టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, అందాల నటి కీర్తి సురేష్ జంటగా నటించిన సినిమా ‘సర్కారు వారి పాట’. ఈ చిత్రానికి పరుశురాం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ యూసఫ్గూడాలోని పోలీస్ గ్రౌండ్స్‌లో జరుగుతోంది. అయితే ఈ వేడుకకు డైరక్టర్లు అనిల్ రావిపూడి, సుకుమార్, వంశీ పైడిపల్లి, బుచ్చిబాబు, గోపిచంద్ మలినేనితో పాటు హీరో సుధీర్ బాబు, తదితరులు హజరయ్యారు. వీరితో పాటు ఇటీవల హీరో సినిమాతో తెరగేట్రం చేసిన […]
పుడ్డింగ్ అండ్ మింకి పబ్ వ్యవహారంలో పోలీసుల విచారణ వేగంగా కొనసాగుతుంది. పబ్ లోపలికి డ్రగ్స్ ఎలా వచ్చాయని దానిపైన పోలీసుల విచారణ దాదాపుగా పూర్తి చేశారని చెప్పవచ్చు. అయితే పబ్ లోపలికి డ్రగ్స్ తీసుకు వచ్చిన వారిని పోలీసులు గుర్తించారు .. పబ్ పై దాడి చేసి 148 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. నలుగురు వ్యక్తులు పబ్ లోకి డ్రగ్స్ తీసుకొని వచ్చినట్టుగా తేలింది. అయితే పబ్ యజమానికి వ్యవహారం మొత్తం తెలిసే డ్రగ్స్ […]
రాహుల్ గాంధీ రెండు రోజుల తెలంగాణ పర్యటన కాంగ్రెస్ క్యాడర్లో జోష్ నింపింది. వరంగల్ సభ సక్సెస్ పట్ల ఆ పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ తన పర్యటన రెండవ రోజు హైదరాబాద్‌లో పలు సమావేశాలు నిర్వహించారు. ముందుగా చెంచల్‌గూడ జైలుకు వెళ్లి ఎన్ఎస్యూఐ విద్యార్థులను పరామర్శించారు. తరువాత గాంధీ భవన్ లో వివిధ విభాగాలకు చెందిన పార్టీ నేతలను కలిశారు. తాజ్ కృష్ణా హోటల్లో తెలంగాణ ఉద్యమకారులతో కూడా సమావేశమయ్యారు. వారితో పాటు […]
ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ నిన్న, నేడు తెలంగాణలో పర్యటించిన విషయం విధితమే. అయితే.. నిన్న వరంగల్‌లో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ‘రైతు సంఘర్షణ’ సభలో పాల్గొన్న రాహుల్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్, బీజేపీ, ఓవైసీలకు ఛాలెంజ్ విసరడానికే తాను రాష్ట్రానికి వచ్చినట్లు ఆయన వ్యాఖ్యానించారు. అయితే రాహుల్ వ్యాఖ్యలపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ స్పందిస్తూ.. తెలంగాణాకు ఎవరైనా రావొచ్చన్న అసద్.. రాహుల్‌కు తెలంగాణ గురించి ఏమీ తెలియదన్నారు. అంతేకాకుండా.. ఏం మాట్లాడాలో అని అడిగిన రాహుల్ […]
తెలంగాణలో ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ పర్యటన ముగిసింది. ఈ నేపథ్యంలో.. మాజీ టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఎన్టీవీ ఫేస్ టూ ఫేస్ నిర్వహించింది. ఈ సందర్భంగా.. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. రెండు రోజుల రాహుల్ టూర్ తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త జోష్ నింపిందని ఆయన వ్యాఖ్యానించారు. గాంధీ కుటుంబం మీద మాట్లాడే అంతా గొప్పొడా కేటీఆర్ అంటూ మండిపడ్డారు ఉత్తమ్.. పని చేసే వారికే ఈ సారి అదిష్టానం టికెట్లను […]
ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనపై బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ థీమ్ ఒక్కటే.. దేశ సంపదను దోచుకోవడం అంటూ ఆరోపించారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉండగా 12 లక్షల కోట్లను లూటీ చేశారని, రాహుల్ గాంధీ పొలిటికల్ టూరిస్ట్ అంటూ మండిపడ్డారు. దేశ సంపదను దోచిన పార్టీ ఇంకా ఖతమవ్వలేదు.. ఆ పార్టీ ఇంకా కొనసాగుతోందని, రైతుల కష్టాలపై ఎలాంటి చింత […]
సరూర్ నగర్లో ఇటీవల జరిగిన హత్య గురించి.. ముస్లిం యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగరాజును హత్య చేయడంపై ఖండిస్తున్నట్లు ఒక మీటింగ్ లో అసదుద్దీన్ ఓవైసీ ప్రకటించారు. అయితే దీనిపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ.. ముస్లిం అమ్మాయి.. హిందూ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఇంట్లో నుంచి బహిష్కరిస్తే బాగుండేది.. కానీ అలా మర్డర్ చేయడం బాగోలేదని ఓవైసీ అన్నాడని, కానీ ఇదంతా షోకుటాప్ ముచ్చట్లే అంటూ మండిపడ్డారు. అసద్ మనసులో ఉంది ఒకటి… నోటి […]
తెలంగాణలో ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ పర్యటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ టీఆర్ఎస్ను టార్గెట్ చేస్తూ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో రాహుల్ వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. రాహుల్ గాంధీ ఇప్పుడు ఏ పదవిలో తెలంగాణకు వచ్చారో నాకు తెలియదన్నారు. తెలంగాణలో రిమోట్ జరగడం లేదని.. మీ కాంగ్రెస్‌ది రిమోట్ పాలన అని కేటీఆర్ మండిపడ్డారు. మీరు చెప్పినవన్నీ నమ్మేందుకు ఇక్కడి ప్రజలు సిద్ధంగా లేరని, ఇక్కడి […]
Telangana IT and Industries Minister KTR laid the foundation for the Kitex unit at the Kakatiya Mega Textile Park Warangal, on Saturday. తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ నేడు వరంగల్‌ను కాకతీయ మెగా పార్కులో నిర్మించే ప్రఖ్యాత కంపెనీ కిటెక్స్ వస్త్ర పరిశ్రమకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా కారణంగా కంపెనీలు ప్రారంభించడానికి కొంత ఆలస్యం జరిగిందని, రాబోయే 18 నెలల్లో 20 […]
ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. అయితే నేడు తెలంగాణ పర్యటనలో భాగంగా రెండో రోజు హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో సభ్యత్వ సమన్వయ కర్తలతో రాహుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చాక బాగుపడింది కేసీఆర్ కుటుంబమేనని రాహుల్ గాంధీ విమర్శించారు. కాంగ్రెస్‌కు ఎవరితోనూ పొత్తు ఉండదని స్పష్టం చేసిన రాహుల్.. కేసీఆర్ వద్ద ధనం, అధికార బలం, పోలీసులు ఉన్నారు, కానీ జన బలం లేదని విమర్శించారు. ప్రజల […]