New Mobile From Vivo T Series.
ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వివో మరో కొత్త సిరీస్‌ను పరిచయం చేస్తూ మొబైల్స్‌ను విడుదల చేసింది. వివో టీ సిరీస్‌లో కొత్త వెర్షన్‌ను బడ్జెట్ ధరలో కస్టమర్లకు అందుబాటులోకి తీసుకువచ్చింది. వివో టీ1 ఎక్స్ పేరుతో, మూడు వేరియంట్లలో ఈ మొబైల్‌ను విడుదల చేసింది. వివో టీ1 ఎక్స్ బేసిక్ మోడల్ ధరను ధర రూ. 11,999గా ఉంది. అయితే.. వివో టీ1 ఎక్స్ ఫీచర్లు.. 6.58 అంగుళాల FHD+ డిస్‌ప్లే తో.. క్వాల్కం స్నాప్‌డ్రాగన్ 680 చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 12 OS, 50MP డ్యూయల్ కెమెరాలు, 8MP సెల్ఫీ కెమెరా, 5000mAh బ్యాటరీ ,18W ఫాస్ట్ ఛార్జింగ్ తో అందుబాటు ఉండగా..
4 జీబీ ర్యామ్+ 64జీబీ స్టోరేజ్ రూ. 11,999, 4 జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ రూ. 10,999, 6 జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్‌రూ. 14,999 ధరలలో లభ్యమవుతుంది. గ్రావిటీ బ్లాక్ , స్పేస్ బ్లూ కలర్స్ అందుబాటులో ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ వివో ఇ-స్టోర్ ద్వారా జూలై 27వ తేదీ నుండి మధ్యాహ్నం 12 గంటలనుంచి కొనుగోలుకు అందుబాటులో ఉంచనున్నట్లు వివో పేర్కొంది. అంతేకాకుండా.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కార్డుల కొనుగోళ్లపై రూ. 1,000 తక్షణ తగ్గింపును అందిస్తుంది వివో.