MLC Kavitha : బీసీల హక్కుల కోసం ఇందిరాపార్క్ వద్ద చేపట్టిన దీక్షలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశంలో బీసీ, ఎస్సీ, ఎస్టీల పట్ల జరుగుతున్న వివక్షను ఆమె తీవ్రంగా ఎండగట్టారు. “ఇది ప్రజాస్వామ్య దేశమా?” అనే ప్రశ్నతో ఆమె వ్యాఖ్యలు ప్రారంభమయ్యాయి. కవిత వివరించిన దయనీయ సంఘటనలో, శ్రీరామనవమి సందర్భంగా రాజస్థాన్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యే టికారాం జుల్లి రామాలయాన్ని దర్శించుకెళ్తే, ఆలయం మైలపడిందని అభిప్రాయపడుతూ సంప్రోక్షణ […]
CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగ పునర్నిర్మాణం వైపు ప్రజా ప్రభుత్వం బలమైన అడుగులు వేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా ట్వీట్టర్ వేదికగా ఒక ముఖ్యమైన ప్రకటన చేశారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 1061 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి మార్గదర్శకాలు విడుదల చేసినట్టు తెలిపారు. ఈ ప్రక్రియను 15 సంవత్సరాల పాటు నిర్వహించకపోవడం నిజంగా షాకింగ్ అని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ పాలనలో విద్య రంగం పట్ల చూపిన నిర్లక్ష్యం […]
పరామర్శకు వెళ్లిన వైఎస్ జగన్.. రాప్తాడులో టెన్షన్ టెన్షన్..! వైఎస్ఆర్ కాంగ్రెస పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన.. ఇప్పుడు రాప్తాడు నియోజకవర్గంలో కాకరేపుతోంది.. ఇటీవల దారుణ హత్యకు గురైన కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు శ్రీసత్యసాయి జిల్లాకు వెళ్లారు జగన్.. రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలంలోని పాపిరెడ్డిపల్లిలో గత నెల 30వ తేదీన వైసీపీ నేత కురుబ లింగమయ్య కుటుంబంపై దాడి చేశారు.. ఈ ఘటనలో లింగమయ్య తీవ్రగాయాలపాలు కాగా.. ఆస్పత్రికి తరలించగా.. […]
Bandi Sanjay : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి సంచలనం రేపే వ్యాఖ్యలు చేశారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్. రాష్ట్రంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ నేత కేటీఆర్ కలిసి పని చేస్తూ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఇద్దరూ రాజకీయ ప్రత్యర్థులుగా కనిపిస్తున్నా, వాస్తవానికి వీరి మధ్య రహస్య ఒప్పందం ఉందని బండి సంజయ్ పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి, కేటీఆర్ జాన్ జబ్బలు అని, ఇద్దరూ కలిసే […]
TGSRTC : తెలంగాణ రాష్ట్ర రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (RTC)లో మరోసారి సమ్మె మేఘాలు కమ్ముకుంటున్నాయి. కార్మికులు, ఉద్యోగులు గత కొంతకాలంగా తమ డిమాండ్ల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నప్పటికీ, అధికార యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే మూడు సార్లు సమ్మె నోటీసులు ఇచ్చిన RTC JAC, తాజా పరిణామాల నేపథ్యంలో మరోసారి సమ్మె మార్గాన్ని ఎంచుకోవడానికి సిద్ధమవుతోంది. ఆర్టీసీ యాజమాన్యం తమ సమస్యలపై చర్చలు జరిపేందుకు ముందుకు రావాలని ఉద్యోగులు కోరుతున్నప్పటికీ, ఇప్పటివరకు […]
MLC Kavitha : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేసి సంచలనం రేపారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను (AI) ప్రమాదకరమని వ్యాఖ్యానించిన నేపథ్యంలో, ఆమె దానిపై కౌంటర్ ఇచ్చారు. “AI అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు… అనుముల ఇంటెలిజెన్స్!” అంటూ ఆవేదన వ్యక్తం చేసిన కవిత, ఈ ‘అనుముల ఇంటెలిజెన్స్’ వల్లే రాష్ట్రానికి ముప్పు ఏర్పడిందని తీవ్ర విమర్శలు చేశారు. అనుముల […]
Harish Rao : తెలంగాణ రాష్ట్రానికి గత పదేళ్లలో సాధించిన అభివృద్ధిని ఒక్క సంవత్సరంలోనే వెనక్కి నెట్టి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు తీవ్రమైన దెబ్బ కొట్టారని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయంలో గణనీయమైన తగ్గుదల నేపథ్యంలో, ట్విటర్ వేదికగా ఆయన ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. హరీష్ రావు పేర్కొన్న వివరాల ప్రకారం, బీఆర్ఎస్ పాలనలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ప్రతి సంవత్సరం సగటున 25.62 శాతం […]
నిరాహార దీక్ష విరమించిన రైతు నేత జగ్జిత్ సింగ్ దల్లెవాల్.. సీనియర్ రైతు నాయకుడు జగ్జిత్ సింగ్ దల్లెవాల్ 131 రోజుల తర్వాత ఆదివారం నిరవధిక నిరాహార దీక్షను విరమించారు. పంటలకు కనీస మద్దతు ధరలపై (MSP) చట్టపరమైన హామీని, రైతుల డిమాండ్లపై ఆయన గత ఏడాది నవంబర్ 26న నిరాహార దీక్ష ప్రారంభించారు. ఆదివారం రోజున ఫతేగఢ్ సాహిబ్ జిల్లాలోని సిర్హింద్లో జరిగిన కిసాన్ మహాపంచాయత్లో జరిగిన రైతులు సమావేశంలో నిరాహార దీక్ష విరమించే నిర్ణయాన్ని […]
Murder : ముషీరాబాద్ పీఎస్ పరిధిలో మిస్సింగ్ కేసు నమోదు అయిన వ్యక్తి స్వప్నం సింగ్ (59) దారుణ హత్యకు గురయ్యాడు. ఈ నెల నాలుగో తేదీన అల్వాల్ నుంచి బయలుదేరి తిరిగి ఇంటికి వెళ్లకపోవడంతో కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అల్వాల్ పిఎస్ లో 0 ఎఫైర్ నమోదు చేసి ముషీరాబాద్ పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. అల్వాల్ లో నివాసం ఉండే స్వప్నం సింగ్ తన సోదరుడు హరిదీప్ సింగ్ ను ముషీరాబాద్ […]
Bhadradri : శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని భద్రాచలంలో జరిగిన రాముల వారి కళ్యాణ మహోత్సవానికి హాజరయ్యేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ నేపధ్యంలో భద్రాచలం పట్టణం వాహనాలతో కిక్కిరిసిపోయింది. దాదాపు నాలుగు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడగా, మూడు గంటలకుపైగా వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అభిజిత్ లగ్నం సమయంలో జరిగిన కళ్యాణ మహోత్సవం ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించబడింది. దీన్ని వీక్షించేందుకు టెంపోలుగా, బస్సులుగా, కార్లుగా, ద్విచక్ర వాహనాలుగా భక్తులు సమీప ప్రాంతాల నుండి […]