Jagadish Reddy : తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రం ఎదుర్కొంటున్న కీలక సమస్యలపై తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా గోదావరి – కృష్ణ జలాల వినియోగానికి సంబంధించిన అంశంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్న తీరును ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. నీటి వాటా విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణకు నష్టం చేయాలని కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ కీలక అంశంపై […]
Ponnam Prabhakar : సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో మంత్రివర్గం ప్రత్యేక సమీక్షా సమావేశం జరిగింది. జూలై 26నుంచి ప్రారంభం కానున్న బోనాల పండుగను పురస్కరించుకొని, రాష్ట్రవ్యాప్తంగా జరిగే ఉత్సవాలకు సంబంధించి అన్ని విభాగాలతో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. ఆషాఢ మాస బోనాల పండుగను అన్ని రాజకీయాలకు అతీతంగా, అన్ని శాఖల […]
Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా సిట్ అధికారులు తాజాగా కీలక వ్యక్తులను విచారిస్తున్నారు. సోమవారం బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌కు సిట్ నోటీసులు జారీ చేసింది. ఆయనను సాక్షిగా విచారించనుండగా, మరికాసేట్లో ఆయన సిట్ ఎదుట హాజరుకానున్నారు. ఇక ఇదే కేసులో వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేత బిల్ల సుధీర్ రెడ్డి, మేడ్చల్ డీసీసీ అధ్యక్షుడు సింగిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి సోమవారం సిట్‌కు తమ వాంగ్మూలాలు ఇచ్చారు. […]
Tragic : హైదరాబాద్ శివారులోని జీడిమెట్లలో జరిగిన తల్లి హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. బాలిక, ఆమె ప్రియుడు, అతని తమ్ముడు కలిసి మాతృహత్యకు పాల్పడిన ఈ ఘటన వెనక ప్రేమ, కోపం, హింసల మేళవింపుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. కేవలం ఎనిమిది నెలల క్రితం ఓ బాలికకు ఇన్స్టాగ్రామ్ ద్వారా శివ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. వయసులో పదో తరగతి చదువుతున్న ఈ బాలిక అప్పటికే తన వయస్సును మరిచిపోయి ప్రేమలో మునిగిపోయింది. […]
Gadwal Murder : జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో చోటుచేసుకున్న తేజేశ్వర్ హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ప్రేమ పేరుతో మోసపోయిన తేజేశ్వర్‌ను కిరాతకంగా హత్య చేసిన ఘటనలో విచారణ చేపట్టిన పోలీసులు షాకింగ్ విషయాలను బయటపెడుతున్నారు. తేజేశ్వర్ స్థానికంగా ప్రైవేట్ సర్వేయర్‌గా పని చేస్తున్నాడు. కొంతకాలం క్రితమే ఐశ్వర్య అనే యువతిని ప్రేమించి, పెద్దల వ్యతిరేకతను ఎదుర్కొంటూ పెళ్లి చేసుకున్నాడు. అయితే పెళ్లికి ముందే ఐశ్వర్యకు ఓ వివాహితుడు అయిన బ్యాంకు మేనేజర్ తిరుమలరావుతో […]
నేడే ఏపి క్యాబినెట్ భేటీ.. పలు ప్రాజెక్టులకు ఆమోదం..! నేడు (జూన్ 24) ఉదయం 11 గంటలకు ఏపి క్యాబినెట్ భేటీ అమరావతి వేదికగా జరగనుంది. ఈ సమావేశంలో పలు ప్రాజెక్టులకు సంబంధించి ప్రభుత్వం ఆమోదం తెలపనుంది. ఇందులో భాగంగా.. 7వ ఎస్ఐపీబీ సమావేశంలో అమోదం తెలిపిన 19 ప్రాజెక్టులకు సంబంధించి రూ.28,546 కోట్ల పెట్టుబడులకు క్యాబినెట్ ఆమోదం తెలపనుంది. అలాగే ఈ సమావేశంలో వైజాగ్ లో కాగ్నిజెంట్ ఏర్పాటు కు సంబంధించి చర్చ జరగనుంది. అమరావతి […]
MIlk : కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో అరుదైన కేసు నమోదైంది. సాధారణంగా చోరీలు, ఘర్షణలు, ఆస్తి వివాదాల ఫిర్యాదులు వస్తుంటే… ఈసారి మాత్రం పాలు పగిలిపోయాయని బాధితులు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు. సంఘటన కూకట్పల్లి పీఎస్ పరిధిలోని రత్నదీప్ సూపర్ మార్కెట్లో చోటు చేసుకుంది. బాధితులు కొనుగోలు చేసిన హెరిటేజ్ పాకెట్ పాలలో మొదటి ప్యాకెట్ కాచినప్పుడు సాధారణంగానే కనిపించిందని, అయితే రెండవ ప్యాకెట్ కాచేసరికి పూర్తిగా పగిలిపోయిందని తెలిపారు. ఇది ఏంటని అడిగితే, దుకాణదారుడు […]
నిన్న సోనమ్-రఘువంశీ…నేడు ఐశ్వర్య-తేజేశ్వర్…ఒకటా రెండా…దొరికిపోతామనే భయం లేదు. చేసేది తప్పనే సోయి లేదు. ఎంతకైనా బరి తెగిస్తున్నారు. కట్టుకున్న భర్తలనే లేపేస్తున్నారు. చంపటమే పరిష్కారం అనుకుంటున్నారు. కొందరు భార్యల్లో క్రూరత్వం పెరిగిపోతోంది. రాక్షస భార్యల గురించి చెప్పుకుంటూ…పోతే హిస్టరీ చాంతాడంత ఉంది. మెజారిటీ మర్డర్ కథల్లో ఇప్పుడు భార్యే హంతకురాలు…భర్తే హతుడు. అందంగా తయారై పెళ్లిపీటలు ఎక్కుతున్నారు. కల్యాణమండపంలో…తలవంచి భర్తతో మూడు ముళ్లు వేయించుకుంటున్నారు. కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితుల ముందు…మహానటిలా నటిస్తూ…ఎంతో సంతోషంగా నాలుగడుగులు వేస్తున్నారు. పెళ్లి […]
Iran-israel : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఆయన తెలిపిన ప్రకారం, అమెరికా మిత్ర దేశమైన ఇజ్రాయెల్ – ప్రత్యర్థి దేశమైన ఇరాన్ మధ్య పూర్తి స్థాయి కాల్పుల విరమణ (Complete and Total Ceasefire) కి ఒప్పందం కుదిరిందని తెలిపారు. ఈ విరమణను వచ్చే 24 గంటల్లో దశలవారీగా అమలు చేయనున్నట్లు తెలిపారు. “ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య పూర్తిస్థాయి కాల్పుల విరమణకి అంగీకారమైంది. దాదాపు ఆరు గంటల లోపు ఇరువురు తమ […]
నేడు గాంధీభవన్‌లో టీపీసీసీ కీలక సమావేశాలు. ఉదయం 11 గంటలకు పీసీసీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ భేటీ. తర్వాత పీసీస అడ్వైజరీ కమిటీ సమావేశం. మధ్యాహ్నం టీపీసీసీ కొత్త ఉపాధ్యక్షుల సమావేశం. కొత్తగా నియమితులైన నేతలకు నియామక పత్రాల అందజేత. చెవిరెడ్డి మోహిత్ పిటిషన్‌పై నేడు కోర్టులో విచారణ. లిక్కర్ స్కాంలో ఏ39 నిందితుడిగా ఉన్న మోహిత్‌రెడ్డి. అమరావతి: నేడు ఏపీ కేబినెట్ సమావేశం. ఎస్ఐపీబీ ప్రతిపాదనలకు ఆమోదం తెలపనున్న కేబినెట్. రాజధాని నిర్మాణానికి మరింత భూ […]