Instagram : ఇన్‌స్టాగ్రామ్‌లో మరో సరికొత్త ఫీచర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
New Feature in Instagram
ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతూ.. ఆకర్షిస్తున్న ఇన్‌స్టాగ్రామ్ ఇప్పుడు మరో కొత్త ఫీచర్‌ను లాంఛ్ చేయనుంది. ఇంతవరకు ఫోటో షేరింగ్, వీడియో రీల్స్, చాటింగ్ వంటివాటితో యూజర్లను ఆకర్షిస్తున్న ఇన్‌స్టా.. తాజాగా మ్యాప్స్ ఫీచర్‌ను తీసుకువచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ఈ ఫీచర్లతో యూజర్లు సులభంగా కొత్త లొకేషన్లను కనుగొనవచ్చని ఇన్‌స్టా తెలిపింది. ఇన్‌స్టా ఐజీ లో కొత్తగా మ్యాప్ ఫీచర్‌ను ప్రవేశపెడుతున్నట్టు మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ప్రకటించారు. ఈ కొత్త ఫీచర్‌తో యూజర్లు తమ సమీపంలో ఉన్న స్థానిక వ్యాపారాలు, వివిధ ప్రసిద్ధ స్థలాలను కనుగొనవచ్చని మార్క్ జుకర్‌బర్గ్ తెలిపారు. గతంలో యూజర్లు ఒక లొకేషన్ సందర్శించినప్పుడు వాళ్లు షేర్ చేసిన పోస్ట్‌లను మాత్రమే చూడగలిగేవారని.. కానీ, లొకేషన్ వివరాల గురించి తెలుసుకునే వీలు ఉండేది కాదన్నారు మార్క్ జుకర్‌బర్గ్.
Also Read
అయితే ఇన్‌స్టాలో రాబోయే లేటెస్ట్ అప్‌డేట్ మ్యాప్ ఫీచర్ ద్వారా లోకేషన్ వివరాలు కూడా తెలుసుకునేలా వీలు కల్పించనున్నట్లు మార్క్ జుకర్‌బర్గ్ పేర్కొన్నారు. ఇన్‌స్టాగ్రామ్ గత సంవత్సరం కొన్ని దేశాలలో ఈ మ్యాప్ ఫీచర్‌ని పరీక్షించింది. ఇది మనకి సమీపంలోని స్థలాల వివరాలు లేదా కేవలం మనకు కావాల్సిన షాపులను మాత్రమే చూపిస్తుంది. యూజర్లు ఒక ప్రాంతం కోసం సెర్చ్ చేసిన తర్వాత, అనవసరమైన వాటిని పక్కన పెట్టేందుకు అందులో ఫిల్టర్ ఆప్షన్ కూడా ఉంటుంది. దాన్ని సెలక్ట్ చేసుకుని మనం ఎంచుకున్న రెస్టారెంట్‌లు, బార్‌లు, పార్కులు లేదా ఇతర స్థలాలను ఎంచుకునేందుకు వీలుగా ఇన్‌స్టాగ్రామ్ కొత్త ఫీచర్‌ను తీసుకురానుంది.
తాజావార్తలు
-
UPI Charges: అక్టోబర్ 2న ‘నో UPI డే’.. అసలు ఏం జరుగుతుంది?
-
Amaravati Construction: అమరావతి నిర్మాణంలో కీలక సమస్య..! కార్మికులపై అధికారుల దృష్టి
-
Jayant C Paranjee: ఆడదని ముందే తెలుసు.. పవన్ కళ్యాణ్ సినిమాపై డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు!
-
Gandhi Jayanti 2026: గాంధీ జయంతి.. రాజ్‌ఘాట్‌లో బాపూజీకి ప్రధాని మోడీ ఘన నివాళులు
-
Car or Bike Buying Tips: కారు, బైక్ కొంటున్నారా? ఈ పని తప్పక చేయండి.. లేదంటే ఇబ్బందులే!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?