మద్యం మత్తులో తూగుతూ వాహనాల నడిపి ప్రజల ప్రాణాలను బలిగొంటున్నారు. జల్సాల కోసం మద్యం సేవించి అమాయక ప్రజల ప్రాణాలు తీస్తున్నారు. రోజురోజుకు డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రమాదాలు పెరిగిపోతున్న నేపథ్యంలో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో వీఐపీ జోన్ అయిన చిరంజీవి బ్లడ్ బ్యాంక్, అపోలో బస్ స్టాప్, క్యాన్సర్ హాస్పిటల్ తో పాటు తదితర చోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. దీంతో మంగళవారం రాత్రి ట్రాఫిక్ జామ్ అయ్యింది. […]
విశాఖపట్నంలోని తెలుగుతల్లి ఫ్లైఓవర్ పై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతి వేగంతో డివైడర్ ను బైక్ ఢీకొట్టడంతో అదుపుతప్పి యువతీ, యువకుడు మృతి చెందారు. మృతులు విజయనగరం జిల్లా బొబ్బిలి ప్రాంతానికి చెందిన ప్రశాంత్ (22), ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న మురళీనగర్ ప్రాంతానికి చెందిన రాధిక(17) గా పోలీసులు గుర్తించారు. సీతమ్మధారలోని ఓ సెలూన్లో ప్రశాంత్ పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు. అయితే ప్రమాదం జరిగినప్పుడు తలకు బలమైన గాయం అవ్వడంతో ప్రశాంత్ అక్కడికక్కడే మృతిచెందాడు. […]
దళిత యువకుడిని కొట్టిన కేసులో నల్లగొండ టూ టౌన్ ఎస్సై డి. నర్సింహులు, కానిస్టేబుల్ ఎస్.కె. నాగుల్ మీరా లను సస్పెండ్ చేసినట్లు జిల్లా ఎస్పీ ఏ.వి. రంగనాధ్ తెలిపారు. నల్లగొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో దళిత యువకుడిని ఎస్సై, కానిస్టేబుల్ కొట్టిన వ్యవహారం సామాజిక మాధ్యమాలు, మీడియా ద్వారా ఎస్పీ రంగనాధ్ దృష్టికి రావడంతో రెండు రోజుల క్రితం ఘటనపై సమగ్ర విచారణ కోసం డీటీసీ ఎస్పీ సతీష్ చోడగిరిని విచారణ అధికారిగా […]
దక్షిణాఫ్రికాలో జరిగే మూడు టెస్టుల సిరీస్ కోసం నేడు భారత జట్టు ప్రకటించనుంది. 22 మందితో జంబో బృందాన్ని ఎంపిక చేసే అవకాశం ఉంది. ఉద్యోగ విభజనపై వడవడిగా అడుగులు వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం నేటి నుంచి ఉద్యోగులకు ఆప్షన్లు అందుబాటులో ఉంచనుంది. తొలుత ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో అమలు జరుగనుంది. నేడు వడ్డీ రేట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన చేయనుంది. నేటితో ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ భేటీ ముగియనుంది. ఈ నేపథ్యంలో బ్యాంకులలో […]
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలల్లో గంప గోవర్థన్ రూటే సపరేటుగా ఉంటుంది. ఆయన దేనిపైన స్పందించినా తన దైనతీరుతో వెళ్తుంటారు. తాజాగా ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే అయిన గంప గోవర్థన్ కలెక్టరేట్ కి రైతులతో పాటు ధాన్యంలోడ్‌తో ఉన్న లారీ తీసుకువచ్చారు. 3వ తేదీ నుండి రైతులను రైస్ మిల్ యజమానులు ఇబ్బంది పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తి చేశారు. జిల్లా లో కొందరు రైస్ మిల్స్ యజమానులు రైతులను ఇబ్బంది పెడుతున్నారని, జిల్లాలో మిగిలిన 20 శాతం ధాన్యం […]
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌పై అసైన్డ్ భూముల అక్రమణ కేసుపై ఈటల జమున మీడియా మాట్లాడారు. చట్టపరంగానే భూములు కొన్నామని ఈటల జమున వివరించారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఈటల జమున మాటలపై స్పందిస్తూ.. సర్వే నంబర్ 130 లో పట్టా ల్యాండ్ లేదని వెల్లడించారు. ఈటల జామున కొనుగోలు చేసిన 3 ఎకరాలు చట్ట విరుద్ధమైన పత్రమని ఆయన అన్నారు. అంతేకాకుండా ఆ భూమి పై ఎలాంటి హక్కు లేని రామరావు దగ్గర నుండి […]
ఖమ్మం ఎమ్మెల్సీ టీఆర్ఎస్ అభ్యర్థిగా తాతా మధుకు సంబంధించిన ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కార్పొరేటర్లు అందరినీ గోవా క్యాంప్ కు తరలించారు. గత వారం రోజులుగా 470 మంది ఓటర్లు వారితోపాటు వారి బంధువులు అంతా గోవాలో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. గోవాలో డ్యాన్సులతో మారుమోగుతున్న వీడియోలను ఎప్పటికప్పుడు ఎన్టీవీ అందించింది. అయితే ఈ నెల పదో తారీఖున ఓటింగ్ ఉండటంతో అక్కడ ఉన్న ఓటర్లను ముందుగా హైదరాబాద్ కి తరలిస్తున్నారు. ప్రస్తుతతం గోవాలో ఉన్న ఓటర్లు […]
మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. ఆయన అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో ఘనంగా నిర్వహించారు. అయితే రేపు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి వద్ద గోదావరిలో రోశయ్య అస్తికలు నిమజ్జనం చేయనున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో అస్తికలను కుటుంబ సభ్యులు రాజమండ్రికి తీసుకురానున్నారు. రేపు రోశయ్య అస్తికల నిమజ్జనం సందర్భంగా వర్తక, వ్యాపార వర్గాలు ఈ కార్యక్రమంలో పాల్గొని సంతాపం తెలపాలని […]
విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గ అభివృద్ధిపై మంత్రి అవంతి శ్రీనివాస్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అవంతి మాట్లాడుతూ.. భీమిలిలో భూ సంబంధిత సమస్యలు ఎక్కువగావున్నాయని వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా ఎండోమెంట్ భూములను రెగ్యులరైజ్ చేయడానికి ప్రభుత్వానికి అధికారం లేదని, భీమిలీలో పదివేల మందికి పైగా ఇళ్లపట్టాలిచ్చామని పేర్కొన్నారు. ఓటీఎస్ పై ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కడుతున్నారని ఎవరినీ బలవంతం పెట్టడం లేదని ఆయన తెలిపారు. ఓటీఎస్ కట్టని వారికి […]
ముషీరాబాద్ హరినగర్ రీసాలగడ్డ వాటర్ ట్యాంక్ లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. వాటర్ ట్యాంక్ ను శుభ్రం చేయడానికి వచ్చిన వాటర్ వర్క్స్ సిబ్బందికి మృతదేహం కనిపించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వెంటనే సిబ్బంది వాటర్ వర్క్స్ అధికారులకు, పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటన స్థలానికి ముషీరాబాద్ సీఐ జహంగీర్ యాదవ్, స్థానిక కార్పొరేటర్ రవి చారి, వాటర్ వర్క్స్ ఇన్ స్పెక్టర్ లు చేరుకున్నారు. […]