NTV Daily Astrology as on June 24th 2025: ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..? ఎవరు విరమించుకోవాలి..? ఏ రాశివారు ఏ పరిహారాలు చెల్లించుకోవాలి..? ఎవరు ఎలాంటి పూజలు చేస్తే మంచిది..? మంచి జరగాలంటే ఏం చేయాలి..? ఇలా పూర్తి వివరాలతో కూడిన ఇవాళ్టి రాశి ఫలాల కోసం కింది వీడియోను క్లిక్ చేయండి..
Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ వివాదంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా ఈ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (SIT) మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) శాంతి కుమారి, జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ (పొలిటికల్) రఘునందన్ రావులను విచారణకు పిలిచి వారి స్టేట్మెంట్లను నమోదు చేసింది. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885, సెక్షన్ 5(2) ప్రకారం, ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి లేదా డీజీపీ అనుమతితో పాటు, DOT […]
KTR : తెలంగాణలో పేదల ఇళ్లపై, పోడు భూములపై బుల్డోజర్ల దాడులు కొనసాగుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. హైదరాబాద్‌లోని పేదల ఇండ్లు కూల్చడం తర్వాత, ఇప్పుడు ఆదివాసీల పోడు భూములపైనా దాడులు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. ట్విటర్ వేదికగా స్పందించిన కేటీఆర్, “పేదలపైనా, అడవులపైనా ఇప్పుడు బుల్డోజర్లు దాడి చేస్తున్నాయి. పోడు భూముల్లో వ్యవసాయం చేసి జీవిస్తున్న ఆదివాసీలపై పోలీసులు దాడి చేయడం అమానుషం” అని పేర్కొన్నారు. ప్రభుత్వానికి పేదల పట్ల మానవత్వం […]
ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధం.. భారీగా పెరిగిన ఆయిల్ ధరలు.. భారత్‌పై ఎఫెక్ట్! ఇరాన్- ఇజ్రాయెల్ దేశాల మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. తాజాగా, ఈ యుద్ధంలోకి అగ్రరాజ్యం అమెరికా ఎంట్రీ ఇవ్వడంతో ఒక్కసారిగా పరిణామాలు మారిపోయాయి. ఇరాన్‌లోని అణు స్థావరాలే లక్ష్యంగా అగ్రరాజ్యం బాంబుల వర్షం కురిపించడంతో.. నిన్న ( జూన్ 22న) హర్మూజ్ జలసంధిని మూసి వేసేందుకు ఆ దేశ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. అయితే, తాజా పరిణామాలతో భారత్‌తో సహా ఇతర దేశాలకు ఇబ్బందికర […]
Gadwal Murder : జోగుళాంబ గద్వాల జిల్లాలో ఓ ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసు మలుపు తిరిగింది. ఈ కేసు మొదట కనిపించినంత సాధారణం కాకుండా, దాని వెనుక ఉన్న కథనం ఆవిష్కరించబడుతున్న కొద్దీ నోరెళ్లబెట్టే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. 32 ఏళ్ల తేజేశ్వర్‌కు కర్నూలుకు చెందిన ఐశ్వర్యతో ఫిబ్రవరి 13న వివాహం నిశ్చయమైంది. కానీ పెళ్లికి కేవలం ఐదు రోజులు ముందు ఐశ్వర్య అనూహ్యంగా అదృశ్యమైంది. ఆమె కర్నూలులోని ఓ ప్రముఖ బ్యాంకు ఉద్యోగితో […]
Harish Rao : తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పాలనపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఎక్స్ (మాజీ ట్విట్టర్) వేదికగా చేసిన వ్యాఖ్యలలో ఆయన, కాంగ్రెస్ ప్రభుత్వం పలు ప్రజా ప్రయోజన పథకాలను నిలిపివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా బంద్, గ్యాస్ బండకు రాయితీ బంద్, రాజీవ్ యువ వికాసం అమలుకు కాకముందే బంద్, గొర్రెల పంపిణీ మొత్తానికే బంద్.. ఇలా చెప్పుకుంటూ పోతే […]
Phone Tapping : తెలంగాణను కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాష్ట్ర స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (SIB) మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఇవాళ ఆరోసారి సిట్ విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే ఐదుసార్లు విచారణకు లోనైన ఆయన, ఈసారి కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. గత ప్రభుత్వ హయాంలో పలువురు రాజకీయ నాయకులు, జర్నలిస్టుల ఫోన్లను ట్యాప్ చేసినట్లు ప్రస్తుత ప్రభుత్వం […]
Tragedy : ఇది ప్రేమ పెళ్లి కాదు. కానీ, ఒక కొత్త జీవితంపై కలలు కంటూ అడుగుపెట్టిన నవ వధువు.. ఆ జీవితం బంధనంగా మారుతుందని ఊహించలేకపోయింది. భర్త వేధింపులతో ఆమె ఉక్కిరిబిక్కిరై, చివరకు ప్రాణాలు తీసుకునే నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఈ విషాద ఘటన కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో చోటు చేసుకుంది. శ్రీనివాస్ అనే యువకుడు KPHB లో ఓ ప్రైవేట్ షాపులో సెల్స్ మాన్‌గా పని చేస్తుంటాడు. అతడు, పూజిత అనే యువతిని […]
Chairman’s Desk : ప్రపంచం యుద్ధోన్మాదంతో ఊగిపోతోంది. నేతల పంతాలు, పట్టింపులతో కోట్ల మంది ప్రభావితం అవుతున్నారు. ఇప్పటికే ఆర్థిక విధ్వంసం జరుగుతోంది. ఇంత జరుగుతున్నా.. గెలుపోటముల గురించే తప్ప జనం కన్నీళ్ల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. నాలుగేళ్ల క్రితమే కరోనా ప్రపంచానికి మర్చిపోలేని గుణపాఠం నేర్పింది. పేద ధనిక దేశాలనే తేడా లేకుండా అన్నింటికీ ప్రాణ, ఆర్థిక నష్టం తప్పలేదు. అయినా సరే ప్రపంచ దేశాలు మారకుండా చిన్న చిన్న ఘర్షణలను.. చేజేతులా యుద్ధాలుగా […]
Air India : వరుస సాంకేతిక సమస్యలతో.. విమానాలు ఆగిపోతున్నాయి. ప్రయాణాలు క్యాన్సిల్ అవుతున్నాయి. కొన్ని ఆలస్యమవుతున్నాయి.. మరికొన్ని పూర్తిగా రద్దవుతున్నాయి. అహ్మదాబాద్ ప్రమాదం తర్వాత.. పౌరవిమానయానం డేంజర్ బెల్స్ మోగిస్తోంది. వరుసగా ప్లేన్స్ ఎందుకు రద్దవుతున్నాయి ? డొక్కు విమానాలే కొంపముంచుతున్నాయా ? పూర్ మెయిన్‌టెయినెన్స్ కారణమా ? ఎమిరేట్స్ స్థాయికి ఎప్పుడు చేరుకుంటాం ? విమానం ఎక్కాలంటేనే ప్రయాణికులు వణికిపోతున్నారు. వరుసగా బయటపడుతున్న వైఫల్యాలు.. ప్యాసెంజర్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. విమానం […]