ఏపీ బీజేపీ నేతలు వర్గాలుగా విడిపోయారా ? పార్టీ బలోపేతాన్ని పక్కన పెట్టేసి…ఆధిపత్యం కోసం ఎత్తులు పైఎత్తులు వేసుకుంటున్నారా ? మా టైం వచ్చిందని చెబుతున్నదెవరు ? ఆ సీనియర్ నేతకు పదవి రావడంతోనే…కమలం దళంలో చీలికలు వచ్చాయా ? ఇంతకీ ఎవరా నేతలు ? ఆంధ్రప్రదేశ్ బీజేపీలో కొత్త వివాదం మొదలైంది. నిన్న మొన్నటి దాకా…ఎలాంటి గ్రూపులు లేకుండా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కార్యకర్తలు పని చేశారు. మంచి ఫలితాలు కూడా వచ్చాయి. రాష్ట్ర పార్టీ […]
TGTET 2025 : తెలంగాణ ప్రభుత్వం విద్యాభ్యాస లక్ష్యంగా ప్రతి ఏడాది నిర్వహించే టెట్ (Teacher Eligibility Test) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఉపాధ్యాయులుగా ఉద్యోగం పొందాలనుకునే అభ్యర్థులకు ఇది ఎంతో కీలకమైన పరీక్ష. ఈ పరీక్ష ద్వారా పాఠశాలల ఉపాధ్యాయ పోస్టులకు అర్హత సాధించవచ్చు. ఈ ఏడాది టెట్ పరీక్షలు జూన్ 15 నుండి 30 మధ్య నిర్వహించనున్నారు. అధికారికంగా విడుదలైన షెడ్యూల్ ప్రకారం, ఈ నెల 15వ తేదీ నుంచి 30వ తేదీ వరకు […]
CM Revanth Reddy : మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. బాపూఘాట్లో నిర్మించ తలపెట్టిన గాంధీ సరోవర్తో పాటు మీర్ అలం ట్యాంక్ పై నిర్మించనున్న బ్రిడ్జి నమూనాలను సీఎం పరిశీలించారు. మీర్ అలం ట్యాంక్‌పై బ్రిడ్జి నిర్మాణ పనులకు జూన్‌లో టెండర్లు పిలవాలని ముఖ్యమంత్రి అన్నారు. ఈలోగా అందుకు అవసరమైన సర్వేలు, నివేదికలు, ప్రతిపాదనలు, డిజైన్లతో డీపీఆర్‌ను సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. శుక్రవారం కమాండ్ కంట్రోల్ సెంటర్ […]
గోశాలలో గోవుల మృతిపై స్పందించిన టీటీడీ.. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి చెందిన గోశాలలో గోవులు మృతిచెందాయంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి.. ఇక, ఈ వ్యవహారంపై టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత భూమన కరుణాకర్‌రెడ్డి.. టీటీడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఇలా అందరిపై ఆరోపణలు గుప్పించారు.. హిందూ ధర్మ పరిరక్షణ ధ్యేయం అంటున్న ఎన్డీఏ ప్రభుత్వంలో వందకు పైగా గోవులు చనిపోయాయని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. టీటీడీ […]
Traffic Advisory : ఏప్రిల్ 12వ తేదీన హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్ నగరంలో ఘనంగా హనుమాన్ శోభాయాత్ర నిర్వహించనున్నారు. ఈ శోభాయాత్ర గౌలిగూడలోని శ్రీ రామమందిరం వద్ద ఉదయం 11 గంటలకు ప్రారంభమై, నగరంలోని పలు కీలక ప్రాంతాల గుండా సాగుతూ తాడ్బండ్లోని శ్రీ హనుమాన్ మందిరం వద్ద ముగుస్తుంది. శోభాయాత్ర మార్గం పుత్లిబౌలి క్రాస్ రోడ్స్, ఆంధ్రా బ్యాంక్ క్రాస్ రోడ్స్, కోఠి, సుల్తాన్ బజార్ క్రాస్ రోడ్స్, రామ్‌కోఠి క్రాస్ రోడ్స్, కాచిగూడ […]
Fake Seeds : నకిలీ విత్తనాల మాఫియా కొత్త పంథాలో అడుగులు వేస్తోంది. పశువుల దాణా పేరుతో నిషేధిత విత్తనాలను సరఫరా చేస్తూ, ఆంధ్రప్రదేశ్ నుంచి వివిధ జిల్లాలకు పార్సిల్ రూపంలో పంపిస్తున్నారు. అధికారులు ఈ నకిలీ విత్తనాల దందాపై కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ, మాఫియా కేటుగాళ్లు మాత్రం కొత్త మార్గాలతో ముందుకు సాగుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో, ముఖ్యంగా కుమరంభీం , మంచిర్యాల జిల్లాల్లో నకిలీ విత్తనాల దందా ఊపందుకుంది. ఇటీవల పోలీసులు బస్తాల కొద్దీ […]
Ponguleti Srinivas Reddy : రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో మాట్లాడుతూ, ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి అంకితమై పనిచేస్తోందని పేర్కొన్నారు. ప్రగతి భవన్‌ను జ్యోతి రావు ఫూలే భవనంగా మార్చిన ఘనత కూడా ఈ ప్రభుత్వానిదేనని అన్నారు. ఇది ప్రజలకు గౌరవం ఇచ్చే ముఖ్యమైన చిహ్నంగా నిలుస్తుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో ధరణిలో చోటుచేసుకున్న అవకతవకలన్నీ సరి చేయడం కోసం కొత్త భూభారతి చట్టాన్ని తీసుకువచ్చామని తెలిపారు. […]
Duddilla Sridhar Babu : మంత్రి శ్రీధర్ బాబు ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నేతృత్వంలోని లక్ష్యాలను స్పష్టంగా వెల్లడించారు. సిరిసిల్లను నేతన్నలకి నిలయంగా అభివర్ణిస్తూ, రాష్ట్రంలో చేనేత కార్మికుల బతుకులకు ఉజ్వల భవిష్యత్ అందించాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. దేశవ్యాప్తంగా చేనేత రంగానికి గుర్తింపు కల్పించేందుకు ప్రభుత్వం సంకల్పబద్ధంగా పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. వేములవాడ ఆలయం గురించి ప్రస్తావిస్తూ, ఇది దేశ […]
Tummala Nageswara Rao : రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతన్న, నేతన్నలే అగ్ర ప్రాధాన్యం అని స్పష్టం చేశారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం సంకల్పంతో పని చేస్తోందని, రైతన్నలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ఇప్పటికే అనేక నిర్ణయాలు తీసుకున్నామని ఆయన తెలిపారు. గత పదేళ్లలో రాష్ట్రాన్ని విధ్వంసం తాకినప్పటికీ, రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ అభివృద్ధి […]
TGPSC : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) గురువారం ఓ ముఖ్య ప్రకటనను విడుదల చేసింది. మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (CDPO), అదనపు చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్, ఐసీడీఎస్ వెర్హౌస్ మేనేజర్ పోస్టుల భర్తీకి సంబంధించి ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 23వ తేదీన సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ ప్రక్రియ సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం (పాత […]