Tollywood : నిర్మాతగా మారిన మరొక స్టార్ హీరోయిన్.. కీయురి ప్రొడక్షన్స్ పేరిట బ్యానర్ స్టార్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తన అద్భుతమైన నటనతో దక్షిణాది సినీ ప్రేక్షకులను అలరించి ఎన్నో సూపర్ సినిమాలలో నటించి మెప్పించిన నటి నిత్యా మీనన్. కొంత కాలంగా సినిమాలు కాస్త తగ్గించిన నిత్యా ఇప్పుడు మరో కొత్త బాధ్యతను స్వీకరించారు. కేవలం నటిగానే కాకుండా, తన అభిరుచికి తగ్గ కథలను వెండితెరకు పరిచయం చేసేందుకు ఆమె నిర్మాతగా మారింది. గడచిన మంగళవారం తన సొంత నిర్మాణ సంస్థ ‘కీయురి ప్రొడక్షన్స్’ (Keyuri Productions) లోగో వీడియోను సోషల్ మీడియా వేదికగా విడుదల చేస్తూ అధికారికంగా ప్రకటించారు.
Also Read : Vishwak Sen : మరొక ఫ్లాప్ దర్శకుడితో విశ్వక్ సేన్..
Also Read
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- Producers Council : మళ్లీ రానున్న 'నంది' జాతర.... సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
- PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
ఈ సందర్భంగా నిత్యా మీనన్ ఒక భావోద్వేగపూరితమైన సందేశాన్ని పంచుకున్నారు. “నాకు సినిమాలు తీయడమంటే కేవలం కథలు చెప్పడం మాత్రమే కాదు.. అది చూసేవారిలో, చేసేవారిలో ఒక మార్పును తీసుకురావాలి. నటిగా నా ప్రయాణం మొదలైన రోజు నుంచి ఇదే నా లక్ష్యం. ఇప్పుడు నిర్మాతగా కూడా అదే బాధ్యతను కొనసాగిస్తాను” అని ఆమె తెలిపారు. ‘కీయురి’ అంటే భూమి గుహల నుంచి పుట్టి, కాంతిని ప్రేమించే ఒక రూపం లేని శక్తి అని ఆమె వీడియోలో వివరించారు. నిర్మాతగా మారిన ఈ శుభ సందర్భంలో, తన తొలి తెలుగు చిత్రం ‘అలా మొదలైంది’ విడుదలై 15 ఏళ్లు పూర్తి చేసుకున్న జ్ఞాపకాలను నిత్యా గుర్తుచేసుకున్నారు. ఆ సినిమా షూటింగ్ సమయంలో దర్శకురాలు నందిని రెడ్డి చెప్పిన మాటలు నిజమయ్యాయని, ఒక చిన్న సినిమాగా మొదలైన ఆ ప్రయాణం తన జీవితాన్నే మార్చేసిందని ఆమె ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతానికి కీయురి ప్రొడక్షన్స్ బ్యానర్ కింద ఎలాంటి కొత్త ప్రాజెక్టులను ప్రకటించలేదు. నిత్యా మీనన్ ప్రస్తుతం తాను ఒప్పుకున్న నటన సంబంధిత ప్రాజెక్టులను పూర్తి చేసే పనిలో ఉన్నారు. అవి పూర్తయిన తర్వాత, తన బ్యానర్‌లో వైవిధ్యమైన సినిమాలను పట్టాలెక్కించనున్నారు.
- Tags
తాజావార్తలు
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
-
Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
-
Baa Baa Black Sheep: సినిమా చూస్తే మేఘాలయ ట్రిప్ ఫ్రీ
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!