BJP MLA Rajasing Says 5 state Elections Result Repeat at Telangana also.
ఇటీవల మణిపూర్, ఉత్తరాఖండ్, గోవా, ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లోని అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల జరిగిన విషయం తెలిసిందే. అయితే నేడు ఈ 5 రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఉదయం ప్రారంభం నుంచి బీజేపీ అభ్యర్థులు పంజాబ్ మినహా మిగతా 4 రాష్ట్రాల్లో ముందంజలో ఉన్నారు. అయితే పంజాబ్‌లో మాత్రం ఆప్ పార్టీ అభ్యర్థులు ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. అయితే 4 రాష్ట్రాల్లో బీజేపీ విజయం దిశగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ.. దౌర్జన్యాలు, అన్యాయాలపై యోగి ఆదిత్యనాథ్ ఉక్కుపాదం మోపాడు అని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా ప్రజా సంక్షేమానికి కృషి చేసాడని, యోగి గెలవాలని యావత్ భారత్ కోరుకుందని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణలో కూడా ఇవే ఫలితాలు రిపీట్ అవుతాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. కేసీఆర్ కి కలలో కూడా మోడీ వస్తున్నాడని.. ఉలిక్కిపడుతున్నాడంటూ ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పని దేశంలో అయిపోయిందని, తెలంగాణలో కూడా ఈసారి ఖతం అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని, ఎంఐఎం బ్లాక్ మెయిల్ పార్టీ… డబ్బులు ఇస్తారా.. అభ్యర్థి ని నిలబెట్టాలా అని బెదిరిస్తుంది అంటూ ఆరోపణలు చేశారు.