ఆ ఎమ్మెల్యే కుటుంబంలో కుంపట్లు అంటుకున్నాయా? వారసత్వ పోరు అగ్గి రాజేసిందా? ఇన్నాళ్ళు పాలు నీళ్ళలా కలిసిమెలిసిపోయి రాజకీయం చేసిన అన్నదమ్ముల మధ్య వాళ్ళ కొడుకుల రూపంలో వార్ మొదలైందా? మోసే వాళ్ళు ఎప్పుడూ మోతగాళ్ళుగానే మిగిలిపోవాలా? పైకెక్కే ఛాన్స్ ఇవ్వరా? అంటూ శాసనసభ్యుడిని నిలదీస్తున్నదెవరు? ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఏమా కుటుంబ వారసత్వ కథా చిత్రమ్? వనమాడి వెంకటేశ్వరరావు అలియాస్ కొండబాబు.. కాకినాడ సిటీ టిడిపి ఎమ్మెల్యే. ఆరు సార్లు పోటీ చేసి మూడు విడతలు […]
EVM లోని డేటాని తొలగించొద్దు.. ఈసీకి సుప్రీం కీలక ఆదేశాలు.. కౌంటింగ్ పూర్తయిన తర్వాత కూడా ఈవీఎం నుంచి డేటాను తొలగించవద్దని కోరూతూ దాఖలైన పిటిషన్‌పై, పోలింగ్ ముగిసిన తర్వాత ఎలక్ట్రానికి ఓటింగ్ యంత్రాల(EVM) స్టాండర్డ్ ఆపరేటింగ్ విధానం ఏమిటి అని, కేంద్ర ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ప్రస్తుతానికి ఈవీఎంల నుంచి ఎలాంటి డేటా తొలగించవద్దని, ఏ డేటాని రీలోడ్ చేయవద్దని కోరింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం కీలక […]
Uttam Kumar Reddy : కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన బంజారాహిల్స్ నివాసంలో పార్టీ శ్రేణులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అంతకు ముందు, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు రేపటి స్థానిక సంస్థల ఎన్నికలకు రిహార్సల్స్ అవుతాయని […]
KCR : తెలంగాణ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్)ను తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీ ఎర్రవెల్లిలోని కేసీఆర్‌కు చెందిన ఫామ్ హౌస్‌లో జరిగింది. ఈ సందర్భంగా జరిగిన చర్చల్లో రాజకీయ పరిణామాలు, రానున్న ఉప ఎన్నికలు, రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై గంభీరంగా చర్చ జరిగినట్లు సమాచారం. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గానికి ఉప […]
TPCC Mahesh Goud : కేటీఆర్‌కి టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సవాల్ విసిరారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలన … ఏడాది కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్ధమా కేటీఆర్? అంటూ కేటీఆర్‌కు మహేష్ కుమార్ గౌడ్ ఛాలెంజ్ చేశారు. కేటీఆర్ ఉత్తర కుమారుడి ప్రగల్భాలు పలకడం ఆపేసి.. దమ్ముంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయండన్నారు. చెల్లి, బావ ఇచ్చిన షాక్ తో కేటీఆర్ మతిభ్రమించి మాట్లాడుతున్నాడని ఆయన హెద్దెవ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ […]
Bhatti Vikramarka : రానున్న వేసవిలో డిమాండ్ మేరకు విద్యుత్తును అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. మంగళవారం ఆయన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో spdcl పరిధిలోని విద్యుత్ అధికారులతో వేసవిలో విద్యుత్ సరఫరా ప్రణాళిక పై సమీక్ష సమావేశం నిర్వహించారు. గత వేసవిలో వచ్చిన విద్యుత్ డిమాండ్, రానున్న వేసవిలో ఏ మేరకు విద్యుత్తు డిమాండ్ ఉంటుంది.. అందుకు తగిన విధంగా అధికారులు చేసుకున్న […]
సర్వేలో పాల్గొనని వారికి మాట్లాడే అర్హత, హక్కు లేదు! దేశంలోనే మార్గదర్శకంగా కులగణన సర్వే తెలంగాణ ప్రభుత్వం చేపట్టిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాంగ్ డైరెక్షన్లో పోయేలా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ప్రవర్తిస్తున్నాయని.. ఆ రెండు పార్టీలకు కులగణనఫై మాట్లాడే నైతిక అర్హత లేదని విమర్శించారు. మొన్నటి సర్వేలో పాల్గొనని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుకు ఫామ్‌లు పంపుతున్నామని ఎద్దేవా చేశారు. బీజేపీకి చేతనైతే దేశవ్యాప్త సర్వేకు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి అనుమతి తీసుకోండన్నారు. బీసీలకు […]
Konda Surekha : సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే పై కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి కొండా సురేఖ కౌంటర్ ఇచ్చారు. రీ సర్వే చేయాలంటే.. కేటీఆర్ ఆయన కుటుంబం దరఖాస్తు చేసుకోవాలన్నారు కొండా సురేఖ్. ఇవాళ ఆమె మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రీ సర్వే అంటున్న కేటీఆర్ తన చెల్లి కవితను చూసి నేర్చుకోవాలన్నారు. సర్వే, ప్రొఫార్మాలో ఎక్కడ తప్పులు జరిగాయో కేటీఆర్ చెప్పాలని ఆమె వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేలలో అసంతృప్తి […]
KTR : ఖమ్మం జిల్లాలోని ప్రత్యేక రాజకీయ సమీకరణాల వల్ల బీఆర్ఎస్కు కొంత నష్టం జరిగిందన్నా కేటీఆర్. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. డిప్యూటీ సీఎంతో కలిపి ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారని, కానీ వరదల సమయంలో వాళ్లతో పైసా ఉపయోగం లేదని ఆయన విమర్శించారు. ఒక కుటుంబం వరద నీళ్లలో చిక్కుకుంటే కనీసం హెలికాప్టర్ తెప్పించి కాపాడాలన్న సోయి మంత్రులకు లేదని ఆయన మండిపడ్డారు. ఎమ్మెల్యేల బర్త్‌డేలకు ఇంకా వేరే పనికిమాలిన పనులకు మంత్రులు హైదరాబాద్ […]
Housing Lands : ప్రభుత్వ భూములను అక్రమంగా కబ్జా చేసే కబ్జాదారుల ఆటలికసాగవు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హౌసింగ్ బోర్డు, డెక్కన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (దిల్) భూముల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ద్విముఖ వ్యూహాన్ని అవలంబిస్తుంది. ఒకవైపు ఉన్న భూములను పరిరక్షిస్తూనే మరోవైపు గతంలో ఆక్రమణలకు గురైన భూములను తిరిగి దక్కించుకునేందుకు నడుం బిగించింది. అలాగే ఈ దిశగా ఇప్పటికే చేపట్టిన చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. అల్పాదాయ, మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వర్గాలకు ఇళ్లు నిర్మించేందుకు […]