Stunning Features in Google Pixel 6A Smart Phone.
భారత విపణిలో తాజాగా గూగుల్ పిక్సెల్ 6ఏ స్మార్ట్‌ఫోన్ విక్రయాలు ప్రారంభమయ్యాయి. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌లోని ఫీచర్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ 43,999కు అందుబాటులో ఉండగా.. ఎక్స్ఛేంజ్, బ్యాంక్ ఆఫర్లతో పిక్సెల్ పోన్‌ను రూ 35,000కే సొంతం కొనుగోలు చేయవచ్చు. క్రెడిట్, డెబిట్ కార్డులపై రూ 4000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుండగా, పాత ఫోన్ ఎక్స్ఛేంజ్‌పై ఫ్లిప్‌కార్ట్ రూ 19,000 వరకూ ఆఫర్ చేస్తుండటంతో పిక్సెల్ ఫోన్‌ను మరింత తక్కువ ధరకు పొందే అవకాశం ఉంది. ఇక పిక్సెల్ 6ఏ ఆండ్రాయిడ్ ఇంటర్‌ఫేస్, జీరో బ్లోట్‌వేర్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ జీరో కాంప్లికేషన్స్‌తో క్లీన్, ఫ్లూయిడ్ ఇంటర్‌ఫేస్‌తో టెక్నికల్‌గా మెరుగ్గా పనిచేస్తుంది. దీనికి తోడు గూగుల్ మూడేండ్లు ఆండ్రాయిడ్ ఓఎస్ అప్‌డేట్స్, ఐదేండ్లు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను ప్రొవైడ్ చేస్తుంది.
ఇక పిక్సెల్ 6ఏ ప్రధాన ఆకర్షణగా కెమెరా ఫీచర్‌ను ఇచ్చింది. పిక్సెల్ 6ఏ కెమెరా ఎగ్జాట్ సీన్‌ను క్యాప్పర్ చేయడంతో పాటు మెరుగ్గా ఆబ్జెక్ట్‌ను ప్రెజెంట్ చేస్తుండటం విశేషం. చిన్నపాటి డిటైల్స్‌నూ కెమెరా ఒడిసిపడుతుందని, మెరుగైన బ్లర్ ఎఫెక్ట్‌తో పొర్ట్రయిట్ షాట్స్ స్టన్నింగ్‌గా కనిపిస్తాయంటున్నారు. మెరుగైన కెమెరా ఫోన్ కోసం చూసేవారికి పిక్సెల్ 6ఏ బెటర్ ఆప్షన్‌గా టెక్ నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. ఇక పిక్సెల్ 6ఏ 6.1 ఇంచ్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో స్టీరియో స్పీకర్లను కలిగిఉంది. పిక్సెల్ 6ఏ ప్రీమియం గ్లాస్ బాడీతో క్లాసీ కలర్స్‌లో లభ్యమవుతోంది.