కాంగ్రెస్ పాలనలో హిందూ దేవాలయాలకు రక్షణ లేకుండా పోయిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. ఆలయాలపై దాడులు చేస్తున్న వారిని పిచ్చోళ్లుగా ముద్రవేసి వదిలేస్తున్నారని ధ్వజమెత్తారు. కేవలం హిందూ దేవాలయాలు, హిందువులపై మాత్రమే పిచ్చోళ్లు దాడులు చేస్తరా? ఇతర ప్రార్ధన మందిరాల జోలికి వెళ్లరా? అని ప్రశ్నించారు.
యాదాద్రి కాదు యాదగిరిగుట్టే.. రికార్డులు మార్చండి యాదాద్రి పేరును మారుస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. యాదాద్రి బదులు యాదగిరిగుట్టగా పేరు మార్చాలని అధికారులను ఆదేశించారు. ఇకపై యాదాద్రి బదులు అన్ని రికార్డుల్లో యాదగిరి గుట్టగా మార్చాలని సీఎం ఆదేశం ఇచ్చారు. ఇక నుంచి యాదాద్రి బదులుగా అన్ని రికార్డుల్లో యాదగిరిగుట్టగా వ్యవహారికంలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు […]
NCCL: కన్సాలిడేషన్ ప్రాతిపదికన, ఎన్సిసి లిమిటెడ్ (ఎన్‌సిసిఎల్) ప్రస్తుత సంవత్సరం 2వ త్రైమాసికానికి రూ.5224.36 కోట్ల (ఇతర ఆదాయంతో సహా) టర్నోవర్‌ను నివేదించింది, ఇది అంతకు ముందు సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ.4746.40 కోట్లుగా ఉంది. కంపెనీ EBIDTA రూ.442.95 కోట్లు , కంపెనీ షేర్హోల్డర్లకు ఆపాదించబడిన నికర లాభం రూ.162.96 కోట్లుగా నివేదించింది, ఇది అంతకు ముందు సంవత్సరం ఇదే త్రైమాసికంలో వరుసగా రూ.303.74 కోట్లు , రూ.77.34 కోట్లుగా ఉంది. అలాగే, కంపెనీ బేసిక్ […]
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ పునరుజ్జీవన సంకల్ప పాదయాత్రను ప్రారంభించారు. ఈ పాదయాత్ర యాదాద్రి జిల్లాలోని వలిగొండ మండలం, సంగెం గ్రామం నుంచి ప్రారంభమైంది. పాదయాత్రలో భాగంగా, సంగెం - భీమలింగం - ధర్మారెడ్డిపల్లి కెనాల్ - నాగిరెడ్డిపల్లి రోడ్డు వరకు 2.5 కిలోమీటర్ల మేర నడిచేలా సీఎం రేవంత్ రెడ్డి పథకాన్ని రూపొందించారు.
దశాబ్దాలుగా మూసీ నదిపై కాంగ్రెస్ దీర్ఘకాల నిర్లక్ష్యం, పునరుజ్జీవన ప్రాజెక్టు బాధితుల బాధల నుంచి దృష్టి మరల్చేందుకు నల్గొండలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేపట్టిన మూసీ పాదయాత్ర రాజకీయ స్టంట్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అభివర్ణించారు. మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా హైదరాబాద్‌లో ఇళ్లు కూల్చే ప్రమాదంలో ఉన్న బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించారు.
తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (TGDCA) వారు తాజాగా మార్కెట్లో విక్రయమవుతున్న "MENSET Forte Syrup" అనే ఆయుర్వేద మందును గుర్తించి, దానిపై తప్పుదోవపెట్టే ఆరోగ్య వాదనలు ఉండటం వల్ల చర్యలు తీసుకున్నారు. ఈ మందు పై ఉన్న లేబల్స్, మెన్స్ట్రుయల్ ప్రాసెస్ సంబంధిత వ్యాధుల్ని, అందులోనూ అసమంజసమైన మెన్స్ట్రుయేషన్, మెనోపాజల్ సిండ్రోమ్, అమినోరియా వంటి మేన్స్ట్రల్ డిసార్డర్లను నయం చేస్తుందని పేర్కొంటూ, డ్రగ్స్ & మ్యాజిక్ రెమిడీస్ (ఆబ్జెక్షనబుల్ అడ్వర్టైజ్మెంట్) యాక్ట్, 1954 ని ఉల్లంఘించడాన్ని నిరూపించాయి.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వారధి కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు సోము వీర్రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి సమస్యలపై అర్జీలు స్వీకరించారు సోము వీర్రాజు. అనంతరం సోము వీర్రాజు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం లో ప్రజా పాలన సాగుతుందని, అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ పెంచి అమలు చేస్తున్నారన్నారు.
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ముగిసింది. బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వాయిదా పడినట్లు అధికారులు ధృవీకరించారు. మొదట బుధవారమే విడుదల కావాల్సి ఉండగా, వివిధ అనివార్య పరిస్థితుల కారణంగా ఇప్పుడు ప్రకటన ఆలస్యం అవుతుంది. మరో రెండు, మూడు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు.
“నటి కస్తూరిపై కేసు”.. 4 సెక్షన్లలో ఎఫ్ఐఆర్ నమోదు తమిళ చిత్ర పరిశ్రమలోని ప్రముఖ నటీమణులలో కస్తూరి ఒకరు. రాజకీయాలు, సెలబ్రిటీలపై అప్పుడప్పుడూ కామెంట్స్ చేస్తూ ఉండే ఆమె తెలుగువారిపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. ఆమెపై విమర్శలు వెల్లువెత్తడంతో, క్షమాపణలు చెప్పాడు. ఈ స్థితిలో అల్లర్లను రెచ్చగొట్టే ఉద్దేశ్యంతో వ్యవహరించడంతో పాటు నటి కస్తూరిపై చెన్నై ఎగ్మూర్ పోలీసులు 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బ్రాహ్మణుల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని, […]