CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా శనివారం తల్లిదండ్రులు- ఉపాధ్యాయుల మెగా సమావేశాలు ప్రారంభమయ్యాయి. 45,094 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఈ కార్యక్రమం కొనసాగుతోంది. ఎలాంటి రాజకీయ ప్రమేయం లేకుండా విద్యాశాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అయితే ఈ నేపథ్యంలోనే.. ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) తల్లిదండ్రులకు పిల్లల చదువుపై ఎక్కువ శ్రద్ధ చూపాల్సిందిగా సూచించారు. బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్-టీచర్స్ మీట్ కార్యక్రమంలో మంత్రి లోకేష్ (Nara Lokesh)తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా విద్యార్థులతో ముచ్చటిస్తూ వారి ప్రగతి నివేదికలను పరిశీలించారు.
Mokshagna : జస్ట్ అదే వాయిదా.. మోక్షజ్ఞ, ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్ యాజ్ ఇట్ ఈజ్
‘‘పిల్లల చదువును తల్లిదండ్రులు నిత్యం పర్యవేక్షించాలని’’ చంద్రబాబు పేర్కొన్నారు. ‘‘వారు స్మార్ట్‌ఫోన్లకు బానిసలుగా మారకుండా జాగ్రత్త పడాలి. డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాలకు విద్యార్థులు దూరంగా ఉండాలి. మానవ సంబంధాలను నాశనం చేసే డ్రగ్స్‌కు సమాజంలో చోటుండకూడదన్నారు సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో ఈగల్ పేరుతో డ్రగ్స్ నిరోధక వ్యవస్థను ఏర్పాటు చేశామని, ఈ ప్రమాదాన్ని కఠినంగా అణచివేస్తామన్నారు చంద్రబాబు. విద్యార్థులు డ్రగ్స్ ప్రమాదాన్ని తెలుసుకుని ఈ పోరాటంలో భాగస్వాములు కావాలి అంటూ చంద్రబాబు పిలుపునిచ్చారు. డ్రగ్స్ వ్యతిరేక పోరాటం పాఠశాల స్థాయి నుంచే ప్రారంభమవ్వాలని సీఎం చంద్రబాబు సూచించారు.
Discount on SUV: ఈ SUVపై రూ. 4.75 లక్షల తగ్గింపు.. డిసెంబర్ 31 వరకే ఆఫర్!