Physical Harassment : జగిత్యాల జిల్లా విద్యా వర్గాల్లో కలకలం రేపుతున్న ఘటన చోటుచేసుకుంది. జగిత్యాల రూరల్ మండలంలో ఉన్న ఓ ప్రభుత్వ హైస్కూల్ ప్రధానోపాధ్యాయునిపై విద్యార్థినులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. అతను విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్నాడని, కులాలను అడిగి అవమానిస్తూ టచ్ చేస్తున్నాడని విద్యార్థినుల తల్లిదండ్రులు ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఘటనపై విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు కలెక్టరేట్‌కు వెళ్లి జిల్లా విద్యాధికారి (డీఈవో) రాముకు ఫిర్యాదు చేశారు. విద్యార్థినులు తమ సమస్యను వెల్లగక్కుతూ ప్రధానోపాధ్యాయుడు మానసికంగా […]
CM Revanth Reddy : తెలంగాణ ప్రభుత్వం ప్రపంచంలోని అతిపెద్ద ఎకో పార్క్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రతిపాదనలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ (HCU) పరిధిలోని 400 ఎకరాలు మాత్రమే కాకుండా, మొత్తం 1600 ఎకరాలను కూడా కలిపి 2000 ఎకరాల విస్తీర్ణంలో ఈ పార్క్‌ను అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. సింగపూర్ నైట్ సఫారీ, న్యూయార్క్ సెంట్రల్ పార్క్ తరహాలో ఈ ఎకో పార్క్‌ను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ అంశంపై […]
మా త్యాగాలకు మీరిచ్చే విలువ ఇదేనా? సర్దుబాటు పేరుతో మేం ఎప్పటికీ త్యాగరాజులుగానే మిగిలిపోవాల్నా? నిన్నగాక మొన్న వచ్చినవాళ్ళు పెత్తనాలు చేస్తుంటే…. ఐదేళ్ళు నానా తంటాలు పడి కేడర్ని నిలుపుకున్న మేం మాత్రం సినిమా చూసినట్టు చూస్తూ… చప్పట్లు కొట్టాల్నా? ఏంటీ మాకీ ఖర్మ అంటున్నారట కీలకమైన ఆ జిల్లాలోని టీడీపీ లీడర్స్. ఎక్కడుందా పరిస్థితి? ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్ పెరుగుతోంది? 2024 అసెంబ్లీ ఎన్నికల పొత్తులో భాగంగా… ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆరు అసెంబ్లీ […]
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా… ఐదేళ్ళు నిక్షేపంగా కొనసాగాలని కేసీఆర్ కోరుకుంటున్నారా? అవును… మీరేం తప్పుగా వినలేదు. ముమ్మాటికీ నిజమే. రేవంత్‌రెడ్డి సర్కార్ నిక్షేపంగా పూర్తి టర్మ్ పవర్లో ఉండాలని, ఆయుష్మాన్‌భవ అంటూ…. స్వయంగా గులాబీ దళపతే దీవించారట. ఇదేదో… వినడానికి బాగున్నట్టు అనిపిస్తోందిగానీ… ఎక్కడో తేడా కొడుతోందని అనుకుంటున్నారా? ఎస్… మీ డౌట్ నిజమే. ఆ తేడా ఏంటో చూసేయండి. తెలంగాణలో పదేళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రతిపక్షంలోకి వచ్చి 16 నెలలవుతోంది. […]
TTD : తెలంగాణ ప్రజాప్రతినిధులు ఇకపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి ఇచ్చే సిఫార్సు లేఖల కోసం ప్రత్యేకంగా రూపొందించిన పోర్టల్ ద్వారా లేఖలు పంపించాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు, ప్రజాప్రతినిధులు భక్తులకు ఇచ్చే విఐపి బ్రేక్ దర్శనం మరియు రూ. 300 ప్రత్యేక దర్శన టిక్కెట్లకు సంబంధించిన లేఖలన్నీ ఈ పోర్టల్ ద్వారానే సమర్పించాల్సి ఉంటుందని అధికారికంగా ప్రకటించారు. భక్తుల సౌకర్యార్థం తెలంగాణ ప్రభుత్వం ఈ పోర్టల్‌ను ప్రజాప్రతినిధులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇకపై ప్రజాప్రతినిధులు […]
Duddilla Sridhar Babu : రాష్ట్రంలోని ప్రతి నిరుపేద కుటుంబం కడుపు నిండా తినడమే లక్ష్యంగా ప్రభుత్వం సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఈరోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని బీఎల్ఎం గార్డెన్ లో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తో కలిసి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి […]
Jagadish Reddy : నల్లగొండ జిల్లా రాజకీయ వేడిని మరోసారి పెంచుతూ బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం, మంత్రులపై తీవ్ర విమర్శలు చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నా వ్యవసాయ రంగం దుర్దశను ఎదుర్కొంటోందని ఆయన ఆరోపించారు. ఇప్పటివరకు పంటలకు బోనస్ ఇవ్వకపోవడం, రుణమాఫీ అంశం పూర్తిగా మర్చిపోయిన పరిస్థితి వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. ప్రస్తుత మంత్రులు ప్రజాసమస్యలను పట్టించుకోకుండా కేవలం కమిషన్లకే పరిమితమయ్యారని, దళారులకు […]
Etela Rajender : ఢిల్లీలో బీజేపీ ఎంపీల బృందం కేంద్ర మంత్రులను కలిసి పలు సమస్యలను ప్రస్తావించింది. ఎంపీ ఈటల రాజేందర్ సహా పలువురు నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సఫాయి కర్మచారుల సమస్యల నుండి రైల్వే అభివృద్ధి ప్రాజెక్టుల వరకు విస్తృతంగా చర్చలు జరిగాయి. ఈటల రాజేందర్ మాట్లాడుతూ, సఫాయి కర్మచారీలు కేవలం 40 ఏళ్లకే అనేక ఆరోగ్య సమస్యలతో మరణిస్తున్న పరిస్థితి చాలా బాధాకరమని అన్నారు. కరోనా సమయంలో వీరి సేవలను గుర్తించి ప్రధాని […]
Bhatti Vikramarka : నగరంలోని సైబర్ గార్డెన్లో నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం గ్రామానికి చెందిన యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ భూ నిర్వాసితుల కోటాలో ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, “యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్ట్‌లో ఇల్లు కోల్పోయిన ప్రతి ఒక్కరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం. […]
Palla Rajeshwar Reddy : జనగామ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, “దేవాదుల ఫేజ్ 1, ఫేజ్ 2 ప్రాజెక్టును పూర్తిచేసి, ఫేజ్ 3లో మూడు మోటర్లతో 1800 క్యూసెక్కుల నీటి సరఫరా కోసం ఏర్పాట్లు చేసింది కేసీఆర్ ప్రభుత్వం” అని తెలిపారు. అయితే, […]