తృణమూల్ కాంగ్రెస్ తదుపరి వారసులు ఎవరు? మమతా బెనర్జీ ఏమన్నారంటే..
భవిష్యత్తులో టీఎంసీ బాధ్యతలు చేపట్టనున్న మమతా బెనర్జీ వారసులు ఎవరు? ఈ ప్రశ్న పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. తృణమూల్ కాంగ్రెస్ వర్గాలతో పాటు సాధారణ ప్రజల్లో కూడా ఈ ప్రశ్న పదే పదే లేవనెత్తుతోంది. ఇప్పుడు ఈ విషయాన్ని స్వయంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెల్లడించారు. పార్టీలో సీనియర్ నేతలు, యువకుల మధ్య వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో మమతా శుక్రవారం ఓ జాతీయ మీడియాతో మాట్లాడారు. తృణమూల్ కాంగ్రెస్‌లో తన వారసుడు ఎవరన్న ప్రశ్నకు ఆమె సమాధానమిచ్చారు.
ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు కీలక పదవి కట్టబెట్టిన తెలంగాణ ప్రభుత్వం
టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తన కెరీర్ మొదట డిస్ట్రిబ్యూటర్ గా స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ ప్రొడ్యూసర్ అయ్యారు. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ లో ఎన్నో మంచి సినిమాలను నిర్మించి సక్సెస్ ఫుల్ నిర్మాతగా కొనసాగుతున్నారు. స్టార్ హీరో సినిమాల దగ్గర నుండి చిన్న సినిమాల వరకు ఎన్నో అద్భుతమైన సినిమాలను తన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ అగ్ర నిర్మాతకు తెలంగాణ సర్కార్ కీలక పదవి కల్పించింది. తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టిఎఫ్‌డీసీ) ఛైర్మన్‌గా ఆయనను నియమిస్తూ సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు తాజాగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు.
పోలీసు కస్టడీకి పట్నం నరేందర్‌రెడ్డి..
కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని కొడంగల్ కోర్టు పోలీసు కస్టడీకి అనుమతించింది. లగచర్ల దాడి కేసులో ఏ-1గా ఉన్న నరేందర్‌రెడ్డిని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కొడంగల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం.. నిందితుడిని రెండు రోజుల పోలీసు కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇవాళ నరేందర్ రెడ్డిని చర్లపల్లి జైలు నుంచి వికారాబాద్ కు పోలీసులు తరలించనున్నారు. రెండు రోజుల పాటు ప్రశ్నించనున్నారు. ఇవాళ, రేపు (శని, ఆదివారా)ల్లో న్యాయవాదుల సమక్షంలో విచారణకు అనుమతి ఇచ్చారు. అయితే.. పట్నం నరేందర్‌రెడ్డి ఇప్పటికే అరెస్టయి చర్లపల్లి జైలులో రిమాండ్‌లో ఉన్న విషయం తెలిసిందే.
నేడు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ ప్రకారం, ఆగ్నేయ బంగాళాఖాతం , దానిని ఆనుకుని ఉన్న హిందూ మహాసముద్రంలో ఉపరితల ఆవర్తనం నేడు అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఈ వ్యవస్థ పశ్చిమ-వాయువ్య దిశలో కదులుతుందని అంచనా వేయబడింది , డిసెంబర్ 12 నాటికి శ్రీలంక , తమిళనాడు తీరాలకు చేరుకోవచ్చు. ఈ పరిణామం తమిళనాడు , ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలలో రాబోయే కొద్ది రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. డిసెంబర్ 11, 12 తేదీల్లో తమిళనాడులో, దక్షిణ కోస్తా జిల్లాలు, ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంతంలో డిసెంబర్ 12న భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.వాతావరణం మరింత బలపడి అల్పపీడనంగా మారే అవకాశం కూడా ఉంది.
నేడు కేసీఆర్ ను కలవనున్న మంత్రి పొన్నం ప్రభాకర్..
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రజా పరిపాలన విజయోత్సవ వేడుకలు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. విజయోత్సవ చివరి రోజైన డిసెంబర్ 9న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ జరగనుంది. అయితే ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని అన్ని పార్టీల కీలక నేతలను ఆహ్వానించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ను ఆహ్వానించనున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అధికంగా ప్రాధాన్యమిస్తోంది
నెల్లూరు నగరంలోని బి.వి.ఎస్. నగరపాలక సంస్థ బాలికల ఉన్నత పాఠశాలలో జరిగిన తల్లిదండ్రులు.. ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో మంత్రి నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజున తల్లిదండ్రులు.. ఉపాధ్యాయుల సమావేశాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అధికంగా ప్రాధాన్యమిస్తోందని, రాష్ట్రంలో కొత్తగా ఐదు ప్రాంతాల్లో మోడల్ స్కూల్స్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు మంత్రి నారాయణ. కార్పొరేట్ స్కూల్స్ విజయానికి కారణం తల్లిదండ్రులు.. ఉపాధ్యాయుల సమావేశాలే కారణమని, ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ ఉపాధ్యాయులు ఉన్నారన్నారు మంత్రి నారాయణ. ప్రైవేట్ పాఠశాలల్లో ఉపాధ్యాయులకు ఓరియంటేషన్ ఇవ్వడం వల్లే వాళ్ళు బాగా బోధిస్తున్నారని, ప్రభుత్వ ఉపాధ్యాయులకు కూడా ఎప్పటికప్పుడు ఓరియంటేషన్ కార్యక్రమాలను నిర్వహించాలన్నారు.
అలా చేయడం వల్లనే మున్నేరు వరద ముంపు గండం..
నాలాలు పూడ్చి అక్రమ కట్టడాలు వల్లే మున్నేరు వరద ముంపు గండం ఏర్పడిందని మంత్రి తమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం నగరంలో మామిళ్ళ గూడెం, సారథి నగర్ కాలనీలను అనుసంధానం చేసే రైల్వే అండర్ మినీ బ్రిడ్జిను మంత్రి తుమ్మల ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. నాలాలు పూడ్చి అక్రమ కట్టడాలు వల్లే మున్నేరు వరద ముంపు అని తెలిపారు. అడవులను కొట్టడం వల్లే కోతులు జనావాసాల్లోకి వస్తున్నాయని మంత్రి అన్నారు. ఖమ్మం నగరంలో ట్రాఫిక్ కష్టాలు లేకుండా రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం జరిగిందన్నారు.
కమ్మేసిన పొగమంచు.. విమానాల దారి మళ్లింపు
కృష్ణా జిల్లాను పొగమంచు కమ్మేసింది. దట్టమైన పొగమంచు కారణంగా వాహనాల రాకపోకలు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. అలాగే గన్నవరం ఎయిర్‌పోర్టు (Gannavaram Airport) వద్ద కూడా భారీగా పొగమంచు కమ్మేసింది. దీంతో విమానాల ల్యాండింగ్‌కు ఇబ్బందులు ఎదురువుతున్నాయి. పొగమంచు కారణంగా క్లియరెన్స్ లేక గన్నవరం ఎయిర్పోర్ట్ వద్ద పలు విమానాలు గాలిలోనే చక్కర్లు కొడుతున్నాయి. పొగమంచు కారణంగా సుమారు గంట నుంచి ఫ్లైట్స్ గాల్లోనే చక్కర్లు కొడుతున్న పరిస్థితి. వాతావరణం అనుకూలించకపోవడంతో విమానాల అన్నీ కూడా కిందకు ల్యాండ్ కాని పరిస్థితి ఏర్పడింది.
మరో వివాదంలో కొండా సురేఖ.. రాజన్న కోడెల వివాదంలో మంత్రి పేరు..
అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మరో వివాదంలో చిక్కుకున్నారు. వేములవాడ రాజన్న కోడెల వివాదంలో మంత్రి పేరు వినిపిస్తోంది. కోడెల పంపిణీలో ఆలయ ఈఓ వినోద్ రెడ్డి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కోడెలు దారి తప్పుతున్నారని ఆరోపిస్తూ విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ నాయకుల ఫిర్యాదుతో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. మంత్రి కొండా సురేఖ సిఫార్సుతో రాజన్న ఆలయ కోడెలు పక్కదారి పడుతున్నాయని ఆందోళన చేపట్టారు. మంత్రి సూచన మేరకు ఆగస్టు 12న రాంబాబు అనే వ్యక్తికి ఆలయ అధికారులు 49 కోడళ్లను అందజేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
మూడు రోజుల పోలీస్ కస్టడీకి బోరుగడ్డ అనిల్
రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ ను పోలీసులు అనంతపురం తరలించారు. పలు కేసుల్లో రిమాండ్ లో ఉన్న అతడిని తాజాగా అనంతపురం జిల్లాలో నమోదైన కేసులకు సంబంధించి కోర్టు మూడు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది. దీంతో ఇవాళ బోరుగడ్డ అనిల్ ను అనంతపురం జిల్లా పోలీసులు ప్రత్యేక ఎస్కార్ట్ వాహనంలో రాజమండ్రి నుంచి తీసుకువెళ్లారు. వైసీపీ తరఫున సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు… ఇతర నేరాల్లో నిందితుడిగా ఉన్న బోరుగడ్డ అనిల్ ను కూటమి ప్రభుత్వం వచ్చాక అక్టోబర్ 17న పోలీసుల అరెస్టు చేశారు. అప్పటినుంచి రిమాండ్ కొనసాగుతోంది. అరెస్టు సమయంలో గుంటూరు నుంచి రాజమండ్రి జైలుకు తరలిస్తూ మార్గమధ్యంలో ఏలూరు వద్ద బోరుగడ్డ అనిల్ ను ఎస్కార్ట్ పోలీసులు రెస్టారెంట్ కు తీసుకువెళ్లి బిర్యానీ తినిపించడం సంచలనం అయ్యింది. ఆ ఘటనలో ఏడుగురు పోలీసులు సస్పెన్షన్ అయ్యారు.