Srushti Case : సృష్టి ఫెర్టిలిటీ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న డాక్టర్ నమ్రతను పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. నార్త్ జోన్ డీసీపీ కార్యాలయంలో గోపాలపురం పోలీసులు బుధవారం ఆమెను దాదాపు ఐదు గంటల పాటు విచారించారు. చైల్డ్ ట్రాఫికింగ్ ఆరోపణల నేపథ్యంలో ఈ విచారణ ముమ్మరంగా సాగింది.
చైల్డ్ ట్రాఫికింగ్, సరోగసీ పేరుతో పిల్లల విక్రయాలు అనే తీవ్ర ఆరోపణలపై అడిగిన ప్రశ్నలకు డాక్టర్ నమ్రత తగిన సమాధానాలు ఇవ్వలేదు. చాలాసార్లు ఆమె నోరుమెదపక మౌనంగా ఉన్నట్టు సమాచారం. “తాను ఎలాంటి తప్పూ చేయలేదు” అనే సమాధానాన్ని మాత్రమే మళ్లీ మళ్లీ చెప్పినట్టు పోలీసులు వెల్లడించారు.
పోలీసులు ప్రస్తుతం డాక్టర్ నమ్రతతో పాటు, ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన ఏజెంట్లు, ANMలు, ఆశా వర్కర్ల పాత్రను విచారిస్తున్నారు. ఒక్కొక్క దంపతుల వద్ద ఎంత మొత్తంలో డబ్బులు వసూలు చేశారని, ఎంత మంది పేద తల్లిదండ్రులకు పిల్లలను సరోగసీ పేరుతో విక్రయించారని తెలుసుకునేందుకు ప్రశ్నలు చేస్తున్నారు.
Shashi Tharoor: రాహుల్ గాంధీతో విభేదిస్తున్న కాంగ్రెస్ ఎంపీలు.. ముందున్న శశిథరూర్..
సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌కు సంబంధించిన విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్ బ్రాంచీల పై పోలీసులు వివరాలను సేకరిస్తున్నారు. ఈ కేంద్రాల్లో ఇప్పటివరకు ఎంతమంది తల్లిదండ్రులు నమోదు చేసుకున్నారన్న దానిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ దంపతుల వివరాలు, వారితో నిర్వహించిన లావాదేవీలు, డబ్బుల పద్ధతులపై ఆధారాలు సేకరిస్తున్నారు.
న్యాయవాదిగా ఉన్న డాక్టర్ నమ్రత కుమారుడు జయంత్ కృష్ణ, ఈ కేసులో బాధిత తల్లిదండ్రులను బెదిరించినట్టు వచ్చిన ఆరోపణలపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. బాధితుల పైనా, జయంత్ మానసిక ఒత్తిడిని కలిగించాడా లేదా అనే దానిపై స్పష్టత తీసుకొచ్చేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు.
ఈ కేసులో విచారణలో భాగంగా డాక్టర్ నమ్రత ఎలాంటి పశ్చాతాపం లేకుండా, “మేము పిల్లలను దత్తతకు అరేంజ్ చేసాం” అంటూ బహిరంగంగానే చెప్పినట్టు సమాచారం. ఈ వ్యాఖ్యలు ఆమెపై ఉన్న ఆరోపణలను మరింత బలపరిచే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు.
పోలీసుల విచారణ కొనసాగుతోంది. మరిన్ని ఆధారాలు వెలుగు చూసే అవకాశం ఉండగా, న్యాయపరంగా ఈ కేసు పెద్ద దిశగా మారబోతుందని అనిపిస్తోంది.
Chiranjeevi Birthday: ‘మెగా’ బ్లాస్టింగ్ లోడింగ్.. చిరంజీవి బర్త్ డేకి అదిరిపోయే అప్డేట్స్!