పోలీసులు కోర్టులో నరేందర్ రెడ్డిని హాజరుపరిచగా... కోర్టు నరేందర్ రెడ్డికి 14రోజుల రిమాండ్ విధించింది. పోలీసులు నరేందర్ రెడ్డిని చర్లపల్లి జైలుకు తరలించారు. అయితే.. పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.
నెహ్రూ జయంతిని పురస్కరించుకుని నిర్వహించే జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి బాలబాలికలు అందరికీ హార్ధిక శుభాకాంక్షలు తెలియజేశారు. నేటి బాలబాలికలే భావి భారత పౌరులని విశ్వసించి ప్రజా ప్రభుత్వం పాఠశాల విద్యా రంగంలో వినూత్నమైన మార్పులకు శ్రీకారం చుట్టిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
హైదరాబాద్లో ఇటీవల హోటల్స్లో ఆహార పదార్థాల అపరిశుభ్రత, నిల్వ ఉంచిన మాంసం, సరైన నిబంధనలు పాటించకపోవడం, కస్టమర్లకు వడ్డించిన ఆహారంలో పురుగులు, కీటకాలు కనిపించడం వంటి సంఘటనలు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి.
ఈ సందర్భంగా సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) డైరెక్టర్ డైరెక్టర్ శిఖా గోయల్ మాట్లాడుతూ.. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ పోలీసుల స్పెషల్ ఆపరేషన్ నిర్వహించినట్లు, మ్యూల్ ఖాతాలను గుర్తించేందుకు TGCSB స్పెషల్ ఆపరేషన్ చేపట్టిందని తెలిపారు.
Koti Deepotsavam 2024 : ‘రచన టెలివిజన్ లిమిటెడ్’ ప్రతీ సంవత్సరం హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో అంగరంగ వైభవంగా ‘కోటి దీపోత్సవం’ను నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఎన్టీవీ, భక్తి టీవీ, వనిత టీవీ ఆధ్వర్యంలో జరిగే ఈ దీపాల పండగకు లక్షల సంఖ్యలో భక్తులు తరలి వచ్చి.. దీపాలను వెలిగిస్తుంటారు. ఈ ఏడాది నవంబర్ 9 నుంచి 25 వరకు కోటి దీపోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతోంది. కోటి దీపోత్సవం 2024లో ఇప్పటికే నాలుగు రోజులు పూర్తి […]
బతుకమ్మ కుంటపై హైడ్రా కమిషనర్ సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే.. హైడ్రా పేరువింటే చాలు.. తెలంగాణలోని స్థానిక ప్రజలు గజ గజ వణికిపోతున్నారు. ఎప్పుడు హైడ్రా అధికారులు వస్తారో.. వారు ఉంటున్న నివాసాలను కూల్చేస్తారో అంటూ ఆందోళన చెందుతున్నారు. ఇటువంటి వార్తలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. స్థానికులకు క్లారిటీ ఇచ్చేందుకు ఇవాళ అంబర్ పేట్ లోని బతుకమ్మ కుంటకు వెళ్లారు. రంగనాథ్ ను చూసిన స్థానిక ప్రజలు ఆందోళన చెందారు. దీంతో ఏవీ రంగనాథ్ మాట్లాడుతూ.. స్థానిక […]
రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలకు బీఆర్ఎస్ కుట్ర చేస్తోందని ఆరోపించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో వ్యవసాయ రంగంతో పాటు పారిశ్రామిక అభివృద్ధి అవసరం ఉందని ఆయన అన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు.
2023 జనవరి 12న మడకశిర మండలం కోడిగానిపల్లి సమీపంలోని హంద్రీనీవా కాలువకు ఏర్పాటు చేసిన బ్రిడ్జి కింద గుర్తు తెలియని శవాన్ని గుర్తించారు. వీఆర్ఓ హారతి స్థానిక పోలీస్స్టేషన్ ఫిర్యాదు చేశారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఓపిక పట్టండి సీరియల్గా ఒక్కొట్టి బయటకు వస్తుందని వికారాబాద్ ఘటన పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు. రైతన్నలు ధర్నాలు చేసియాల్సిన అవసరం లేదని, Msp రేటు కంటే అదనంగా గింజ లేకుండా ప్రభుత్వం కొంటుందని ఆయన వెల్లడించారు.
తెలంగాణ వ్యాప్తంగా వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రవాణా శాఖ కు సంబంధించిన లారీలు ఇతర వాహనాలు ఇబ్బంది లేకుండా స్థానిక జిల్లా రవాణా అధికారులు & కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో సమన్వయం చేసుకోవాలని రవాణా శాఖ ప్రత్యేక కార్యదర్శి వికాస్ రాజ్ ను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు.