డైరెక్టర్ చెప్పిన కథ నచ్చలేదు.. ఏం చెబుతున్నాడో కూడా అర్థం కాలేదు!
సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వంలో రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా నటించిన చిత్రం ‘శశివదనే’. గౌరీ నాయుడు సమర్పణలో ఏజీ ఫిల్మ్స్ కంపెనీ, ఎస్.వి.ఎస్ స్టూడియోస్ బ్యానర్స్‌పై అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోడల సినిమాను నిర్మించారు. అక్టోబర్ 10న రిలీజ్ కానున్న ఈ మూవీ శనివారం నాడు మీడియా ముందుకు వచ్చింది. ఈ మేరకు నిర్వహించిన ఈవెంట్‌లో హీరో రక్షిత్ అట్లూరి మాట్లాడుతూ ‘సాయి చెప్పిన కథ మొదట్లో నాకు నచ్చలేదు. ఆయనేం చెబుతున్నాడో కూడా అర్థం కాలేదు. కథగా అయితే అర్థం కాలేదు కానీ ఆయన చెప్పిన సీన్లు నచ్చాయి.
వాహన మిత్ర పథకం ప్రారంభించిందే జగన్.. కూటమి నేతలపై పేర్ని నాని ఫైర్..
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్‌పై మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు.. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు, పవన్, లోకేష్ ముగ్గురూ కలిసి మూడు ఖాకీ చొక్కాలేశారన్నారు. ఆటో డ్రైవర్ సేవలో పేరుతో డ్రైవర్లకు డబ్బులేశామని చెబుతున్నారన్నారు. ఎన్నికల్లో రాష్ట్రమంతా మహిళలకు బస్సు ప్రయాణం ఫ్రీ అన్నారని చెప్పారు. ఎవరైనా అడిగితే నా పేరు చెప్పాడని చంద్రబాబు తెలిపారు. ఎవరైనా ప్రశిస్తే తోలు తీస్తామన్నారని గుర్తు చేశారు. ఏడాదైనా ఫ్రీ బస్సు ఇవ్వకపోవడంతో విమర్శల పాలయ్యారన్నారు. జగన్ మోహన్ రెడ్డి , ప్రజలు, ప్రతిపక్షాల దెబ్బకు చంద్రబాబు ప్రభుత్వం దిగొచ్చిందని చెప్పారు. ఫ్రీ బస్సులో జిల్లాల సరిహద్దులు దాటడానికి వీల్లేదని సాక్షాత్తూ మంత్రులే చెప్పారన్నారు. తీవ్ర వ్యతిరేకత రావడంతో పల్లె వెలుగులో రాష్ట్రమంతా తిరగొచ్చని ప్రకటించారని ప్రకటించారు. బస్సులను తగ్గించేశారని చెప్పారు.
బిజీ షెడ్యూల్ పక్కన పెట్టి.. అభిమాని ఇంట ప్రత్యక్షమైన నారా లోకేష్
తమ పెళ్లికి రావాలని ఓ మహిళా అభిమాని పంపిన ఆహ్వానాన్ని మన్నించారు మంత్రి లోకేష్ .. గతంలో చేపట్టిన యువగళం పాదయాత్రలో భాగంగా 2023 ఆగస్టు 20వ తేదీన యువనేత నారా లోకేష్ విజయవాడలో పాదయాత్ర నిర్వహించారు… విజయవాడ మొగల్రాజపురానికి చెందిన భవానీ అనే యువతి ఆనాటి పాదయాత్రలో ఉత్సాహంగా పాల్గొన్నారు.. యువగళం యాత్ర ద్వారా లోకేష్ అభిమానిగా మారిన భవ్య.. తన పెళ్లికి విచ్చేసి ఆశీర్వదించాలంటూ ఇటీవల మంత్రి నారా లోకేష్ కు ఆహ్వానపత్రిక పంపించారు. శనివారం రాత్రి గన్నవరం ఎయిర్ పోర్టు సమీపంలోని ఓ కళ్యాణ మండపంలో భవ్య వివాహం జరగనుంది. బిజీ షెడ్యూలు ఉన్నప్పటికీ మంత్రి లోకేష్ శనివారం మధ్యాహ్నం మొగల్రాజపురంలోని తన అభిమాని భవ్య ఇంటికి వెళ్లి ఆమెకు ఆశీర్వచనాలు అందజేశారు. అకస్మాత్తుగా అభిమాన నేత లోకేష్ తమ ఇంటికి రావడంతో భవ్యతోపాటు ఆమె తల్లిదండ్రులు నాగుమోతు రాజా, లక్ష్మి ఆనందంతో పొంగిపోయారు. యువనేత లోకేష్ ను చూసి వారి ఉద్వేగానికి గురయ్యారు.
ఉత్తరప్రదేశ్‌లో భారీ పేలుడు.. తీవ్ర భయాందోళనలు..
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఫరూఖాబాద్ జిల్లాలోని ఒక కోచింగ్ సెంటర్‌లో శనివారం అకస్మాత్తుగా జరిగిన పేలుడు తీవ్ర భయాందోళనలకు దారితీసింది. ఖాద్రీ గేట్ పోలీస్ స్టేషన్ ప్రాంతం సాతాన్‌పూర్ మండి రోడ్‌లోని ఒక భవనంలో ఈ సంఘటన జరిగింది. ఈ పేలుడు చాలా శక్తివంతంగా ఉండటంతో భవనం పైకప్పుతో సహా అనేక భాగాలు ఎగిరిపోయాయి. సమీపంలోని ఇళ్ల అద్దాల కిటికీలు పగిలిపోయాయి. ఈ ఘటనలో అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ వారు చికిత్స పొందుతున్నారు. పేలుడుకు ఖచ్చితమైన కారణం తెలియలేదు. జిల్లా యంత్రాంగం, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి, దర్యాప్తు ప్రారంభించారు. సంఘటనా స్థలంలో భారీ పోలీసు బలగాలను మోహరించారు. బాంబు స్క్వాడ్, ఫోరెన్సిక్ బృందాలను కూడా దర్యాప్తు కోసం పిలిపించారు. పేలుడు గ్యాస్ సిలిండర్, షార్ట్ సర్క్యూట్ లేదా మరేదైనా పేలుడు పదార్థం వల్ల జరిగిందా అని అధికారులు నిర్ధారించడానికి ప్రయత్నిస్తున్నారు.
నేను ఒక చిన్న నటుడిని.. పాలన గురించి నాకేం తెలుసు?
టాలీవుడ్ నటుడు రాహుల్ రామకృష్ణ అందరికీ సుపరిచితమే. రాహుల్ చేసిన ట్వీట్స్ టాలీవుడ్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ‘మనం భయంకరమైన పరిస్థితుల్లో బతుకుతున్నాం. వచ్చి పరిస్థితుల్ని చక్కదిద్దాలని, డబుల్ డోర్ కం బ్యాక్ కోసం ఎదురు చూస్తున్నానని కేటీఆర్ ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసాడు. అలాగే విసిగిపోయాను, నన్ను చంపేయండి”, “హైదరాబాద్ మునిగిపోయింది, హామీలన్నీ విఫలమయ్యాయి, వీటిని చక్కదిద్దడానికి ప్రజలు మిమ్మల్ని పిలుస్తున్నారు అని బీఆర్యస్ అధినేత కేసీఆర్ ను ట్యాగ్ చేసి మరొక ట్వీట్ చేశారు. గాంధీ గురించి కూడా మరో ట్వీట్ చేసి సంచలనం సృష్టించాడు. ఈ కామెంట్స్ చేసిన కొన్ని గంటల తర్వాత రాహుల్ రామకృష్ణ తన ఎక్స్ ను డియాక్టివేట్ చేయడం గమనార్హం. అయితే కొందరు రాహుల్ ను బెదిరించారని అందుకే అకౌంట్ డిలీట్ చేసాడని ప్రచారం జరిగింది.
అమెరికాలో కాల్పుల్లో హైదరాబాద్ విద్యార్థి మృతి
ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళే యువత అమెరికా వంటి దేశాల్లో జరుగుతున్న దారుణ ఘటనలకు బలైపోతున్నారని తాజా ఉదాహరణ మరోసారి వెలుగులోకి వచ్చింది. అమెరికాలోని డాలస్ నగరంలో కాల్పుల్లో హైదరాబాద్ ఎల్బీనగర్‌కు చెందిన విద్యార్థి చంద్రశేఖర్ ప్రాణాలు కోల్పోయాడు. చంద్రశేఖర్ స్వదేశంలో బీడీఎస్ కోర్సు పూర్తి చేసిన తర్వాత, ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లాడు. డాలస్‌లో నివాసం తీసుకొని చదువుకుంటూ, అదనంగా ఒక పెట్రోల్ బంక్‌లో పార్ట్‌టైమ్ ఉద్యోగం కూడా చేస్తున్నారు. అయితే ఈ మధ్య రోజుల్లో ఉదయాన్నే పెట్రోల్ బంక్ వద్ద ఒక వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఆయన బుల్లెట్ తగిలి మృతి చెందినట్టు సమాచారం.
అక్టోబర్ 31న విష్ణు విశాల్ ఆర్యన్
తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన హీరో విష్ణు విశాల్, విష్ణు విశాల్ స్టూడియోస్, శుభ్ర & ఆర్యన్ రమేష్ లతో కలిసి నిర్మించిన ‘ఆర్యన్’ అనే గ్రిప్పింగ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ తో వస్తున్నారు. ఈ చిత్రానికి ప్రవీణ్ కె దర్శకత్వం వహించారు. మేకర్స్ ఇటీవల టీజర్ ను విడుదల చేశారు. దీనికి అద్భుతమైన స్పందన వచ్చింది. ఆర్యన్ చిత్రం అక్టోబర్ 31న విడుదల కానుంది. హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో శ్రేష్ట్ మూవీస్ ద్వారా విడుదల చేయనున్నారు. అనేక బ్లాక్ బస్టర్లను అందించిన ప్రొడక్షన్ , డిస్ట్రిబ్యూషన్ బ్యానర్ మద్దతుతో ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా విడుదల కానుంది.
ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టులపై మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు
రెండు నెలల్లో రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం టెండర్ ప్రక్రియ ప్రారంభం కానుందని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. డిసెంబర్ లోపు టెండర్లు పూర్తి చేసి జనవరిలో పనులు ప్రారంభించేలా చేస్తామని చెప్పారు. శనివారం నాడు మంత్రి చిట్యాల లో మీడియాతో మాట్లాడుతూ.. 2017- 18 లో ప్రధాని మోదీ ఉత్తర భాగం రీజినల్ రింగ్ రోడ్డు కు అంగీకరిస్తే..బిఆర్ఎస్ ప్రభుత్వం భూ సేకరణ చేయకుండా నిర్లక్ష్యం వహించిందని మంత్రి కోమటి రెడ్డి నాటి కేసీఆర్ ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. తాను ఎంపీగా ఉన్నపుడు రైతులకు అన్యాయం జరగకుండా ధర్నాలో పాల్గొని,ప్రజా ప్రభుత్వం వచ్చి మంత్రి అయిన తర్వాత మార్కెట్ రేట్ ఇప్పించి రైతులను ఒప్పించానని అన్నారు. తాను మంత్రిగా అయిన కొత్తలో 6శాతం భూసేకరణ మాత్రమే అయితే రైతులను ఒప్పించి ఇప్పుడు 98శాతం పైగా పూర్తి చేసామని చెప్పారు.4లేన్ల RRR 2035 నాటికి ట్రాఫిక్ రద్దీ పెరుగుతుందని, భవిష్యత్ అవసరాల దృష్ట్యా 6లేన్లుగా మార్చుకున్నామని తెలిపారు.
మాదన్నపేట బాలిక హత్య కేసు దర్యాప్తులో కీలక విషయాలు
సౌత్ ఈస్ట్ జోన్ అదనపు డీసీపీ శ్రీకాంత్ వెల్లడించినట్టు, మాదన్నపేట పరిధిలో గత నెల 30న మిస్సింగ్ అయిన 7 ఏళ్ల సుమయా హత్యకేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. గత నెల చివర్లో, 7 ఏళ్ల సుమయా తన మేనమామ సమి ఇంటికి వచ్చింది. అనంతరం బాలిక కనుమరుగైపోయింది. ఆమె తండ్రికి బంధువులచే సమాచారం అందించబడింది. తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆరు బృందాలు ఏర్పాటు చేసి వివిధ ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా బాలిక ఇంటి నుంచి బయటకు వెళ్లలేదని గుర్తించారు.
తెలంగాణలో కొత్త మద్యం దుకాణాల అప్లికేషన్లు.. ఎక్సైజ్ శాఖ అప్‌డేట్
డిసెంబర్ 1 నుండి తెలంగాణలో ప్రారంభం కానున్న నూతన మద్యం దుకాణాల కోసం రాష్ట్ర ఎక్సైజ్ శాఖ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నూతన దుకాణాలకు సంబంధించిన దరఖాస్తులు సెప్టెంబర్ 26 నుంచి స్వీకరిస్తున్నారు. ఇప్పటికే శనివారం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 447 దరఖాస్తులు నమోదు అయ్యాయని ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. సోమవారం నుండి దరఖాస్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం ఉంది. మేడ్చల్ యూనిట్ పరిధిలో ఉన్న 118 కొత్త మద్యం దుకాణాల కోసం ఇప్పటివరకు 20 దరఖాస్తులు వచ్చాయని అధికారులు పేర్కొన్నారు. మొత్తం దరఖాస్తుల స్వీకరణ అక్టోబర్ 18 వరకు కొనసాగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2,620 మద్యం దుకాణాలకు నిర్వహకులను ఎంపిక చేసుకోవడం కోసం అక్టోబర్ 23న లాటరీ ప్రక్రియ నిర్వహించనున్నారు. దరఖాస్తు ఫారంతో పాటు ప్రతి దరఖాస్తుదారు రూ. 3 లక్షల డీడీ లేదా చలాన్ రూపంలో చెల్లించిన రశీదు జతపరచాల్సి ఉంటుంది.