ధాన్యం కొనుగోళ్లపై తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య వాడివేడిగా మాటల యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ.. పార్లమెంట్లో టీఆర్ఎస్ సభ్యుల వ్యవహార శైలిని చూసి తెలంగాణ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఆయన అన్నారు. అంతేకాకుండా వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి బాధ్యతారహితంగా మాట్లాడతున్నారని ఆయన అన్నారు. ఇంకా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేని దుస్థితిలో తెలంగాణ ప్రభుత్వం ఉందని, ధాన్యం సేకరించాలని ఎమ్మెల్యేలే ఆందోళన చేస్తున్నారని […]
ఏపీలో ఇటీవల ఎన్నికైన 11 మంది కొత్త ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం కార్యక్రమం మండలిలో జరుగుతోంది. ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. మండలిలో బలం ఉందని ప్రతిపక్షం ఎలా వ్యవహారించిందో చూశామని, ఈ రోజు శుభదినమన్నారు. పార్టీని నమ్ముకున్న వారికి జగన్ తప్పక న్యాయం చేస్తారనడానికి ఇదే నిదర్శనమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ప్రతి ఎన్నికల్లో విజయం సాధిస్తున్నామని, నేతల మధ్య విభేదాలున్నా కలిసి కట్టుగా పని చేసి, ప్రజల […]
ఐటీ కారిడార్‌లో ప్రభుత్వ వైద్యసేవలను విస్తృతం చేయడంలో భాగంగా కొండాపూర్‌లోని జిల్లా ఆస్పత్రిలో 100 పడకలతో ఏర్పాటు చేసిన మూడో అంతస్తును వైద్య ఆరోగ్యశాఖ మంత్రి టి. హరీశ్‌రావు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. మైండ్‌స్పేస్ బిజినెస్ పార్క్స్ , ఆర్ఈఐటీ (రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్), కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్)ల చొరవతో 100 పడకల సౌకర్యం ఏర్పాటు చేశామన్నారు. దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం కొండాపూర్ జిల్లా ఆసుపత్రిలో డయాలసిస్ యూనిట్‌ను […]
ముషీరాబాద్ రిసాలగడ్డ వాటర్ ట్యాంక్‌ను శుభ్రం చేసేందుకు వచ్చిన సిబ్బందికి మృతదేహం కనిపించడంతో పోలీసులుకు, అధికారులకు సమాచారం అందించారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని పిలిపించి మృతదేహాన్ని వాటర్ ట్యాంక్ నుంచి బయటకు తీశారు. అయితే 50 అడుగుల ఎత్తున్న వాటర్ ట్యాంక్‌కు రెండు ద్వారాలు ఉన్నాయని.. ఆ రెండూ మూసే ఉన్నాయని పోలీసులు తెలిపారు. అంతేకాకుండా వాటర్ ట్యాంక్ పైన ఓ చెప్పుల జత కనిపించడంతో దాని ఆధారంగా పోలీసులు దర్యాప్తు […]
జగిత్యాల రూరల్ మండలం వెల్దుర్తిలో మంగళవారం మధ్యాహ్నం ఓ రైతు తన వ్యవసాయ పొలంలో సజీవ దహనమైన ఘటన చోటు చేసుకుంది. పొలంలో కాలిపోయిన మృతదేహాన్ని కుటుంబ సభ్యులు గుర్తించడంతో అర్థరాత్రి ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోతుగంటి లక్ష్మణ్ గౌడ్ (54) మంగళవారం మధ్యాహ్నం తన వ్యవసాయ పొలంలో వరి చెత్తకు నిప్పంటించగా ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. కంటిచూపు సమస్య ఉన్న లక్ష్మణ్ గౌడ్ మంటలను గమనించలేకపోయాడు. అతడిని రక్షించేందుకు చుట్టుపక్కల […]
కరోనా రక్కసి కోరల్లో చిక్కుకొని ఫ్రాన్స్ విలవిలలాడుతోంది. ఇప్పటికే డెల్టా వేరియంట్‌తో దేశ వ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వాలు కరోనా నిబంధనలు పటిష్టంగా అమలు చేస్తున్నా కరోనా విజృంభనమాత్రం తగ్గడం లేదు. దీనికి తోడు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు సంఖ్య కూడా ఆదేశాన్ని కలవరడపెడుతోంది. పరిస్థితి ఇలాగే ఉంటే ఆసుపత్రులు పూర్తి స్థాయిలో వినియోగించినా సరిపోవని ఫ్రాన్స్ వైద్య నిపుణులు అంటున్నారు. ఈ నేపథ్యంలో అత్యవసర పరిస్థితుల్లో విధించే ‘కోడ్ వైట్’ అలర్ట్‌ను […]
మధ్యప్రదేశ్‌లోని పన్నా వజ్రాల గనుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ గనుల్లో పనిచేసే కూలీలు రాత్రికి రాత్రే లక్షాధికారులవడం మామూలే. అయితే తాజాగా మరో కూలీని అదృష్టం వరించింది. దీంతో ఆ కూలీ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. గిరిజన కూలీ అయిన ములాయం సింగ్‌కు జీవితం రోజువారీ పోరాటం. తన పిల్లలను చదివించుకోవటం, ఇళ్లు గడపడం చాలా కష్టంగా మారింది. అయితే, మధ్యప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్ ప్రాంతంలోని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పన్నా వజ్రాల గనుల్లోని నిస్సార […]
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతూ ప్రపంచ దేశాల్లో గందరగోళాన్ని సృష్టిస్తోంది. గత రెండు కరోనా వేవ్‌లతోనే ఎంతో మంది జీవితాలు అతలాకుతలమయ్యాయి. అయితే ఇప్పుడు ఒమిక్రాన్ రూపంలో మరోసారి కరోనా రక్కసి విజృంభించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే వివిధ దేశాలకు పాకిన ఈ వేరియంట్ భారత్‌లోకి కూడా ఎంటరైంది. ఒమిక్రాన్ కేసులు రోజురోజుకు భారత్‌లో పెరుగుతున్నాయి. అంతేకాకుండా మునిపటికంటే ఒమిక్రాన్ వెలుగులోకి వచ్చిన తరువాత తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా కరోనా కేసులు సంఖ్య […]
కరోనా మహమ్మారి కొత్త వేరియంట్ ఒమిక్రాన్ రూపంలో మరోసారి ప్రపంచ దేశాలను భయాందోళన గురి చేస్తోంది. డెల్టా వేరియంట్‌తోనే తలమునకలైన ప్రపంచ దేశాలకు ఇప్పుడు ఒమిక్రాన్ చావుదెబ్బ కొట్టేలా కనిపిస్తోంది. డెల్టా వేరియంట్ కంటే 6 రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతున్న ఒమిక్రాన్ ఇప్పుడు 57 దేశాలకు పాకింది. దక్షిణాఫ్రికాలో గత నెలలో వెలుగు చూసిన ఈ వేరియంట్ రోజురోజుకు వ్యాప్తి చెందుతూ ప్రపంచ దేశాల ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 1,701 ఒమిక్రాన్ […]