Tirupati : వేసవి సెలవుల సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు టూర్లకు, పుణ్యక్షేత్రాల దర్శనాలకు పెద్ద సంఖ్యలో ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగిన వేళ, దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక చర్యలు చేపట్టింది. తిరుపతి దిశగా వెళ్లే ప్రయాణికుల కోసం మొత్తం 8 స్పెషల్ ట్రైన్లు నడిపేందుకు నిర్ణయం తీసుకుంది.
Suicide : పెళ్లి నిశ్చితార్థం ముందు స్నేహితుడి హత్య చూసి జీవితాన్ని విడిచిన యువకుడు
ఈ స్పెషల్ ట్రైన్లు సికింద్రాబాద్ – తిరుపతి మార్గంలో, వికారాబాద్, గుంతకల్ మీదుగా నడవనున్నాయి.
ప్రత్యేక ట్రైన్ల వివరాలు ఇలా ఉన్నాయి:
ట్రైన్ నెం. 07257.. మే 8 నుంచి 29 వరకు, ప్రతి గురువారం సాయంత్రం 4.30 గంటలకు చర్లపల్లి నుంచి తిరుపతికి రవాణా అవుతుంది. ట్రైన్ నెం. 07258.. మే 9 నుంచి 30 వరకు, ప్రతి శుక్రవారం తిరుపతి నుంచి చర్లపల్లి జంక్షన్‌కు తిరుగు ప్రయాణం చేస్తుంది.
ఈ స్పెషల్ ట్రైన్లు సనత్‌నగర్, లింగంపల్లి, వికారాబాద్, తాండూరు, సెడాం, యాద్గిర్, కృష్ణ, రాయచూర్, మంత్రాలయం, ఆదోని, గుంతకల్, గుత్తి, తాడిపర్తి, యర్రగుంట్ల, కడప, రాజంపేట్, కోడూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతాయి. ఈ స్పెషల్ సర్వీసుల ద్వారా వేసవి రద్దీలో తిరుమల వెళ్లే భక్తులకు గణనీయమైన ఉపశమనం లభించే అవకాశం ఉంది.
New Rules: మే 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే.. సామాన్యుల జేబుపై ప్రభావం!