KTR : ఖమ్మం జిల్లాలోని ప్రత్యేక రాజకీయ సమీకరణాల వల్ల బీఆర్ఎస్కు కొంత నష్టం జరిగిందన్నా కేటీఆర్. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. డిప్యూటీ సీఎంతో కలిపి ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారని, కానీ వరదల సమయంలో వాళ్లతో పైసా ఉపయోగం లేదని ఆయన విమర్శించారు. ఒక కుటుంబం వరద నీళ్లలో చిక్కుకుంటే కనీసం హెలికాప్టర్ తెప్పించి కాపాడాలన్న సోయి మంత్రులకు లేదని ఆయన మండిపడ్డారు. ఎమ్మెల్యేల బర్త్‌డేలకు ఇంకా వేరే పనికిమాలిన పనులకు మంత్రులు హైదరాబాద్ […]
Housing Lands : ప్రభుత్వ భూములను అక్రమంగా కబ్జా చేసే కబ్జాదారుల ఆటలికసాగవు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హౌసింగ్ బోర్డు, డెక్కన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (దిల్) భూముల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ద్విముఖ వ్యూహాన్ని అవలంబిస్తుంది. ఒకవైపు ఉన్న భూములను పరిరక్షిస్తూనే మరోవైపు గతంలో ఆక్రమణలకు గురైన భూములను తిరిగి దక్కించుకునేందుకు నడుం బిగించింది. అలాగే ఈ దిశగా ఇప్పటికే చేపట్టిన చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. అల్పాదాయ, మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వర్గాలకు ఇళ్లు నిర్మించేందుకు […]
Mandakrishna Madiga : ఎస్సీ వర్గీకరణ కోసం మూడు దశాబ్దాలుగా పోరాటం జరుగుతుందని మందకృష్ణ మాదిగ అన్నారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. చట్టసభలో తీర్మానం చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఎన్నో సందర్భాల్లో రేవంత్ రెడ్డి ఎమ్మార్పీఎస్ కు అండగా ఉన్నారని, షమీమ్ అక్తర్ నివేదికను ఆలస్యం లేకుండా ఆమోదించారన్నారు. వర్గీకరణను స్వాగతిస్తున్నామని, రిజర్వేషన్ పర్సంటేజ్ విషయంలో కొన్ని లోపాలున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. కులాల చేర్పులు మార్పుల్లో లోటుపాట్లపై వినతి పత్రం అందజేశామని, మేం […]
జగన్ 2.oలో ఊహించని అంశాలు ఉండబోతున్నాయా? ఓటమి తర్వాత ఆయన బాగా మారిపోయారా? అందుకే ఇప్పుడు గతానికి పూర్తి భిన్నమైన నిర్ణయాలు తీసుకుంటున్నారా? ఏంటా నిర్ణయాలు? వాటి ప్రభావం ఎంతవరకు ఉండవచ్చంటున్నారు? వైసీపీ ఆవిర్భావం తర్వాత కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఓటు బ్యాంక్ దాదాపుగా ఆ పార్టీకి టర్న్ అయ్యింది. 95 శాతం దాకా కాంగ్రెస్ ఓటర్లను తన వైపునకు తిప్పుకోవటంలో సక్సెస్ అయిన జగన్… కొందరు కీలక నేతల విషయంలో మాత్రం లైట్‌గా ఉన్నారట. అప్పట్లోనే […]
జిల్లా అధ్యక్షుల ఎంపిక అక్కడ బీజేపీలో చిచ్చు పెట్టిందా? కష్టపడ్డవాళ్ళకు కాకుండా…. కాకా రాయుళ్ళకు, చెప్పుచేతల్లో ఉండే వాళ్ళకు పదవులు ఇచ్చారన్న అసంతృప్తి పెరిగిపోతోందా? కనీసం కుల సమీకరణల్ని కూడా చూడకుండా… విచ్చలవిడి పంపకాలు జరిగాయా? కాషాయ కేడర్ సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఎక్కడుంది? ఏ ఉమ్మడి జిల్లాలో తమకు కావాల్సిన వాళ్ళకి పంచేసుకున్నారు? ఉమ్మడి ఆదిలాబాద్ బీజేపీలో జిల్లా అధ్యక్షుల ఎంపిక అంతర్గత కుమ్ములాటలకు దారి తీస్తోందట. అధ్యక్షపదవి కోసం పోటీ పడ్డ […]
CM Revanth Reddy : ఇందిరమ్మ ఇండ్లకు ఉచిత ఇసుకను అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. సామాన్య వినియోగదారులకు తక్కువ ధరకు ఇసుక లభించేలా చర్యలు తీసుకోవాలని, పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని అధికారులను ఆదేశించారు సీఎ రేవంత్ రెడ్డి. బ్లాక్ మార్కెట్ ను అరికట్టి పేదలకు ఇసుక అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్. అధికారులు ఇసుక రీచ్ ల […]
తండేల్ పైరసీ.. అరెస్ట్ చేయిస్తాం.. గ్రూప్ అడ్మిన్స్ కి అల్లు అరవింద్ హెచ్చరిక నాగచైతన్య హీరోగా, సాయిపల్లవి హీరోయిన్ గా చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘తండేల్’. ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాను పైరసీ చేసి ఆన్లైన్లో పెట్టడమే కాదు ఏకంగా ఏపీఎస్ ఆర్టీసీ బస్సులోనూ ప్రదర్శించారు. దీనిపై నిర్మాత బన్ని వాసు, సమర్పకులు అల్లు అరవింద్ ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్ మీట్ లో అల్లు […]
Rythu Bharosa : రైతులకు తెలంగాణ ప్రభుత్వం మరోసారి శుభవార్త అందించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా పథకం కింద నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. జనవరి 26న ప్రారంభమైన ఈ పథకం అమలులో భాగంగా, ఫిబ్రవరి 5న ఒక ఎకరానికి లోపు భూమి కలిగిన రైతులకు నిధులు జమ చేసిన విషయం తెలిసిందే. తాజాగా, సోమవారం ప్రభుత్వం మరోసారి రెండు ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు నిధులను విడుదల చేసింది. […]
CM Revanth Reddy : రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ ని ఫోన్ లో పరామర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయం ఆయన చేస్తామని అన్ని విధాలా అండగా ఉంటామని సీఎం అన్నారు, నిందితుల పై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య , గ్రంధాలయ చైర్మన్ మధుసూదన్ రెడ్డి తో కలసి రంగరాజన్ ని పరామర్శించేందుకు వచ్చిన సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి తో […]
Veera Raghava Reddy : రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్‌పై దాడి ఘటన సంచలనం సృష్టించింది. దాదాపు 20 మందికి పైగా వ్యక్తులు ఆయనపై దాడి చేయడంతో ఆయనతో పాటు ఆయన కుమారుడు కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడిగా గుర్తించిన కొవ్వూరి వీర రాఘవ రెడ్డితో పాటు మరో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మిగతా నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. […]