ఎన్ని చట్టాలు చేసినా.. ఎన్ని కఠిన శిక్షలు వేసినా కామాంధుల్లో మాత్రం మార్పు రావడం లేదు. అవకాశాన్ని ఆసరాగా చేసుకొని వేధింపులకు గురిచేస్తూ తమ వాంఛ తీర్చుకుంటున్నారు. ఇలాంటి ఘటనే మేడ్చల్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం మేడ్చల్ కు చెందిన ఓ యువతి తన తండ్రి రిటైర్డ్ ఉపాధ్యాయుడు మృతి చెందడంతో పాటు అంతకు ముందే తల్లి కూడా కన్నుమూయడంతో.. తండ్రి పింఛన్ ను తనకు ఇప్పించాలని మేడ్చల్ ట్రెజరీ కార్యాలయంలో అదనపు ట్రెజరీ […]
ఏపీలో ఓటీఎస్‌పై మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. వన్ టైం సెటిల్మెంట్ అంటూ ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన పథకంపై మీడియా పేరుతో కొన్ని సంస్థలు టెర్రరిజం చేస్తున్నాయంటూ వైసీపీ రాష్ట్ర కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా గ్రామ, వార్డు సచివాలయాల్లో కూడా రిజిస్ట్రేషన్ చేస్తారని, ఈ పథకం వల్ల పేదలకు జరిగే ప్రయోజనాన్ని ప్రజలకు వివరించాల్సింది పోయి విమర్శలు చేస్తారా అంటూ ధ్వజమెత్తారు. గత టీడీపీ ప్రభుత్వం కనీసం వడ్డీ […]
మహానగరంలో మాయగాళ్లకు కొదవేలేదు అంటుంటారు. ఎందుకంటే.. రోజురోజుకు భాగ్యనగరంలో కొత్తకొత్త రూపాల్లో మోసాలు వెలుగులోకి వస్తున్నాయి కాబట్టి. అందులో అక్రమ నిర్మాణాలు కూడా ఒకటి. అయితే హైదరాబాద్‌లో నకిలీ ధృవప్రతాలు సృష్టించి అక్రమ నిర్మాణాలు చేస్తున్న వారిపై హెచ్ఎండీఏ ప్రత్యేక దృష్టి సారించింది. హెచ్ఎండీఏ పరిధిలో అక్రమ కట్టడాల పై కొరడా ఝుళిపించేందుకు అధికార యంత్రాగాన్ని సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 30 లోపు అక్రమ కట్టడాలను గుర్తించి కూల్చివేయాలని హెచ్ఎండీఏ పరిధిలోని మునిసిపల్ కమిషనర్ […]
ఉదయాన్నే కాలేజీకి వెళ్లిన కూతురు శవమై తిరిగి ఇంటికివస్తే ఆమె తల్లిదండ్రుల మనోవేదన వర్ణానాతీతం. ఇలాంటి ఘటనే మేడ్చల్ జిల్లాలో చోటు చేసుకుంది. గాజులరామరంకు చెందిన మేఘన దుండిగల్ లోని మర్రి లక్ష్మణ్ రెడ్డి కళాశాలలో ఇంజినీరింగ్ మూడవ సంవత్సరం చదువుతుంది. నేడు మధ్యాహ్న సమయంలో మరో స్నేహితురాలు సుమనశ్రీ తో కలిసి కళాశాల నుంచి తిరుగు ప్రయాణంలో గండిమైసమ్మ చౌరస్తా వద్ద ద్విచక్రవాహనంపై వెళ్తుండగా వెనక నుంచి టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మేఘన […]
నేటి సమాజంలో ప్రాణానికి విలువలేకుండా పోయింది. అర్థంపర్థం లేని అనుమానాలతో మస్తిష్కంలో మంటలు పుట్టించుకోని.. వారి ఆలోచనలతో ఆ మంటలకు ఆజ్యం పోసుకుంటూ నమ్మివచ్చిన వారినే కడతేర్చుతున్నారు. ఇలాంటి ఘటన హైదరాబాద్‌లోని కూకల్‌పల్లిలో చోటు చేసుకుంది. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని గూడ్స్ షెడ్ రోడ్డులో పుణ్యవతి, సంతోష్ అనే భార్యభర్తలు నివాసం ఉంటున్నారు. అయితే ఈ ఏడాది మే నెలలో వీరికి వివాహం జరిగింది. వివాహం జరిగిననాటి నుంచి భార్య పుణ్యవతిపై భర్త సంతోష్ అనుమానం […]
ప్రపంచ దేశాలను గడగడలాడించిన కరోనా మహమ్మారి కొత్తగా రూపాంతరాలు చెంది ప్రజలపై విరుచుకుపడుతోంది. కరోనా ముందు ఎంతో అత్యాధునిక టెక్నాలజీ ఉన్న అమెరికా సైతం మోకరిల్లిక తప్పలేదు. అంటే అర్థం చేసుకోవచ్చు దీని ప్రభావం ఏ రేంజ్లో ఉందని. అయితే భారత్ కూడా కరోనా రక్కసి చేతుల్లో చిక్కుకొని ఎంతో విలవిలలాడింది. కరోనా ఫస్ట్ వేవ్ కంటే కరోనా డెల్టా వేరియంట్ సృష్టించిన సెకండ్ వేవ్‌తో ఎంతో మంది జీవితాలు అతలాకుతలమయ్యాయి. డెల్టా వేరియంట్ నుంచి ఇప్పడిప్పుడే […]
టీఆర్ఎస్లో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. వికారాబాద్ జిల్లా తాండూరులో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలోనే టీఆర్ఎస్ నేతలు మధ్య ఉన్న విభేదాలు బయటపడ్డాయి. దీంతో ఒక్కసారికి అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి వర్గాల మధ్య గత కొన్ని రోజుల నుంచి కోల్డ్ వార్ నడుస్తోంది. ఈ విషయం స్థానిక నేతలకు తెలిసినా వారి మధ్య సంది కుదిర్చేందుకు సహాసించలేదు. అయితే నేడు సబితా ఇంద్రారెడ్డి ముందే ఇరు వర్గాల నేతల […]
స్థానిక సంస్థ ఎమ్మెల్సీ ఎన్నికలు నేడు తెలంగాణలో జరుగుతున్నాయి. అయితే ఇప్పటికే పలు స్థానాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీలో ఉన్న అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే ఖమ్మంలో కూడా ఎమ్మెల్సీ స్థానానికి టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తమతమ అభ్యర్థులను బరిలోకి దించాయి. అంతేకాకుండా కావాల్సినంత ప్రచారం కూడా చేశాయి. అయితే నేడు ఎన్నికలకు పోలింగ్ జరుగుతున్న వేళ ఖమ్మం పోలింగ్ సెంటర్ వద్ద సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నిరసన వ్యక్తం చేశారు. గంటల […]
గత నెల దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్, ఇప్పటికే పలు దేశాలకు వ్యాప్తి చెంది దాని ప్రభావాన్ని చూపుతోంది. అంతేకాకుండా ఇటీవల భారత్‌లోకి కూడా ఈ డేంజరస్ వైరస్ ప్రవేశించడంతో వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేబుల్ డిసీజెస్ (NICD) డేటా ప్రకారం.. నవంబర్ 28 నుంచి డిసెంబర్ 4 మధ్య, కోవిడ్ ఇన్ఫెక్షన్లలో 34.9 శాతం 10 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల మధ్య పిల్లలే ఉన్నారని […]
గత రెండు సంవత్సరాలు భారత్‌తో పాటు ప్రపంచ దేశాలను సైతం పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. గత నెల దక్షిణాఫ్రికాలో బయటపడ్డ ఒమిక్రాన్ వేరియంట్‌తో ప్రజలు మరింత భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఒమిక్రాన్ వేరియంట్ పలు దేశాలకు వ్యాప్తి చెందడంతో విమాన ప్రయాణాలపై ఆంక్షాలు విధించారు. అంతేకాకుండా విదేశాల నుంచి భారత్‌కు వచ్చిన వారికి కరోనా పరీక్షలు మరింత ముమ్మరంగా వైద్యులు చేస్తున్నారు. అయితే తాజాగా నెల్లూరు జిల్లాలోని కావలిలో కరోనా కలకలం సృష్టిస్తోంది. కావలికి […]