Suicide : సికింద్రాబాద్‌లోని వారాసిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఒక విషాద సంఘటన కలకలం రేపింది. మయ్ 4న నిశ్చితార్థం జరగాల్సిన యువకుడు, తన మిత్రుడు హత్యకు గురవడం చూసి తీవ్ర మానసిక ఆందోళనతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ రెండు ఘటనలు ఒక్కరోజే చోటుచేసుకోవడం తీవ్ర చర్చకు దారితీసింది. బౌద్ధనగర్‌కు చెందిన మోహన్ కృష్ణ అనే బైక్ మెకానిక్‌కు పెళ్లి నిశ్చితార్థం మే 4న జరగాల్సి ఉంది. అయితే, నిశ్చితార్థానికి ముందు అంటే ఏప్రిల్ 27 రాత్రి మోహన్ తన స్నేహితులు శ్యాంసన్ రాజు, మరికొందరితో కలిసి మద్యం పార్టీ ఏర్పాటు చేశాడు. పార్టీ సమయంలో శ్యాంసన్ రాజు , అతని బావ లూథరస్ మధ్య తీవ్ర మాటల తూటాలు పేలాయి. తీవ్రంగా చినగిపోయిన గొడవలో, లూథరస్ తన బావ శ్యాంసన్ రాజును ఇనుప రాడ్‌తో తలపై బలంగా కొట్టాడు. ఈ దాడిలో శ్యాంసన్ స్పాట్‌లోనే మృతిచెందాడు.
Nara Lokesh: సింహాచలం ఘటన తీవ్ర ఆవేదనకు గురి చేసింది
ఈ ఘటనను తన కళ్లారా చూసిన మోహన్ కృష్ణ తీవ్ర దైర్యభంగం చెందాడు. పెళ్లి కావాల్సిన ఈ సమయంలో తాను పోలీస్ స్టేషన్‌లకు, కోర్టులకు తిరగాల్సి వస్తుందని, హత్య కేసులో ప్రత్యక్ష సాక్షిగా నిలవాల్సి వస్తుందన్న భయంతో మానసికంగా కుంగిపోయాడు. ఎలాంటి ఆలోచనలకు లోనై చివరకు ఉరి వేసుకుని ప్రాణాలు విడిచాడు. పోలీసులు మొదట శ్యాంసన్ రాజు హత్య కేసును పార్షిగుట్టలో, మోహన్ కృష్ణ ఆత్మహత్య కేసును వారాసిగూడలో వేర్వేరుగా నమోదు చేశారు. అయితే, విచారణలో ఈ రెండు కేసులు ఒకే సందర్భానికి చెందినవని గుర్తించారు. మోహన్ ఆత్మహత్యకు శ్యాంసన్ హత్యను ప్రత్యక్షంగా చూడడం ప్రధాన కారణమని నిర్ధారించారు. ఈ ఘటన స్నేహితుల మధ్య గొడవ ఎలా ప్రాణాలను బలితీసుకుంటుందో మళ్ళీ ఒకసారి నిరూపించింది. సంతోషకరమైన వేడుకకు సన్నాహాలు చేస్తుండగా, ఒక్క అనూహ్య సంఘటన రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.
Imran Khan: పహల్గామ్ ఘటన మనసు కలిచివేసింది.. భారత్ నిందలు వేయడం తగదన్న పాక్ మాజీ ప్రధాని