Tragedy : దసరా పండుగ రోజు నల్గొండ జిల్లా విషాదంలో మునిగిపోయింది. చందంపేట మండలం దేవరచర్ల డిండి వాగులో జరిగిన దుర్ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. తొలుత వాగులోకి దిగిన సాయి ఉమాకాంత్ (10) అనే బాలుడు ప్రమాదవశాత్తూ నీటిలో కొట్టుకుపోయాడు. అతడిని రక్షించేందుకు రాము (30), గోపి (21) వాగులోకి దిగి గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను బయటకు తీశారు. దసరా పండుగను జరుపుకోవడానికి తెనాలి నుంచి బంధువుల ఇంటికి వచ్చిన వీరి మరణం కుటుంబ సభ్యులను కన్నీటి పర్యంతం చేసింది.
Munawar Faruqui: హిందూ దేవుళ్లపై జోకులు.. మునావర్ ఫరూఖీ హత్యకు గ్యాంగ్‌స్టర్ ప్లాన్..