గోషామహల్ ఎమ్మెల్యే చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్నారా? పాపం రాజాసింగ్ అనే పరిస్థితి వచ్చిందా? ఆవేశం ఆయన కొంప ముంచిందా? తాను రాజీనామా చేసిన బీజేపీనే ఇప్పుడు ఎందుకు పొగుడుతున్నారు? ఎవరివో రాజకీయ వ్యూహాలకు రాజా బలయ్యారా? క్షవరం అయితేగానీ… వివరం తెలీదన్నట్టుగా ఎమ్మెల్యే పరిస్థితి మారిపోయిందా? ఓన్లీ… హిందుత్వ అజెండాతో పనిచేస్తూ… రాజకీయంగా ముందుకు పోతున్న లీడర్ రాజాసింగ్. పొలిటికల్ ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉంది ఆయనకు. ఆ ఫైర్ బ్రాండ్‌కు ఇప్పుడు బ్రాండ్ ఇమేజ్ […]
తెలంగాణలో గిగ్ వర్కర్ల (Gig Workers) సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతిపాదిత పాలసీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి వివేక్ వెంకటస్వామి కూడా పాల్గొన్నారు. గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత కల్పించేందుకు ప్రత్యేక సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలని, వారికి ప్రమాద బీమా మరియు ఆరోగ్య బీమా వంటి సౌకర్యాలు అందించే విధంగా పాలసీ రూపకల్పన చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశించారు. Pawankalyan : ప్రతిసారి ఆ హీరోలతో పోల్చుకుంటున్న […]
ఉమ్మడి విజయనగరం జిల్లా టీడీపీ పరిస్థితి రాజు లేని రాజ్యంలా మారిపోయిందా? బాధ్యత తీసుకుని పార్టీని ముందుకు నడిపే నాయకులు కరవయ్యారా? పేరుకు నాయకులు ఉన్నా… జిల్లాను ఒక తాటి మీద నడిపించే స్థాయి ఉన్నవాళ్శు లేరా? అధికారంలో ఉండి కూడా ఇప్పుడెందుకు పార్టీకి అంత ఘోరమైన పరిస్థితి వచ్చింది? అసలు సమస్య ఎక్కడ మొదలైంది? విజయనగరం జిల్లాలో తెలుగుదేశం పార్టీ అనగానే… ఠక్కున గుర్తుకు వచ్చే పేరు అశోక్ గజపతి రాజు. పార్టీ ఆవిర్భావం నుంచి […]
G.O 49: తెలంగాణ ప్రభుత్వం జీవో 49ను నిలిపివేసింది. కొమురంభీం జిల్లాలో కన్జర్వేషన్ కారిడార్ ఏర్పాటు కోసం ప్రభుత్వం ఇటీవల జీవో 49ను విడుదల చేసింది. అయితే ఈ నిర్ణయం పై స్థానిక ఆదివాసీలలో అనుమానాలు, ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని జీవోను నిలిపివేయాలని అధికారులను ఆదేశించారు. Natti Kumar : ఫిష్ వెంకట్ కు హీరోలు ఎందుకు సాయం చేయాలి.. నిర్మాత కామెంట్స్.. ఆదివాసీల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని, వారి […]
గతంలో ఎప్పుడూ కేసులు పెట్టిన దాఖలాలు లేవు.. మమల్ని వేధిస్తున్నారు..! నేడు సత్తెనపల్లి పోలీసుల ఎదుట విచారణకు హాజరు అయ్యారు మాజీ మంత్రులు విడదల రజినీ, అంబటి రాంబాబు. జగన్ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన కేసులో అంబటిని, జగన్ పర్యటన సమయంలో నిబంధనలు ఉల్లంఘించిన కేసులో విడదల రజినీని విచారించారు పోలీసులు. మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడారు. సత్తెనపల్లి పిఎస్ లో విచారణకు హాజరయ్యాం. వాళ్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం […]
Ramchander Rao : పార్టీని ఎలా నడిపించాలనే విషయంపై పెద్దల మార్గదర్శనం తీసుకునేందుకు ఢిల్లీకి వచ్చానని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచందర్ రావు అన్నారు. ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. 46 సార్లు ఢిల్లీకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దక్కలేదన్నారు. కానీ ప్రధానమంత్రి సహా కేంద్ర మంత్రులందరూ ఎప్పుడు అడిగితే అప్పుడు రేవంత్ రెడ్డికి సమయం ఇచ్చారని, మీ పార్టీ ముఖ్యమంత్రి కి మీరే ఎందుకు సమయం ఇవ్వడం లేదు చెప్పాలన్నారు […]
SLBC : నాగర్‌కర్నూల్ జిల్లా ప్రజలను కుదిపేసిన ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదానికి 150 రోజులు పూర్తయ్యాయి. ఫిబ్రవరి 22న జరిగిన ఈ ప్రమాదంలో 14వ కిలోమీటర్ వద్ద టన్నెల్ కుప్పకూలడంతో 8 మంది కార్మికులు సజీవ సమాధి అయ్యారు. ఇప్పటి వరకు కేవలం ఇద్దరి మృతదేహాలనే వెలికితీశారు, మిగతా ఆరుగురు కార్మికుల మృతదేహాలు టన్నెల్‌లోనే ఉన్నాయి. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని నో గో జోన్‌గా ప్రకటించి కంచె ఏర్పాటు చేశారు. 63 రోజుల పాటు జరిగిన రెస్క్యూ […]
SLBC : రాబోయే ఐదు రోజులపాటు తెలంగాణలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. ఇప్పటికే నేడు, రేపు పలు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, దక్షిణ మధ్య తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. IND vs ENG 4th Test: ఇంగ్లండ్‌తో నాలుగో టెస్ట్.. జట్టును ప్రకటించిన బీసీసీఐ! బంగాళాఖాతంలో ఈ […]
హైదరాబాద్‌లో ఉద్రిక్తతకు దారితీసిన సంఘటన చోటు చేసుకుంది. కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీగణేష్ కాన్వాయ్‌పై సుమారు 30 మంది యువకులు దాడికి యత్నించారు. ఈ ఘటన ఓయూ పోలీస్ స్టేషన్‌కు కేవలం 200 మీటర్ల దూరంలో జరిగింది. సమాచారం ప్రకారం, మాణికేశ్వర్ నగర్లో జరుగుతున్న బోనాల జాతరకు వెళ్తున్న ఎమ్మెల్యే కాన్వాయ్‌ను యువకులు అడ్డగించారు. వారు కాన్వాయ్‌లో ఉన్న గన్మెన్ల వెపన్స్‌ను లాక్కోవడానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో ఉద్రిక్తత నెలకొనగా, ఎమ్మెల్యే శ్రీగణేష్ కారులోనుంచి […]
Indigo Flight: తిరుపతి విమానాశ్రయంలో శనివారం ఇండిగో విమానానికి ప్రాణాపాయ పరిస్థితి తృటిలో తప్పింది. సాంకేతిక లోపం కారణంగా విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే సమస్యలు తలెత్తాయి. పైలట్లు అప్రమత్తంగా వ్యవహరించి, విమానాన్ని 40 నిమిషాల పాటు గాల్లో చక్కర్లు కొట్టించి, చివరికి తిరుపతిలోనే సురక్షితంగా ల్యాండ్ చేశారు. అయితే విమానం ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యామ్నాయ విమానం ఏర్పాటు చేయకపోవడంతో వారు విమానాశ్రయంలోనే ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులను ప్రశ్నిస్తూ, […]