది. మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని బాలల దినోత్సవం సందర్భంగా నిర్వహించే ఈ ప్రారంభోత్సవ వేడుకలో సుమారు 14,000 మంది పాఠశాల విద్యార్థులు హాజరైన విద్యా దినోత్సవ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు విద్యాపరమైన మద్దతును […]
డ్రగ్ కంట్రోల్ అథారిటీ, TGMSIDC అధికారులతో మంత్రి దామోదర రాజనర్సింహ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ మీడియాతో మాట్లాడుతూ.. నాసిరకం నకిలీ మందులు తయారీ చేసేవారిపై అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డ్రగ్ కంట్రోల్ అథారిటీని ఆదేశించారు.
తెలంగాణలో పార్టీలో ఫిరాయించిన ఎమ్మెల్యేలకు అనర్హత విధించేందుకు సంబంధించి హైకోర్టులో మంగళవారం విచారణ ముగిసింది. అసెంబ్లీ కార్యదర్శి దాఖలు చేసిన అప్పీల్‌పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) ధర్మాసనం వాదనలు విని తీర్పును రిజర్వు చేసింది.
సౌదీ అరేబియాలోని రియాద్ మెట్రో నడపడానికి హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ ఎంపికైంది. అవును, లోకో పైలట్‌గా పనిచేస్తున్న ఈ మహిళ ఇప్పుడు సుదూర సౌదీ అరేబియాలో మెట్రో రైలు నడపబోతోంది. ఈ వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది.