Duddilla Sridhar Babu : తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తాజాగా NTVకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాష్ట్రంలో డిజిటల్ సేవల విస్తరణపై కీలక ప్రకటనలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ ఇంటర్నెట్, టెలిఫోన్, కంప్యూటర్ సేవలను తక్కువ ధరలో అందించేందుకు ప్రభుత్వం నూతన ప్రణాళికతో ముందుకు వెళ్తుందని ఆయన తెలిపారు. “ఇప్పటి వరకు ఉన్న T-Fiber సేవలను మరింత విస్తరించి, నూతన సర్వీసులు జత చేస్తూ T-NXTగా ఆవిష్కరిస్తున్నాం,” అని మంత్రి చెప్పారు. ప్రతి ఇంటికి […]
రేపు వారణాసిలో మోడీ పర్యటన.. పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన ప్రధాని మోడీ శుక్రవారం ఉత్తరప్రదేశ్లోని సొంత నియోజకవర్గం వారణాసిలో పర్యటించనున్నారు. రూ.3,880 కోట్ల విలువైన 44 ప్రాజెక్టులకు మోడీ శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం బహిరంగ సభను ఉద్దేశించి ప్రధాని మాట్లాడనున్నారు. ఏప్రిల్ 11న ఉదయం 10 గంటలకు ప్రధాని మోడీ వారణాసి లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయానికి రానున్నారు. ప్రధాని పర్యటన సందర్భంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. 4,000 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు […]
Minister Seethakka : తెలంగాణ సచివాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, డైరెక్టర్ కాంతి వెస్లీ, ఇతర అధికారులు, జిల్లా సంక్షేమ అధికారులు (DWOs) పాల్గొన్నారు. సీతక్క పేర్కొన్నట్టుగా, “పోషకాహార తెలంగాణే మన లక్ష్యం. అందుకు అంగన్వాడీ సిబ్బంది చిత్తశుద్ధితో పని చేయాలి.” రాష్ట్రంలో 313 అంగన్వాడీ కేంద్రాలు ఇంకా తెరుచుకోకపోవడాన్ని తప్పుపడుతూ, చిన్నారులు లేరనే సాకుతో […]
Uttam Kumar Reddy : తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సన్న బియ్యం పంపిణీ పథకం దేశవ్యాప్తంగా మరెక్కడా లేని విధంగా విస్తృతంగా కొనసాగుతోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ పథకాన్ని పూర్తి పర్యవేక్షణతో నిర్వహించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. “ఇది సామాన్య ప్రజల జీవన ప్రమాణాన్ని మెరుగుపరిచే గొప్ప కార్యక్రమం. మూడు కోట్ల మందికి ప్రతి నెలా నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం మన తెలంగాణే. దేశంలో […]
Harish Rao : కంచ గచ్చిబౌలి భూములపై తెలంగాణ మాజీ మంత్రి టీ. హరీష్ రావు కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్లు వెల్లడించారు. ప్రభుత్వం తీసుకున్న విధానంపై ప్రశ్నలెత్తుతూ, కేంద్ర కమిటీకి అవసరమైన డాక్యుమెంట్లు అందించామని తెలిపారు. “ఎవరైనా చెట్టు నరకాలంటే అటవీశాఖ అనుమతి తప్పనిసరి. వాల్టా చట్టం ప్రకారం కూడా చెట్లు రక్షించాల్సిందే,” అని హరీష్ రావు పేర్కొన్నారు. ప్రభుత్వం స్వయంగా చెట్లు నరికిందని ఆరోపించారు. ఈ విషయంలో TGIIC స్వయంగా పోలీసులను సంప్రదించి రక్షణ […]
Duddilla Sridhar Babu : తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తాజాగా T-ఫైబర్ ఆఫీస్ లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మారుమూల ప్రాంతాల ప్రజలందరికీ ఇంటర్నెట్ కనెక్టివిటీ అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. శ్రీధర్ బాబు పేర్కొన్నదానినిబట్టి, ఇప్పటికే దాదాపు 20 జిల్లాల్లో ఫైబర్ కనెక్టివిటీ కార్యక్రమం తుది దశలో ఉంది. త్వరలోనే ఆ ప్రాంతాలకు సేవలు అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. “ఇంటర్నెట్, టెలిఫోన్, టెలివిజన్ […]
Bhatti vikramarka : కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుల సమక్షంలో రాహుల్ గాంధీ పార్టీ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. అట్టడుగు వర్గాలు స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని ఆయన సంకల్పించారని తెలిపారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో బుధవారం జరిగిన ఏఐసీసీ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, జూపల్లి కృష్ణారావు, తుమ్మల […]
ఆ నియోజకవర్గంలో కారు వోవర్ లోడ్ అయిందా? పేరుకు అంతా లీడర్సేగానీ….స్టీరింగ్ పట్టుకునే వాళ్ళు కరవయ్యారా? అసలు డ్రైవర్ సీటే ఖాళీ లేనంతగా పార్టీ ఉక్కిరి బిక్కిరి అవుతోందా? చివరికి వర్గపోరు ఆ మాజీ ఎమ్మెల్యేకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుందా? ఎక్కడుందా పరిస్థితి? ఏంటా ఈక్వేషన్స్? నకిరేకల్ అసెంబ్లీ నియోజకవర్గంలో కారు ఓవర్ లోడ్ అయ్యిందట. స్టీరింగ్ మాక్కావాలంటే… మాక్కావాలంటూ పలువురు నేతలు చూపుతున్న ఉత్సాహమే ఇందుకు కారణమంటున్నాయి బీఆర్ఎస్ వర్గాలు. ఇక్కడ కేడర్కంటే లీడర్స్ […]
అక్కడ ప్రత్యర్థులతో పని లేకుండా టీడీపీలోని రెండు వర్గాలే గుద్దులాటకు దిగుతున్నాయా? సాక్షాత్తు ఇన్ఛార్జ్ మంత్రి సమక్షంలోనే నువ్వెంత అంటే నువ్వెంత అనుకునేదాకా వ్యవహారం వెళ్ళిందా? పార్టీ అధిష్టానం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆ నియోజకవర్గంలో పరిస్థితి అంతకంతకూ దిగజారుతోందా? ఏదా సెగ్మెంట్? ఎవరా ఇద్దరు? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పెట్టని కోట పులివెందుల. గడిచిన 45 ఏళ్ళుగా వైఎస్ కుటుంబానిదే ఇక్కడ హవా. అలాంటి కోటను ఎందుకు బద్దలు కొట్టకూడదు? పసుపు జెండా ఎందుకు ఎగరేయకూడదన్నది […]
ఆంధ్రప్రదేశ్ బీజేపీలో సన్నివేశాలు కాస్త తేడాగా కనిపిస్తున్నాయా? కొద్దో గొప్పో పసుపు ఫ్లేవర్ తగిలితేనే కాషాయ దళంలో పదవులు దక్కుతున్నాయా? పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్నామంటూ జబ్బలు చరుచుకునేవారికి చివరికి మిగిలేదా వాపులు, కాపడాలేనా? ఏపీ కమలంలో ఆశ నిరాశల మధ్య ఊగిసలాడే వాళ్ళ సంఖ్య పెరుగుతోందా? పార్టీలో అసలేం జరుగుతోంది? నాయకులు ఏమని మాట్లాడుకుంటున్నారు? కేవలం కాషాయం ఒక్కటే ఉంటే సరిపోదు…. అదనంగా కాస్త పసుపు కలర్ని జోడిస్తేనే పదవులు అంటూ ఆంధ్రప్రదేశ్ బీజేపీలో మాట్లాడుకుంటున్నారట. […]