హైదరాబాద్ నగరంలోని మూసాపేట్ ప్రాంతంలో ఉన్న మారినా స్కైస్ అపార్ట్‌మెంట్‌లో డాక్టర్ ధీరజ్ పెయిన్ రిలీఫ్ అండ్ వెల్‌నెస్ సెంటర్ ఆధ్వర్యంలో ఉచిత నొప్పి నివారణ అవగాహన శిబిరం ఇటీవల విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి అపార్ట్‌మెంట్ నివాసితుల నుంచి మంచి స్పందన లభించింది.
ఈ శిబిరంలో ముఖ్యంగా క్రానిక్ నొప్పుల ప్రభావం, వాటి నివారణకు అందుబాటులో ఉన్న నవీన చికిత్సలపై అవగాహన కల్పించారు. నడుము నొప్పి, మోకాలి నొప్పి, నరాల నొప్పులు, భుజాల నొప్పి (షోల్డర్ పెయిన్) వంటి సమస్యలకు శస్త్రచికిత్స అవసరం లేకుండానే ఉపశమనం పొందే అవకాశాలను వివరించారు.
వైద్య నిపుణులు ఈ సందర్భంగా ఓజోన్ థెరపీ, రిజనరేటివ్ ట్రీట్మెంట్‌లు, రేడియోఫ్రీక్వెన్సీ అబ్లేషన్ వంటి అత్యాధునిక చికిత్సా విధానాలపై వివరంగా ప్రస్తావించారు. పేషెంట్‌కు సరిపోయే చికిత్సా పద్ధతులు ఎంచుకోవడంలో సాంకేతిక పరిజ్ఞానం ఎలా ఉపయోగపడుతున్నదీ వివరించారు.
అంతేకాకుండా, ఫిజియోథెరపీ, కాల్షియం , విటమిన్ D పాత్రతో పాటు, జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ఎంత అవసరమో వివరించారు. శక్తివంతమైన జీవితానికి ఇది ముల్యం అంశమని డాక్టర్లు స్పష్టం చేశారు.
ఈ క్యాంప్‌లో భాగంగా బోన్ మినరల్ డెన్సిటీ (BMD) స్కాన్ను ఉచితంగా నిర్వహించి, అనేకమందిలో ఆస్టియోపోరోసిస్ ప్రమాదాన్ని ముందే గుర్తించగలిగారు. దీంతో వారు తగిన చికిత్సను సమయానికి పొందే అవకాశం లభించింది.
డాక్టర్ ధీరజ్ మాట్లాడుతూ, “నొప్పిని ప్రారంభ దశలోనే గుర్తించి, సరైన చికిత్సను తీసుకుంటే, దీర్ఘకాలిక నష్టాన్ని నివారించవచ్చు. నొప్పులు మానసిక, శారీరక, ఆర్థిక భారం తెస్తాయి. వాటి నుంచి బయటపడటానికి ప్రతి ఒక్కరికి సమర్థవంతమైన అవగాహన అవసరం” అని తెలిపారు.
మీ అపార్ట్‌మెంట్ లేదా గేటెడ్ కమ్యూనిటీలో ఇలాంటి ఉచిత ఆరోగ్య అవగాహన కార్యక్రమం నిర్వహించాలని ఉంటే 9347164263 నంబర్‌కు సంప్రదించవచ్చు.