RR vs KKR : ఐపీఎల్ 2025లో భాగంగా నేడు జరిగిన రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ మ్యాచ్ అనుకున్నంత ఉత్కంఠ రేకెత్తించలేదు. మ్యాచ్ ప్రారంభంలో టాస్ గెలిచిన కోల్కతా కెప్టెన్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో బ్యాటింగ్కు దిగిన రాజస్థాన్ రాయల్స్ టీం, క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ ఎదురుదెబ్బ తిన్నది. అగ్రశ్రేణి బ్యాట్స్మెన్ నుంచి పెద్ద స్కోర్ రావకపోవడం రాజస్థాన్ రాయల్స్ను దెబ్బతీసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ 29 పరుగులతో తేలికపాటి […]
Harish Rao : తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన అంశం, పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై సుప్రీంకోర్టులో కేసు పెండింగులో ఉన్నా, నిబంధనలకు విరుద్ధంగా అసెంబ్లీలో మాట్లాడారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఆరోపించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు పూర్తిగా పార్లమెంటరీ వ్యవస్థకు వ్యతిరేకమని, కోర్టులో పెండింగులో ఉన్న విషయాలను చట్టసభల్లో ప్రస్తావించకూడదని స్పష్టంగా “కౌల్ అండ్ శకధర్ పార్లమెంటరీ ప్రొసీజర్ బుక్” పేర్కొంటుందన్నారు. ప్రస్తుతం […]
Duddilla Sridhar Babu : రాష్ట్రంలో శాంతి భద్రతలను మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం పటిష్ఠమైన చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. బుధవారం అసెంబ్లీలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ, పోలీసు విభాగాన్ని మరింత సమర్థంగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని వివరించారు. రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సైబర్ నేరాల అదుపు కోసం ఇప్పటికే పోలీసు […]
భారత్లో మైనారిటీల పరిస్థితి క్షీణిస్తోంది.. ‘RAW’పై ఆంక్షలు విధించాలి.. భారతదేశంలో మైనారిటీల స్వేచ్ఛపై మరోసారి యూఎస్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలిజియస్ ఫ్రీడమ్ (USCIRF) తప్పుడు ప్రచారం చేసింది. మంగళవారం తన నివేదికలో భారత్, వియత్నాం దేశాలపై కీలక వ్యాఖ్యలు చేసింది. సిక్కు వేర్పాటువాదుల కుట్రల్లో పాల్గొన్న భారతీయ గూఢచార సంస్థ రీసెర్చ్ అనాలిసిస్ వింగ్(RAW)పై ఆంక్షలు విధించాలని సూచించింది. భారత్లో 2024లో మత స్వేచ్ఛ పరిస్థితి మరింత దిగజారిందని USCIRF నివేదించింది. ముస్లింలు, ఇతర మతపరమైన […]
CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్రంలో విద్యావ్యవస్థ గురించి శాసన మండలిలో జరిగిన చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు దిగజారడానికి ప్రభుత్వమే కాకుండా, సమాజం కూడా జవాబుదారీగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. విద్యావ్యవస్థలో చేపట్టాల్సిన మార్పులు, తీసుకోవాల్సిన నిర్ణయాల గురించి ఆయన వివరణ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం విద్యా కమిషన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. […]
Bhadradri Incident : భద్రాచలం పట్టణంలో ఒక ఆధ్యాత్మిక సంస్థ నిర్మించిన ఆరంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ భవనాన్ని శ్రీనివాస్ అనే వ్యక్తి పాత భవనంపై నిర్మించారు. అయితే, దీనిపై 120కు పైగా ఫిర్యాదులు ఉన్నప్పటికీ, సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకపోవడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. గతంలో కూడా ఈ భవనం నాణ్యతలేమి, నిర్మాణం ప్రామాణికతలేకపోవడం గురించి స్థానికులు ఫిర్యాదు చేసినప్పటికీ, కేవలం తూతూ మంత్రంగా నోటీసులు జారీ చేయడమే […]
MLC Kavitha : తెలంగాణ శాసనమండలిలో రాష్ట్రంలోని విద్యా వ్యవస్థపై జరిగిన స్వల్పకాలిక చర్చలో ఎమ్మెల్సీ కవిత ముఖ్యమైన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ హయాంలో విద్యావ్యవస్థ నాశనం అయిందని ప్రచారం చేసిన వారికి కేంద్ర ప్రభుత్వ గణాంకాలే సమాధానమని ఆమె పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో వెల్లడించిన గణాంకాల ప్రకారం, గత పది సంవత్సరాల్లో తెలంగాణలో విద్యా వ్యవస్థ మెరుగుపడింది. ప్రభుత్వ పాఠశాలల సంఖ్య గణనీయంగా పెరిగిందని, ప్రైవేట్ పాఠశాలల సంఖ్య తగ్గిందని కేంద్ర గణాంకాలే చెబుతున్నాయని […]
Harish Rao : మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రి పై తీవ్ర విమర్శలు చేశారు. కోర్టు జ్యూడిషియల్ వ్యవహారాలపై మాట్లాడొద్దని స్పష్టంగా చెప్పినా, సీఎం సభలో కోర్టును ధిక్కరించి మాట్లాడారని ఆయన ఆరోపించారు. హరీష్ రావు మాట్లాడుతూ, గతంలో ఎలాంటి పరిణామాలు జరగలేదని, ఇప్పుడు కూడా ఏమీ కాదని సీఎం సభలో వ్యాఖ్యానించారని చెప్పారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు కూడా ఏమీ కాదని చెప్పడం ద్వారా సీఎం తన పరిధిని దాటి సుప్రీంకోర్టు పై మాట్లాడారని […]
గర్భిణీ స్త్రీల పథకాన్ని కేంద్రం పట్టించుకోవడం లేదు గర్భిణీ స్త్రీల పథకాన్ని కేంద్రం పట్టించుకోవడం లేదని.. ఈ పథకానికి నిధుల కొరత తీవ్రంగా ఉందని కాంగ్రెస్ అగ్ర నాయకురాలు, ఎంపీ సోనియాగాంధీ ఆరోపించారు. బుధవారం సోనియాగాంధీ రాజ్యసభలో ప్రసంగించారు. జాతీయ ఆహార భద్రతా చట్టం, గర్భిణీ స్త్రీల పథకంపై ప్రసంగించారు. బిడ్డకు జన్మినిచ్చిన తల్లికి రూ.6 వేలు ప్రసూతి ప్రయోజనాలు అందుతాయని.. ఇవి రెండు విడతలుగా చెల్లిస్తారన్నారు. రెండోసారి ఆడబిడ్డ అయితే ఈ పథకం వర్తిస్తుందన్నారు. కానీ […]
CM Revanth Reddy : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి బుధవారం కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో ఉపఎన్నికలు వస్తాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, ఈ అంశంపై ఆయన స్పష్టతనిచ్చారు. తెలంగాణలో ఉపఎన్నికలు రావని ఖరాఖండిగా ప్రకటించిన సీఎం, అసెంబ్లీ సభ్యులు ఎవరూ ఈ విషయంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఉపఎన్నికలపై ఊహాగానాలు చేస్తున్నవారికి సమాధానం ఇస్తూ, ఇలాంటి అంశాలపై కాకుండా ప్రజా సమస్యలపై […]