Advocate Murder : హైదరాబాద్ నగరంలో సంచలనం రేపిన న్యాయవాది ఇజ్రాయిల్ హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. న్యాయవాదిని దారుణంగా హత్య చేసిన వ్యక్తిగా వాచ్ మెన్ దస్తగిరిని అరెస్టు చేశారు. ఈ కేసు వెనుక వ్యక్తిగత కారణాలు ఉన్నట్లు పోలీసులు తేల్చారు. చంపపేటలో వాచ్ మెన్‌గా పనిచేస్తున్న కాంతారావు, దస్తగిరిలలో గత కొంతకాలంగా వివాదం నెలకొని ఉంది. ఈ వివాదానికి కారణం కాంతారావు భార్య కళ్యాణి. దస్తగిరి మరియు కళ్యాణి మధ్య వివాహేతర […]
కేసుల పరంపరలో ఇప్పుడు ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన ఆ మాజీ మంత్రి నంబర్ వచ్చిందా? మినిస్టర్‌గా నాడు ఆయన తీసుకున్న నిర్ణయాలన్నిటినీ కూటమి సర్కార్ జల్లెడ పడుతోందా? కొన్ని విషయాల్లో వెదుకుతున్న తీగలు దొరికాయా?అసలు పక్కా ఆధారాల కోసమే ఇన్నాళ్ళు ఆయన మీద కేసు పెట్టకుండా ఆగారా? ఎవరా మాజీ మంత్రి? ఏ విషయంలో ఆయన బుక్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి? వెలంపల్లి శ్రీనివాస్…వైసీపీ హయాంలో మూడేళ్ళపాటు మంత్రిగా పనిచేశారు. ఆ టైంలో ఆయన తీసుకున్న […]
Betting Apps : ఇంటర్నెట్ విస్తృతంగా ప్రాచుర్యం పొందిన తర్వాత, ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ సంచలనం సృష్టిస్తున్నాయి. ఇప్పుడు, వీటి అక్రమ కార్యకలాపాలను అడ్డుకునేందుకు మియాపూర్ పోలీసులు మరింత ఉగ్రరూపం దాల్చారు. ఇటీవల బెట్టింగ్ యాప్స్ కు సంబంధించిన విచారణను వేగవంతం చేస్తూ పలు ప్రముఖ కంపెనీలపై కేసులు నమోదు చేశారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ను సినీ సెలెబ్రిటీలు, యూట్యూబర్లు భారీగా ప్రమోట్ చేయడం ఇప్పుడు పోలీసుల దృష్టిని ఆకర్షించింది. ఈ యాప్స్ పై దర్యాప్తు […]
ఆ జిల్లాలో పాత రాజకీయం కొత్తగా పురుడుపోసుకుంటోందా? పోగొట్టుకున్న చోటే వెదుక్కోవాలని ఆ నాయకురాలు గట్టిగా ఫిక్స్ అయ్యారా? మాజీ ముఖ్యమంత్రే ఆమె టార్గెట్ అవబోతున్నారా? అందుకే ఏళ్ళుగా జిల్లా రాజకీయాన్ని పట్టించుకోని ఆ మాజీ ఎంపీ ఇప్పుడు స్పెషల్ ఫోకస్ పెడుతున్నారా? ఎవరా నాయకురాలు? ఏంటా ఇంట్రస్టింగ్ పొలిటికల్ డెవలప్మెంట్? ఎవ్వరూ ఊహించని విధంగా కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవి దక్కించుకున్నారు విజయశాంతి. ఆమె పేరు ప్రకటించేదాకా ఆ విషయం రాష్ట్ర పార్టీ […]
ఏపీ కూటమిలో ఏదేదో జరిగిపోతోందా? జనసేన ఎమ్మెల్యేలు కొందరు అసంతృప్తితో రగిలిపోతున్నారా? సీక్రెట్ మీటింగ్ పెట్టుకుని మనకేంటీ ఖర్మ అంటూ… గోడు వెళ్ళబోసుకున్నారా? ఆ రహస్య సమావేశానికి ఓ మంత్రి కూడా హాజరయ్యారా? అసలు జనసేన ఎమ్మెల్యేల ఆవేదన ఏంటి? వాళ్ళు సీక్రెట్‌గా సమావేశం కావాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఆంధ్రప్రదేశ్‌లో కూటమి జట్టు గట్టిగానే కనిపిస్తున్నప్పటికీ… కొన్ని సార్లు మాత్రం ఎక్కడో… తేడా కొడుతోందన్న టాక్ నడుస్తోంది రాజకీయవర్గాల్లో. సందర్భాన్ని బట్టి మూడు పార్టీల వైఖరులు మారుతున్నాయని, […]
Cyber Fraud : సమాజంలో సాంకేతికత పెరుగుతున్న కొద్దీ, దాన్ని అడ్డుపెట్టుకుని మోసాలకు పాల్పడే నేరగాళ్లు కూడా పెరుగుతున్నారు. ఇటీవలి కాలంలో కరెంట్ బిల్లు పెండింగ్ ఉందంటూ ప్రజలను మోసం చేసే సైబర్ నేరగాళ్ల మోసాలు ఎక్కువగా వెలుగుచూస్తున్నాయి. ఆన్లైన్ మోసాలకు గురికాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసు శాఖ హెచ్చరిస్తోంది. సైబర్ నేరగాళ్లు బాధితులకు మెసేజ్ పంపుతూ, “మీ కరెంట్ బిల్లు పెండింగ్ లో ఉంది. ఈరోజు సాయంత్రం లోగా చెల్లించకపోతే మీ ఇంటికి కరెంట్ […]
Paidi Rakesh Reddy : తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి ప్రభుత్వ విద్యా వ్యవస్థపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన మాట్లాడుతూ, బీఆర్ఎస్ ప్రభుత్వం 26 వేల మందిని మాత్రమే రిక్రూట్ చేసిందని, ఇక కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే క్రెడిట్ తీసుకుంటుందని విమర్శించారు. “అంతమందిని రిక్రూట్ చేశారని చెబుతున్నారు. కానీ ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాప్ ఔట్స్ పెరగడం ఏమిటి? గతంలో ఒక్కటే కాలేజీ ఉండేది. ఇప్పుడు 100కు పెరిగాయి. కానీ […]
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో హరితహారం కార్యక్రమంపై ఆసక్తికరమైన చర్చ చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో 200 కోట్ల మొక్కలు నాటామని, దీంతో రాష్ట్రంలోని అటవీ కవచం 7 శాతం పెరిగిందని వివరించారు. దీనిపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ స్పందిస్తూ, హరితహారం పేరుతో నాటిన మొక్కల్లో ఆరోగ్యానికి హానికరమైన కోనోకార్పస్ చెట్లు పెద్ద సంఖ్యలో ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఈ చెట్లు ఆక్సిజన్ […]
KA Paul : బెట్టింగ్ యాప్స్ యువతపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. మాదకద్రవ్యాలకు అలవాటు పడినట్లే, ఆన్లైన్ బెట్టింగ్ కూడా తీవ్రమైన వ్యసనంగా మారుతోంది. ఫలితంగా ఆర్థిక నష్టం, కుటుంబ సమస్యలు, మానసిక ఒత్తిడి వంటి అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయితే.. తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ వ్యవహారం సంచలన రేపుతున్న విషయం తెలిసిందే. అయితే.. తాజాగా ఢిల్లీలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మీడియాతో మాట్లాడుతూ.. మనీ గేమింగ్ – బెట్టింగ్ యాప్స్‌పై సుప్రీంకోర్టులో పిల్ […]
Supreme Court : తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై దాఖలైన పిటిషన్‌పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును పరిశీలించింది. విచారణలో జస్టిస్ గవాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగ ధర్మాసనాల పూర్వపు తీర్పులు ఉన్నప్పటికీ, ఈ వ్యవహారాల్లో ఎప్పటిలోగా తేల్చాలని స్పష్టంగా చెప్పలేదన్నారు. ఉన్నత ధర్మాసనాల తీర్పులను ఎలా తిరిగి రాయగలమని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ధర్మాసనం పలు ప్రశ్నలను సంధించింది. పార్టీ ఫిరాయింపులపై చర్యలు తీసుకోవడానికి […]