జగన్ సర్కార్ 3 ఏళ్ల రివర్స్ పాలనతో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి పోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శలు గుప్పించారు. బిల్లుల కోసం కాంట్రాక్టర్ కోర్టుకు వెళ్లకూడదు అని టెండర్లో నిబంధన పెట్టడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ చర్య రాష్ట్ర పరువు తీసేలా ఉంది.. దీనికి సీఎం జగన్ సిగ్గుపడాలి అంటూ ఆయన ధ్వజమెత్తారు. కాంట్రాక్టర్లను బిల్లుల కోసం కోర్టుకు వెళ్లవద్దని టెండర్ డాక్యుమెంట్ లోనే నిబంధన పెట్టడం రాష్ట్ర దుస్థితికి, అసమర్థ పాలనకు […]
ఏపీలో ఇటీవల జరిగిన పదో తరగతి పరీక్ష ఎంత గందరగోళాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పదో తరగతి పరీక్షా ప్రశ్నా పత్రాలు లీక్ కావడంతో పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఎట్టకేలకు నిర్వఘ్నంగా ముగిసిన పదో తరగతి పరీక్షల ఫలితాలను ఈ నెల 4వ తేదీన విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ వెల్లడించారు. శనివారం ఉదయం 11 గంటలకు పదో తరగతి ఫలితాలను విడుదల చేస్తామని ఆయన పేర్కొన్నారు. అయితే.. రాష్ట్రవ్యాప్తంగా […]
ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం జగన్ వరుసగా కేంద్రమంత్రులతో సమావేశమవుతున్నారు. గురువారం మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్న సీఎం జగన్.. సాయంత్రం 4.30 గంటలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సమావేశమై పలు కీలక విషయాలపై చర్చించారు. అనంతరం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మాలా సీతారామన్‌తో జగన్ భేటీ అయ్యారు. ఆపై కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో భేటీ అయ్యి పోలవరం సవరించిన అంచనాలకు ఆమోదం తెలపాలంటూ కేంద్ర మంత్రిని […]
కొరియాకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజ సంస్థ కియా ఇండియా తాజాగా ఎలక్ట్రిక్ వాహన (ఈవీ) విభాగంలోకి ప్రవేశించింది. ఈవీ6 పేరుతో తొలి ఎలక్ట్రిక్ కారును విడుదల చేసింది. ఈ కారు ప్రారంభ ధర రూ.59.95 లక్షలుగా నిర్ణయించింది కియా. మొత్తం రెండు రకాలలో లభించనున్న ఈ మోడల్ రూ.59.95 లక్షలు కాగా, మరొకటి రూ.64.95 లక్షలని పేర్కొంది. విద్యుత్ వాహన రంగంలో మా పరిధిని మరింత విస్తరించడానికి రానున్న రోజుల్లో భారీగా పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నట్లు, 2025 […]
ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలపై మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్లైన్లో సినిమా టికెట్లు విక్రయించాలని నిర్ణయించిన ఏపీ ప్రభుత్వం ఇకపై ప్రతి టికెట్‌పైనా 2 శాతం కమీషన్ వసూలు చేయనుంది. ఏపీ స్టేట్ ఫిల్మ్ టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా సినిమా టికెట్లను ప్రభుత్వం ఆన్లైన్లో విక్రయించేందుకు సన్నాహాలు చేస్తోంది. దీంతో.. ఇక నుంచి రాష్ట్రంలోని ఏ మూలన సినిమా చూడాలన్నా ఈ పోర్టల్ ద్వారానే టికెట్లను కొనుగోలు చేయాల్సిందే. ప్రైవేటు […]
పేదవారికి అండగా వుండడానికి కళ్యాణమస్తు కార్యక్రమాన్ని పునఃప్రారంభిస్తూన్నామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 7వ తేదిన 26 జిల్లాలో కళ్యాణమస్తూ కార్యక్రమాని నిర్వహిస్తూన్నామన ఆయన తెలిపారు. ఆగస్టు 7వ తేదిన ఉదయం 8 నుంచి 8:17 నిముషాల మధ్య మహూర్తం నిర్ణయించామని, కలెక్టర్ కార్యాలయాలు, ఆర్డీఓ కార్యాలయాలలో వివాహ జంటలు రిజిష్ర్టేషన్ చేసుకోవచ్చునని ఆయన పేర్కొన్నారు. ఇతర రాష్ర్టాలలో సీఎంలు ముందుకు వస్తే, ఆ ప్రాంతాలలో కూడా టీటీడీ కళ్యాణమస్తు కార్యక్రమం […]
విద్యుత్ శాఖ అధికారులతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ అధికారులకు మంత్రి పెద్దిరెడ్డి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర నిబంధనల ప్రకారం పదిశాతం విదేశీ బొగ్గు కొనుగోళ్ళకు చర్యలు చేపట్టాలన్నారు. దీనిలో భాగంగా 31 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు దిగుమతికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా ఉత్పత్తి చేయాలని ఆయన అధికారులకు […]
ఇటీవలే ఏపీలో పదో తరగతి పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. పదో తరగతి పరీక్ష ప్రశ్నాపత్రాలు లీకులు జరగడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే త్వరలోనే పదో తరగతి పరీక్షా ఫలితాలను విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో తాజాగా గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ డైరెక్టర్ డి. దేవానంద రెడ్డి మాట్లాడుతూ.. పదో తరగతి పరీక్షల ఫలితాల్లో ర్యాంకులు ప్రకటిస్తే శిక్షార్హులు అని ఆయన స్పష్టం చేశారు. పదో […]