Duddilla Sridhar Babu: తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రత్యేకంగా మినీ ఇండస్ట్రీయల్ పార్కులను అభివృద్ధి చేసి, మహిళా పారిశ్రామికవేత్తలకు పురిగొల్పే విధంగా చర్యలు తీసుకుంటామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఎఫ్టీసీసీఐ భవనంలో శుక్రవారం జరిగిన “MSME 2024: A Token of Gratitude to Government of Telangana” కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ను ఎస్సీ, ఎస్టీ […]
ఆ రెండు ఉమ్మడి జిల్లాలే తెలంగాణ ఎమ్మెల్సీ అభ్యర్థుల తలరాతల్ని నిర్ణయించబోతున్నాయా? మొత్తం నాలుగు ఉమ్మడి జిల్లాల పరిధిలో ఎన్నికలు జరిగితే రెండు జిల్లాల గురించే ఎందుకు మాట్లాడుకుంటున్నారు? ఏవా జిల్లాలు? ఏంటి వాటికున్న ప్రత్యేకత? ఎమ్మెల్సీ ఎన్నికల యుద్ధం ముగిసింది. ఇక ఫలితమే మిగిలి ఉంది. సాధారణ ఎన్నికలను తలపించిన ఉత్తర తెలంగాణ గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఫలితాలపై ఉత్కంఠ అంతకంతకూ పెరుగుతోంది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 15 మంది బరిలో ఉండగా రికార్డు స్థాయిలో […]
CM Revanth Reddy : పద్మవిభూషణ్ అవార్డు గ్రహిత, ప్రఖ్యాత గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ నాగేశ్వర రెడ్డిని సన్మానించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగు జాతి నుంచి ఒక డాక్టర్గా అరుదైన గౌరవాన్ని పొందిన వ్యక్తిగా నాగేశ్వర రెడ్డిని అభివర్ణించారు. “నాగేశ్వర రెడ్డి గారు భారతదేశానికి అపార సేవలు అందించారు. ఆయన ఇప్పటికే పద్మశ్రీ, పద్మభూషణ్, మరియు తాజాగా పద్మవిభూషణ్ అవార్డులను గెలుచుకున్నారు. నిజానికి, ఆయన భారత రత్నకు కూడా […]
అక్కడ నాయకులంతా మనం మనం బరంపురం అంటున్నారా? పార్టీ ఏదైతేనేం…. రాష్ట్ర స్థాయిలో వాళ్లు ఎలా కొట్టుకుంటే మనకెందుకు? జిల్లాలో మాత్రం కలిసుందామని అనుకుంటున్నారా? ఆగర్భ శతృవుల్లా వ్యవహరించే టీడీపీ, వైసీపీ నాయకులు సైతం ఇక్కడ అంత సీన్ లేదమ్మా అంటున్నారా? ఏ వివాదం తలెత్తినా టీ కప్పులో తుఫాన్లా రెండు రోజుల్లో చల్లారిపోతున్న ఆ జిల్లా ఏది? ఏంటి అక్కడి డిఫరెంట్ రాజకీయం? ఉమ్మడి కర్నూలు. ఒకప్పుడు జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన మహామహుల్ని […]
గత ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణ లేదు.. నిధులను డైవర్ట్ చేశారు.. గత ప్రభుత్వానికి ఆర్థిక క్రమ శిక్షణ లేదు అని మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. మున్సిపల్ శాఖలో ఉన్న నిధులు గత ప్రభుత్వం డైవర్ట్ చేసింది అని ఆరోపించారు. ప్రస్తుత ఎన్డీయే కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నేతృత్వంలో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతోంది అని తేల్చి చెప్పారు. అన్నిటి కంటే ముఖ్యంగా మున్సిపల్ శాఖకు 13 వేల కోట్ల […]
ఇవ్వాల్సిందే…. నాకు పదవి ఇవ్వాల్సిందే…. ఏం ఎందుకివ్వరు? ఉన్నోళ్ళు, జంప్ అయినోళ్ళు… అలా ఎవరెవరికో ఇచ్చేస్తున్నారు…. పార్టీని అంటిపెట్టుకుని వేలాడుతున్న నాకు ఒక్క ఎమ్మెల్సీ ఇవ్వలేరా? ఇదీ… ఆ సీనియర్ కాంగ్రెస్ నాయకుడి వరస. ఇంతకీ ఎవరా నాయకుడు? అంత గట్టిగా డిమాండ్ చేయడం వెనకున్న రీజన్స్ ఏంటి? పొదెం వీరయ్య… భద్రాచలం మాజీ ఎమ్మెల్యే. ప్రస్తుతం తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్గా ఉన్నారు. కానీ… ఆ సీట్లో అంత సంతృప్తిగా లేరట. అందుకే… నాకా […]
నిర్మాత కేదార్ది సహజ మరణం కాదా? ఆయన చనిపోయినప్పుడు ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు పక్కనే ఉన్నారా? కేదార్కి, బీఆర్ఎస్ మాజీలకు ఉన్న లింకేంటి? ఆ టైమ్లో దుబాయ్లో ఆయన పక్కనే ఉన్న ఆ మాజీ ఎమ్మెల్యేలు ఇద్దరూ ఎవరు? లెట్స్ వాచ్. టాలీవుడ్ నిర్మాత కేదార్ మృతి మరకలు గులాబీకి అంటుకుంటున్నట్టు కనిపిస్తోంది. మిస్టీరియస్ మరణాలు జరుగుతున్నాయని, అందులో డ్రగ్స్ కేసు నిందితుడు కేదార్ మృతి కూడా ఒకటని స్వయంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించడంతో […]
CM Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ నిర్ణయాలను ప్రజల వరకు తీసుకెళ్లే అంశంపై చర్చించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీ నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం రేవంత్ మాట్లాడుతూ, “కిషన్ రెడ్డి మాటలు వింటుంటే రైల్లో మనకే డబ్బులు పంపినట్టు మాట్లాడుతున్నారు. ప్రజల నుంచి అడిగి హామీ ఇచ్చినట్లు కనిపిస్తోంది. మేము […]
Meenakshi Natarajan తెలంగాణ రాష్ట్రానికి కొత్తగా నియమితుడైన ఏఐసీసీ ఇంచార్జీ, మీనాక్షి నటరాజన్ శుక్రవారం ఉదయం తెలంగాణ చేరుకున్నారు. ఆమె ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి సాధారణ రైల్లో రావడం విశేషం. కాచిగూడ రైల్వే స్టేషన్కు చేరుకున్న ఆమెను టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఘనంగా స్వాగతించారు. మహేష్ కుమార్ గౌడ్ ఆమెకు కండువా కప్పి మరింత ఆతిథ్యం అందించారు. ఈ ఘట్టం రాష్ట్ర కాంగ్రెస్ నేతల మధ్య ఆనందాన్ని కలిగించింది. మీనాక్షి నటరాజన్ అనంతరం గాంధీ […]
SLBC Incident : తెలంగాణలోని SLBC (శ్రీశైలం లిఫ్ట్ బకింగ్ కెనాల్) టన్నెల్లో చోటుచేసుకున్న ఘోర ప్రమాదంలో ఎనిమిది మంది సజీవ సమాధి అయ్యారు. మృతుల్లో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజనీర్లు ఉన్నారు. ప్రమాదం జరిగినప్పటి నుంచే అధికారులు, రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగి క్షతగాత్రుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. మట్టిలో వారు మూడు మీటర్ల లోతులో కూరుకుపోయినట్లు అధునాతన పరికరాలు సూచించాయి. గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడార్ మెషీన్ ద్వారా మట్టి లో కూరుకుపోయిన 5 […]