ఇజ్రాయెల్ అంతిమ యుద్ధం చేస్తామంటోంది. ఇరాన్ ఇజ్రాయెల్ ను తుడిచిపెడతామంటోంది. ఏకంగా అమెరికాకు హెచ్చరికలు జారీ చేసింది. ఇజ్రాయెల్ వైమానిక దళానికి, ఇరాన్ క్షిపణుల సామర్థ్యానికి మధ్య నేరుగా పోరు జరుగుతోంది. రెండువైపులా జరుగుతున్న నష్టం తీవ్రంగానే ఉందనే అంచనాలున్నాయి. యుద్ధం కొనసాగితే.. ఇరాన్ తో పాటు ఇజ్రాయెల్ కు ఆర్థిక కష్టాలు తప్పేలా లేవు. ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్ హమాస్ ఘర్షణతో తల్లడిల్లుతున్న ప్రపంచానికి.. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య అనుకోని యుద్ధం కొత్త షాక్ ఇచ్చింది. […]
కేంద్రం కీలక నిర్ణయం.. కొత్త నిబంధనలు జారీ అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. భవనాలు, చెట్లు కారణంగా విమాన రాకపోకలకు అడ్డంకిగా మారడంతో వాటి తొలగింపునకు కేంద్రం కొత్త నిబంధనలు జారీ చేసింది. ఎయిర్పోర్ట్ సమీపంలో ఉన్న భవనాలు లేదా చెట్లు విమానయానానికి అడ్డంకిగా ఉన్నట్లయితే వాటిని తొలగించాలని ఆదేశించింది. సివిల్ ఏవియేషన్ అధికారుల నుంచి నోటీసు వచ్చిన 60 రోజుల లోపు భవనాల యజమానులు వాటి ఎత్తు తగ్గించాలి లేదా […]
Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ పోలీసుల కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఈ కేసులో మూడు విడతలుగా మాజీ ఇంటెలిజెన్స్ అధికారితో పాటు ఓఎస్డీగా పనిచేసిన ప్రభాకర్ రావును విచారించిన సిట్, ఆయన నుంచి పూర్తి స్థాయిలో సహకారం లభించడంలేదని అభిప్రాయపడుతోంది. ఈ నేపథ్యంలో ప్రభాకర్ రావుకు దక్కిన రిలీఫ్‌ను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని సిట్ యోచిస్తోంది. ఇప్పటికే ఆయనపై విచారణలో ఎదురవుతున్న ఇబ్బందుల […]
Oneplus Store : హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లో ఉన్న వన్‌ప్లస్ సర్వీస్ సెంటర్లో ఫోన్ రిపేర్ కోసం వచ్చిన కస్టమర్లకు ఎదురైన అనుభవం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సర్వీస్ సెంటర్ సిబ్బందితో పాటు నారాయణగూడ పోలీసులు కస్టమర్లపై దౌర్జన్యంగా వ్యవహరించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కస్టమర్లు తమ ఫోన్లను రిపేర్ చేయించేందుకు సర్వీస్ సెంటర్‌కు వెళ్లగా, రెండు నెలలు గడిచినా ఫోన్లను తిరిగి అందజేయలేదని ఆరోపిస్తున్నారు. ఈ విషయమై సర్వీస్ సెంటర్ మేనేజర్‌ను ప్రశ్నించిన కస్టమర్లతో వాగ్వాదం చోటుచేసుకుంది. […]
Fire Accident : హైదరాబాద్ పాతబస్తీలోని మొఘల్‌పురాలో గురువారం ఉదయం తీవ్ర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ భవనంలో ఏర్పాటు చేసిన కార్టూన్ గోదాంలో మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ ప్రమాద సమయంలో భవనంలో ఉన్న తొమ్మిది మందిని ఫైర్ సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేయడానికి శ్రమించారు. భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న గోదాంలో […]
Child Po*n: పిల్లలతో సంబంధిత అశ్లీల వీడియోలను డౌన్లోడ్ చేసి వాటిని షేర్ చేస్తూ నిబంధనలను ఉల్లంఘిస్తున్న యువకులపై తెలంగాణ పోలీసులు కఠినంగా వ్యవహరించారు. అమెరికాలోని ఇంటర్నెట్ క్రైమ్ కంట్రోల్ రూమ్ (National Center for Missing & Exploited Children – NCMEC) నుంచి వచ్చిన సమాచారంపై స్పందించిన తెలంగాణ సైబర్ సెక్యూరిటీ విభాగం, హైదరాబాద్‌లో 18 మంది యువకులను అరెస్ట్ చేసింది. ఈ యువకులు ఇంటర్నెట్ ద్వారా చిన్న పిల్లల అశ్లీల వీడియోలు డౌన్లోడ్ […]
SpiceJet : ఈ రోజు ఉదయం శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరిన స్పైస్ జెట్ విమానం (SpiceJet)లో ప్రయాణికులకు కలవరాన్ని కలిగించే సంఘటన చోటుచేసుకుంది. విమానం తిరుపతి దిశగా ప్రయాణిస్తుండగా, ఆకాశంలో ప్రయాణిస్తున్న సమయంలో పైలట్ సాంకేతిక లోపాన్ని గుర్తించడంతో అప్రమత్తమయ్యారు. ఎటువంటి ప్రమాదం జరగకమునుపే, విమానాన్ని వెంటనే తిరిగి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు తీసుకెళ్లారు. Ahmedabad Plane Crash: కేంద్రం కీలక నిర్ణయం.. కొత్త నిబంధనలు జారీ ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. వారు […]
యుద్ధంతో అతలాకుతలమైన ఇరాన్ నుంచి.. భారత్ కు చేరిన 110 మంది విద్యార్థులు ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. యుద్ధంతో అతలాకుతలమైన ఇరాన్ నుంచి 110 మంది భారతీయ విద్యార్థులతో కూడిన ప్రత్యేక విమానం ఢిల్లీకి చేరుకుంది. ఈ విద్యార్థులను మొదట ఇరాన్ నుంచి అర్మేనియాకు తరలించారు. అక్కడి నుంచి వారిని భారత్ కు తీసుకువచ్చారు. ఈ విద్యార్థులలో, 90 మంది జమ్మూ, కాశ్మీర్ కు చెందిన వారు. వీరంతా వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. […]
Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో తెలంగాణ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) మరోసారి తన దూకుడును ప్రదర్శిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే పలువురిని విచారించిన సిట్, నేడు ఎస్ఐబీ మాజీ చీఫ్‌ను ప్రభాకర్ రావును మళ్లీ విచారణకు పిలిపించింది. ఉదయం 11 గంటలకు ఆయన సిట్ ఎదుట హాజరు కానున్నారు. నిన్న ఉదయం నుండి రాత్రి వరకు ఎనిమిది గంటల పాటు మాజీ ఇంటలిజెన్స్ అధికారి ప్రణీత్ రావును ప్రశ్నించిన సిట్, ఆయన […]
CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఉదయం ఢిల్లీకి బయలుదేరారు. ఆయనతో పాటు నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కూడా ఈ రెండు రోజుల పర్యటనలో పాల్గొంటున్నారు. ఈ పర్యటనలో భాగంగా, ఉదయం 11 గంటలకు ఇంగ్లండ్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం సమావేశం కానుంది. ప్రస్తుతం టోనీ […]