యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ పాలక మండలి ఏర్పాటుకు ఎందుకు ముందడుగు పడటం లేదు? రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తూ….చట్ట సవరణ చేశాక కూడా… ఎక్కడ తేడా కొడుతోంది? నెలల తరబడి కసరత్తులు జరుగుతున్నా…. పాలకమండలి ఎంపిక కొలిక్కి రాకపోవడానికి కారణాలేంటి? ప్రభుత్వ పెద్దలకు ఎలాంటి సవాళ్ళు ఎదురవుతున్నాయి? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక… తిరుమల తిరుపతి దేవస్థానాల బోర్డ్ తరహాలో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి కూడా బోర్డ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం […]
మినీమహానాడు వేదికగా ఆ టీడీపీ సీనియర్ లీడర్ కమ్ ఎమ్మెల్యే బాంబ్ పేల్చారు. మంత్రులకో న్యాయం, మాకో మరో న్యాయమా….? అంటూ పార్టీ డైరెక్ట్‌గా అధిష్టానాన్ని నిలదీశారు. ఎందుకీ వివక్ష అన్న ప్రస్తావన లేవనెత్తిన ఆ సీనియర్ శాసనసభ్యుడు ఎవరు? మిస్టర్ కూల్ ఇమేజ్ వున్న ఆ మాజీమంత్రి ఎందుకు బరస్ట్ అయ్యారు? ఎవరిమీద ఆయన ఆక్రోశం? ఉత్తరాంధ్ర టీడీపీలో…. సీనియర్ లీడర్ బండారు సత్యనారాయణ మూర్తిది డిఫరెంట్ పొలిటికల్ స్టైల్. మండలాధ్యక్షుడి నుంచి మంత్రి వరకు […]
కర్ణాటకలో కాంగ్రెస్ ఖతం.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీదే అధికారం.. రెండేళ్ల పాలనలోనే కాంగ్రెస్ పాలన పట్ల కర్ణాటక ప్రజల్లో అసంతృప్తి పెరిగినట్లు తాజాగా సర్వేలో తేలింది. పీపుల్స్ పల్స్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఇప్పటికిప్పుడు కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరిగితే బీజేపీ ఘన విజయం సాధిస్తుందని సర్వే చెప్పింది. అయితే, ఇప్పటికీ సిద్ధరామయ్య రాష్ట్రంలో అత్యధిక మంది ఇష్టపడే ముఖ్యమంత్రి ఫేస్‌గా ఉన్నారని సర్వే చెప్పింది. మొత్తం, 10,481 మంది సర్వేలో ప్రతిస్పందించారు. సర్వే ప్రకారం, […]
అది స్వపక్షమైనా, విపక్షమైనా…. ప్రత్యర్థులన్నవాళ్ళు లేకుండా చేసుకోవడమే ఆ ఎమ్మెల్యే లక్ష్యమా? విపక్ష శిబిరంలో ఉన్న కాస్తో కూస్తో పవర్‌ని లాగేసే కార్యక్రమం పూర్తయ్యాక… ఇప్పుడు టీడీపీలోని ప్రత్యర్ధులపై దృష్టి పెట్టారా? వాళ్ళని తరిమేయండని మినీ మహానాడు సాక్షిగా కేడర్‌కు పిలుపునివ్వడాన్ని ఎలా చూడాలి? ఎవరా ఎమ్మెల్యే? ఎందుకు ఆ స్థాయిలో ఫైర్ మీదున్నారు? రెండు దశాబ్దాలుగా కడప అసెంబ్లీ సీటులో సైకిల్ పార్టీకి గెలుపన్నదే లేదు. నియోజకవర్గంలో టీడీపీ ఉనికే ప్రమాదంలో పడిన సమయంలో 2024 […]
అక్కడ కాంగ్రెస్ పార్టీలో మూడు ముక్కలాట జోరుగా నడుస్తోందా? ఓ కాంగ్రెస్, బీ కాంగ్రెస్ అంటూ వర్గాలుగా విడిపోయి తన్నుకుని తలంట్లు పోసుకుంటున్నారా? చివరికి పార్టీ సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశాన్నే రసాభాస చేసుకున్నారా? ఆ యుద్ధం అసలు అధిష్టానం చెక్ పెట్టగలిగే స్థాయిలో ఉందా? ఏ నియోజకవర్గంలో ఉందా పరిస్థితి? మూడు ముక్కలాట ఆడుతున్న ఆ నాయకులెవరు? వికారాబాద్ జిల్లా అధికార పార్టీలో నేతల మధ్య ఐక్యత లోపించింది. ఇక్కడ అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే […]
Nak*ed : మన సమాజంలో రోజు రోజుకీ ఏదో ఒక విచిత్ర ఘటన మన ముందుకు వస్తోంది. కొన్ని సంఘటనలు విని అవాక్కవ్వాల్సిందే. ఉత్తరప్రదేశ్‌లో ఇటువంటి ఒక ఆఘాతకరమైన, నమ్మశక్యంకాని ఘటన వెలుగులోకి వచ్చింది. “నా భర్త థర్డ్ జండర్‌గా వేషం వేసుకుని అశ్లీల వీడియోలు తీయడం ద్వారా డబ్బు సంపాదిస్తున్నాడు” అంటూ ఓ మహిళ చేసిన ఆరోపణలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని సంతో కబీర్‌నగర్ జిల్లాలో చోటు […]
Uttam Kumar Reddy : హుజూర్‌నగర్‌లో ఇరిగేషన్ శాఖ అధికారులతో తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపేలా ఉన్నాయి. కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీ అవకతవకలు జరిగాయని ఆయన బహిరంగంగా ఆరోపించారు. నిజాలు బయటపడేందుకు ఘోష్ కమిషన్‌ను ఏర్పాటు చేసినట్టు స్పష్టం చేశారు. కాలేశ్వరం ప్రాజెక్టులో మూడు బ్యారేజీల ఫౌండేషన్లోనే లోపాలు ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. “బెరాజీలు కూలిపోయే […]
Harish Rao : కాళేశ్వరం ప్రాజెక్టుపై మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు విమర్శలు గుప్పించారు. కాళేశ్వరం నిర్మాణంపై ఇష్టారీతిగా వ్యాఖ్యానిస్తున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మతి భ్రమించినట్టే కనిపిస్తుందని హరీష్ రావు ఎద్దేవా చేశారు. ఒకే అబద్దాన్ని పదే పదే చెబితే ప్రజలు నమ్ముతారన్న భ్రమలో ఉన్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని రిజర్వాయర్లు, పంప్‌హౌజ్‌లను వాడుకుంటూనే ప్రాజెక్టును ‘వైట్ […]
ఆ ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఉన్నా లొల్లే, రాజధానికి వచ్చినా లొల్లేనా? గాలికి పోయే కంపను గుడ్డకు తగిలించుకోనిదే ఆయనకు నిద్ర పట్టదా? ఎప్పుడూ ఏదో ఒక వివాదాన్ని నెత్తినేసుకుని తిరిగితే తప్ప ఆయనకు రాజకీయం చేసినట్టు ఉండదా? కేరాఫ్ కాంట్రవర్శీ లిస్ట్‌లో చేరుతున్న ఆ శాసనసభ్యుడు ఎవరు? ఆయన కదిపిన తాజా తుట్టె ఏంటి? ఓపెన్‌గా ఉండాలి. బోళాగా మాట్లాడాలని అనుకుంటూ ఉంటారు కొందరు రాజకీయ నాయకులు. ఆ తత్వం వాళ్ళని ఒక్కోసారి సమస్యల నుంచి బయటపడేస్తే… […]
Siraj : ఉగ్రకదలికలపై తీవ్ర దృష్టిసారించిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), హైదరాబాద్‌లో కీలకంగా మకాం వేసిన సిరాజ్ అనే వ్యక్తి చుట్టూ దర్యాప్తును ముమ్మరం చేసింది. గత ఏడు సంవత్సరాలుగా గ్రూప్స్ పరీక్షల శిక్షణ పేరుతో హైదరాబాద్‌లో తిష్ట వేసిన సిరాజ్, పక్కా వ్యూహంతో కార్యకలాపాలను సాగించినట్లు అధికారులు గుర్తించారు. సిరాజ్‌తో కలిసి ఉన్న సమీర్ అనే వ్యక్తి – హైదరాబాద్, విజయనగరం, ఢిల్లీ, బెంగళూరు, ముంబైలో రెక్కీ చేసినట్లు తెలిసింది. గత సంవత్సరం నవంబరు […]