HHMV : పవన్ కళ్యాణ్ నటించిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘హరిహర వీరమల్లు’ రిలీజ్‌కు ముందే వివాదాల్లో చిక్కుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో తెలంగాణ యోధుడు పండుగ సాయన్న జీవితాన్ని వక్రీకరించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తెలంగాణ ఉద్యమకారుడు, న్యాయవాది, అలాగే పండుగ సాయన్న జీవిత చరిత్రను పుస్తక రూపంలో రచించిన బెక్కెం జనార్దన్ ఈ వివాదంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. పండుగ సాయన్న జీవితంలోని సంఘటనలను చిత్రీకరిస్తామంటూ ప్రకటించి, ఇప్పుడు […]
CM Revanth Reddy : తెలంగాణలో అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఫిల్మ్ స్టూడియో ఏర్పాటు కోసం ప్రముఖ బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ ఆసక్తి చూపించారు. ఈ క్రమంలో, సోమవారం ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన కలిశారు. ఈ సమావేశంలో, యానిమేషన్, వీఎఫ్ఎక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి రంగాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, తెలంగాణలోనే ఒక అంతర్జాతీయ ప్రమాణాల ఫిల్మ్ స్టూడియో ఏర్పాటుకు అవకాశం కల్పించాలని అజయ్ దేవగణ్ సీఎం […]
Police Torture : మేఘాలయలోని ఈస్ట్ ఖాసీ హిల్స్ జిల్లాలోని సోహ్రా పోలీస్ స్టేషన్లో పోలీసుల అదుపులో ఉన్న ఓ 19 ఏళ్ల యువకుడి గెట్‌విన్‌ను మానసికంగా, శారీరకంగా హింసించిన ఘటన వెలుగులోకి వచ్చింది. యువకుడిని హింసించడంతో పాటు, టాయిలెట్‌లోని నీళ్లు త్రాగాల్సిన స్థితికి తీసుకెళ్లారన్న ఆరోపణలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనపై అధికారికంగా విచారణ ప్రారంభమైంది. బాధితుడు గెట్‌విన్ తల్లి మిల్డ్రెడ్ జైర్వా, జిల్లాకు చెందిన ఎస్పీ వివేక్ సియెంకు ఫిర్యాదు చేశారు. తన కుమారుడికి న్యాయం […]
Dost 2025 : తెలంగాణలో డిగ్రీ కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించిన దోస్త్ (డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్, తెలంగాణ) కౌన్సెలింగ్ ప్రక్రియ ముగిసింది. అయితే, ఈ ఏడాది డిగ్రీ కాలేజీల్లో సీట్ల భర్తీ ఆశించిన స్థాయిలో జరగలేదు. రాష్ట్రంలోని మొత్తం 957 డిగ్రీ కళాశాలల్లో ఉన్న 4,36,947 సీట్లకు గాను, కేవలం 1,41,590 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఇది మొత్తం సీట్లలో కేవలం 32 శాతమే కావడం గమనార్హం. Wiaan Mulder: అందుకే బ్రియాన్ లారా […]
Sigachi Blast : సంగారెడ్డి జిల్లా పాశమైలారం ఫేజ్-3 లోని సిగాచి (Sigachi) పరిశ్రమలో జరిగిన ఘోర పేలుడు ఘటనపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ నేపథ్యంలో, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (NDMA) బృందం నేడు సంఘటన స్థలాన్ని సందర్శించనుంది. NDMA బృందం, రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (SDMA) తో కలిసి పరిశ్రమలో పేలుడుకు గల కారణాలపై సవివరంగా అధ్యయనం చేయనుంది. ప్రమాదానికి కారణమైన పరిస్థితులు, భద్రతా లోపాలు, గ్యాస్ లీక్ లేదా […]
లండన్ వేదికగా జరుగుతన్న వింబుల్డన్ లో మరో సంచలనం నమోదైంది.టెన్నిస్ స్టార్ ప్లేయర్ నొవాక్ జకోవిచ్ 100 విజయాలు సాధించిన 3వ ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు. 38 ఏళ్ల నొవాక్ జకోవిచ్ ప్రస్తుతం తన 20వ వింబుల్డన్ టోర్నమెంట్ ఆడుతున్నాడు. సెర్బియాకు చెందిన జకోవిచ్ తన తోటి దేశస్తుడైన కెమనోవిచ్ పై వరుస సెట్లలో గెలిచి, ఈ ఘనత సాధించాడు.ఆ మ్యాచ్‌లో కెమనోవిచ్ పై 6-3,6-0,6-4 తేడాతో విజయం అందుకున్నాడు.కాగా నొవాక్ జకోవిచ్ కంటే ముందు […]
Glenn Maxwell : గ్లెన్ మాక్స్వెల్, ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. ముఖ్యంగా టీ20 క్రికెట్లో తనదైన ముద్ర వేసాడు.ముందు కొండంత లక్ష్యం వున్నా అలవోకగా ఛేదిస్తాడు. ఇక టార్గెట్ చేయాలన్నా తనదైన షాట్లతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకు పడుతుంటాడు. ఇక బ్యాటెర్ గానే కాకుండా బౌలర్ కూడా వికెట్లు తీసి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తుంటాడు. ఇలా.. గ్లెన్ మాక్స్వెల్ ఐపీఎల్ లో తనదైన ముద్ర వేసుకున్నాడు. గత కొన్నేళ్లుగా ఐపీఎల్ లో ఆడుతున్నాడు. […]
Damodara Raja Narasimha : తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయడంపై మరింత దృష్టి సారించింది. ముఖ్యంగా కొత్తగా నిర్మితమవుతున్న టిమ్స్ హాస్పిటల్స్‌తో పాటు వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కి అత్యాధునిక వైద్య పరికరాలు, డయాగ్నస్టిక్ ఎక్విప్మెంట్, ఫర్నీచర్ కొనుగోలుకు సంబంధించి ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ కీలక ఆదేశాలు జారీ చేశారు. సోమవారం సచివాలయంలో వైద్యశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని కొత్త టెక్నాలజీతో కూడిన […]
Hacking: ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవనశైలిలో విడదీయరాని భాగంగా మారింది. బ్యాంకింగ్, కమ్యూనికేషన్, సోషల్ మీడియా, ఫొటోలు, పర్సనల్ డేటా.. అన్నింటికీ ఈ చిన్న డివైస్ ఆధారంగా మారింది. అయితే, టెక్నాలజీ పెరిగిన కొద్దీ సైబర్ క్రైమ్స్ కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. హ్యాకర్లు సరికొత్త మార్గాలను ఉపయోగించి ఫోన్లోని డేటాను చోరీ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. సాధారణంగా ఒక నకిలీ లింక్‌పై క్లిక్ చేయడం, అపరిచితమైన యాప్‌కు అనుమతి ఇవ్వడం వంటి చిన్న అజాగ్రత్తలతోనే ఫోన్ పూర్తిగా […]
Sub-Registrar Office : హైదరాబాద్‌లోని అబ్దుల్లాపూర్‌మెట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఒక ఊహించని పరిణామంతో వార్తల్లో నిలిచింది. అధికారుల నిర్లక్ష్యం, ఆర్థిక అశ్రద్ధకు పరాకాష్టగా, ఏకంగా 40 నెలల అద్దె బకాయిలు చెల్లించకపోవడంతో కార్యాలయ భవన యజమాని తాళం వేయాల్సి వచ్చింది. ఈ ఘటన రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతోంది. వివరాల్లోకి వెళితే.. అబ్దుల్లాపూర్‌మెట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అద్దె భవనంలో కొనసాగుతోంది. అయితే, గత 40 నెలలుగా (సుమారు మూడున్నర సంవత్సరాలు) […]