ఏపీలో వైసీపీ, టీడీపీ నేతలు ఒకరిపైఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. అయితే తాజాగా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి నెల్లూరు జిల్లాలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి జగన్ హోల్ సేల్ గా దోచుకుంటుంటే.. ఎమ్మెల్యేలు రిటైల్‌గా దోపిడీ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా నెల్లూరు జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేలు అక్రమాలకు, అవినీతికి పాల్పడుతున్నారని ఆయన అన్నారు.
కావలిలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అవినీతిలో ముందంజలో ఉన్నారని ఆయన మండిపడ్డారు. కావలిలో ఏమి జరగాలన్నా ఎమ్మెల్యే అనుమతి అవసరమని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. ఇసుకను, మట్టిని దోపిడీ చేస్తున్నారని, ఎమ్మెల్యే ఆయన అనుచరుల ఆగడాలకు అడ్డుకట్ట వేస్తామని ఆయన హెచ్చరించారు. వైసీపీ నేతలను ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన అన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు తగిన బుద్ది చెబుతారని ఆయన అన్నారు. పీఆర్సీతో ఉద్యోగులకు తీవ్రి అన్యాయం చేశారని, ఎన్నో ఉద్యోగ సంఘాలు పీఆర్సీపై అసంతృప్తితో ఉన్నాయని ఆయన అన్నారు.