GHMC : ఈ మధ్య కాలంలో కుక్కల దాడి ఘటనలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. చాలామంది చిన్నారులు కుక్కల దాడుల్లో ప్రాణాలు కోల్పోవడంతో ప్రజలలో ఆందోళన పెరిగింది. దీంతో వీధుల్లోని కుక్కలను తగ్గించాలన్న డిమాండ్లు కూడా బలపడుతున్నాయి. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. వీధుల్లో కుక్కల సంఖ్యను తగ్గించేందుకు జీహెచ్ఎంసీ వినూత్నమైన దత్తత డ్రైవ్‌ను నిర్వహిస్తోంది.
“బీ ఏ హీరో, అడాప్ట్ డోంట్ షాప్” అనే నినాదంతో ఈ నెల 17న బంజారాహిల్స్‌లోని జలగం వెంగళరావు పార్కులో ఉదయం 6 నుండి 10 గంటల వరకు ఈ దత్తత డ్రైవ్ నిర్వహించబడనుంది. ఈ డ్రైవ్‌లో భాగంగా ఉన్న కుక్కపిల్లలకు ఇప్పటికే డివార్మింగ్, టీకాలు చేయబడ్డాయి. ఇవి పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాయని, స్నేహపూర్వక స్వభావం కలిగివుండటం విశేషం. ఈ కుక్కలను దత్తత తీసుకోవడానికి ఎలాంటి ఫీజులు ఉండవని, కావలసిన వారు ఉచితంగా దత్తత తీసుకోవచ్చని అధికారులు తెలియజేశారు.
Cyberabad Traffic Police: హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన.. అతి త్వరగా ఇళ్లకు చేరుకోండి!
జీహెచ్ఎంసీ లక్ష్యం నగరంలోని వీధి కుక్కల సంఖ్యను తగ్గించడంతో పాటు, వారికి మానవీయ ప్రేమను పంచి మంచి వాతావరణాన్ని సృష్టించడం. ఈ దత్తత డ్రైవ్‌లో దత్తతకు తీసుకునే కుక్కలకు ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు, టీకాలు పూర్తి చేసిన తర్వాత మాత్రమే వాటిని అప్పగిస్తారు. ఈ కార్యక్రమం ద్వారా పెంపుడు జంతువులను కొనడం కాకుండా, దత్తత ద్వారా అవి కొత్త ఇంట్లో మంచి సంరక్షణ పొందాలని జీహెచ్ఎంసీ భావిస్తోంది. ప్రజలు కూడా ఈ కార్యక్రమానికి తమ మద్దతు ఇవ్వాలని కోరుతోంది.
ఈ డ్రైవ్ గురించి జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ సోషల్ మీడియాలో వివరించినప్పుడు జంతు ప్రేమికుల నుండి మంచి స్పందన వచ్చింది. జీహెచ్ఎంసీ ప్రకారం, ఈ దత్తత కార్యక్రమం వీధి కుక్కలకు కొత్త జీవితాన్ని మాత్రమే అందించదు, వాటిని దత్తత తీసుకునే కుటుంబాలకు కూడా మంచి స్నేహితులను అందిస్తుంది.