వివాదాస్పద షియా ఉత్తరప్రదేశ్ వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ వసీం రిజ్వీ సోమవారం ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో గల దాస్నా ఆలయంలో ఇస్లాం మతం వీడి హిందు మతం స్వీకరించారు. ఆలయ పూజారి యతి నర్సింహానంద సరస్వతి ఆచారాలను నిర్వహించి వసీం రిజ్వీని హిందు మతంలోకి మార్చారు. అయితే అనంతర రిజ్వీ పేరు జితేంద్ర నారాయణ్ సింగ్ త్యాగిగా మార్చినట్లు తెలిపారు. త్యాగిగా పేరు మార్చుకున్న రిజ్వీ మాట్లాడుతూ.. ఏ మతాన్ని అనుసరించాలనేది తన ఇష్టమని, కాబట్టి ప్రపంచంలోని […]
తెలంగాణలో ధాన్యం కొనుగోలుపై టీఆర్ఎస్, బీపేజీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వడం లేదంటూ అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలు అంటుంటే.. ప్రతి గింజను కేంద్ర ప్రభుత్వం కొంటుందని బీజేపీ నేతలు హామీలు ఇస్తున్నారు.ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మేము టీఆర్ఎస్కో, కేసీఆర్‌కో భయపడేవాళ్ల కాదని.. ఒకవేళ భయపడితే రైతులకు భయపడుతామని ఆయన అన్నారు. అంతేకాకుండా మెడ మీద కత్తిపెట్టి సంతకం […]
టీడీపీ నేత పట్టాభిరామ్ మరోసారి సీఎం జగన్ తో పాటు వైసీపీ నేతలపై విమర్శలు చేశారు. అయితే తాజాగా ఏపీ ప్రభుత్వం లేఅవుట్లలో 5 శాతం ప్రభుత్వానికి ఇవ్వాలంటూ గెజిట్ నోటిషికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన పట్టాభి.. లేఅవుట్లలో 5 శాతం ప్రభుత్వానికి ఇవ్వాలని తీసుకువచ్చిన కొత్త నిబంధన మరో మోసమని ఆయన అన్నారు. పేదల ఙల్ల కోసం ఇప్పటికే 68 వేల ఎకరాలు సేకరించారన్నారు. ఇప్పుడు లేఅవుట్ల నుంచి అదనంగా వెయ్యి […]
తెలంగాణలో రోజు రోజుకు డ్రంకెన్ డ్రైవ్ వల్ల ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. జల్సాల కోసం మద్యం సేవించి రోడ్లపై వాహనాలు నడుపుతూ ఎంతో మంది జీవితాలను బలిగొంటున్నారు. కుటుంబాలకు పెద్దదిక్కైన వారు ప్రమాదాల్లో చిక్కుకోవడంతో వారినే నమ్ముకున్న వారి జీవితాలు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. అయితే డ్రంకెన్ డ్రైవ్ ప్రమాదాలపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రమాదాల నివారణకు త్వరలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని ఆయన వెల్లడించారు. పోలీసులు, ఎక్సైజ్, వైద్య నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. అంతేకాకుండా […]
ఏపీలో వరి వార్ మొదలైంది. తెలంగాణలో వరి వేయవద్దంటూ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలతో గందరగోళం నెలకొంది. ఏపీలో కూడా వరి వేయవద్దంటూ అధికారి వైసీపీ నేతలు చెప్పడంతో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే దీనిపై స్పందించిన టీడీపీ నేత, మాజీ మంత్రి జవహార్ సీఎం జగన్, వైసీపీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జవహర్ మాట్లాడుతూ.. జగన్ చర్యలతో వ్యవసాయం కుదేలైందని, సీఎం జగన్ ఏపీలో వరిపంటకు ఉరివేశాడంటూ తీవ్రంగా ధ్వజమెత్తారు. […]
టీడీపీ అధినేత చంద్రబాబు డా.బీఆర్ అంబేద్కర్ వర్థంతి సందర్బంగా నివాళులు అర్పించారు. అంతేకాకుండా రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికీ హక్కులు ఉన్నాయంటూ వైసీపీ ప్రభుత్వ ఆ హక్కులను కాలరాస్తుందని తీవ్రంగా విమర్శించారు. అంతేకాకుండా ఓటీఎస్ పేరుతో ప్రజలకు వైసీపీ ప్రభుత్వం ఉరి వేస్తోందని చంద్రబాబు ఆరోపించారు. అయితే ఈ నేపథ్యంలో చంద్రబాబు మాటలకు కౌంటర్ గా వైసీపీ నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.
అంబేద్కర్ వర్థంతిని పురస్కరించుకొని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళితబంధుపై కీలక వ్యాఖ్యలు చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నిక కోసమే దళితులను కేసీఆర్ మభ్యపెట్టారని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా ఎన్నికల తరువాత దళిత బంధు ఎందుకు అమలు చేయటంలేదో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ తీరును ప్రజలు గమనిస్తున్నారన్నారు. దళితులకు మేలు చేసే ఉద్దేశం ఉంటే తక్షణమే దళిత బంధు అమలు చేయాలని డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీ […]
డా. బీఆర్ అంబేద్కర్‌ను స్ఫూర్తిగా తీసుకుని తెలుగుదేశం పార్టీని మా నాయకుడు ఎన్టీఆర్ స్థాపించారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… అంబేద్కర్ ఆశయాల కోసం ఎన్టీఆర్ కృషి చేశారని గుర్తు చేశారు. అంతేకాకుండా రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన ఆంశాలు భారతదేశానికే కాకుండా చాలా దేశాలకు ఆదర్శంగా నిలిచాయన్నారు. అంబేద్కర్ దేశశిల్పి అంటూ కొనియాడారు. అంతేకాకుండా రాజ్యాంగం ఎంతమంచిదైనప్పటికీ పాలించేవారు మంచివారు కాకపోత చివరికి రాజ్యాంగం కూడా తప్పుగా […]