నేషనల్ హెల్త్ మిషన్ విభాగం ఉన్నతాధికారులతో మంత్రి విడదల రజనీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె అధికారులకు పలు కీలక సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఆమె మాట్లాడుతూ.. నాణ్యమైన వైద్యం జగనన్న లక్ష్యమన్నారు. ప్రభుత్వం ఉన్నత ఆశయంతో పని చేస్తోందని, అధికారులు చిత్తశుద్ధితో పనిచేస్తేనే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. నేషనల్ హెల్త్ మిషన్ లక్ష్యాలు పూర్తి కావాలని, అన్ని విభాగాల్లోనూ ఏపీనే ముందుండాలని ఆమె అధికారులకు సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సమస్యలు ఉండటానికి వీల్లేదని, […]
మరోసారి తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రం ఏమైనా, ప్రజలు ఎక్కడకు పోయినా ప్రభుత్వానికి పట్టడం లేదని ఆమె ఆరోపించారు. కోనసీమను చూస్తుంటే పాకిస్థాన్ గుర్తుకొస్తోందని, జగన్ అరాచకానికి కోనసీమ ప్రాంతం మచ్చుతునక అంటూ ఆమె మండిపడ్డారు. అధికారదాహాంతో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైళ్లు తగలబెట్టించారని, సొంతపార్టీ ఎమ్మెల్సీని కాపాడుకోవడానికి, మంత్రి ఇంటిని తగలబెట్టిన వారు, రేపు అధికారం కోసం ప్రజల్ని తగలబెట్టరా? అని ఆమె ప్రశ్నించారు. 65 మందిని […]
మోడీ ప్రభుత్వం విధానాలు ప్రజాస్వామ్య స్పూర్తికి విఘాతం కలిగించేలా ఉన్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విభజన హామీలతో పాటు ప్రత్యేక హోదాలాంటి అనేక అంశాలు కేంద్ర ప్రభుత్వం హామీలు ఇచ్చి అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలను మోసం చేసిందని ఆయన ఆరోపించారు. విద్యుత్ బిల్లులు బొగ్గు దిగుమతులు చేసుకోవడంపై రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం చేస్తుందని ఆయన మండిపడ్డారు. ప్రెసిడెంట్ ఎన్నికల నేపథ్యంలో కేంద్రానికి రాష్ట్ర బలం అవసరం ఉంది… […]
ఏపీ సీఎం జగన్ నేడు ఢిల్లీలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. అయితే సీఎం జగన్ ఇప్పటికే.. ప్రధాని మోడీతో సమావేశమై పలు కీలక విషయాల గురించి చర్చించారు. మోడీతో సమావేశం అనంతరం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మాలా సీతారామన్‌తో సమావేశమయ్యారు. ఈ సమావేశం సుమారు 20 నిమిషాల పాటు సాగింది. అయితే.. ఈ సమావేశంలో.. పోలవరం ప్రాజెక్టుకు నిధుల విడుదలకు మార్గం సుగమం చేయాలని కోరినట్లు తెలుస్తోంది. 2017-18 ఆర్ధిక సంవత్సరం ధరల ఆధారంగా పోలవరం […]
విజయనగరం జిల్లాలో నేడు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు కొణెదల నాగబాబు పర్యటించారు. ఈ సందర్భంగా జనసేన కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ.. జనసేనా ఫ్యామిలీ చూడడానికి… వాళ్ల అభిప్రాయం తెలుసుకోవడంతో పాటు అవగాహన పెంచుకునేందుకు వచ్చానని ఆయన వ్యాఖ్యానించారు. హైదరాబాదులో కూర్చొని ఎవ్వరో చెప్పింది తెలుసుకునే కంటె నేరుగా వచ్చి తెలుసుకోవాలనుకున్నానని ఆయన వివరించారు. అంతేకాకుండా ఈ పర్యటన ద్వారా క్షేత్ర స్థాయిలో పార్టీ పరిస్థితి తెలుసుకొనే అవకాశం వచ్చిందన్నారు […]
ఏపీ సీఎం జగన్ నేడు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. మధ్యాహ్నం ఢిల్లీ పర్యటనకు బయలుదేరిన జగన్ రాజధాని చేరుకున్న వెంటనే సాయంత్రం 4.30 గంటలకు ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. సుమారు 45 నిమిషాల పాటు సమావేశం కొనసాగింది. సీఎం వైఎస్ జగన్ వెంట వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ఉన్నారు. అయితే.. ఈ భేటీలో జగన్ పలు కీలక అంశాలను ప్రస్తావించినట్లు సమాచారం. రాష్ట్ర […]
అమరావతిలో నేడు టీడీపీ చీఫ్ చంద్రబాబు పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆత్మకూరు ఉప ఎన్నికపై వైసీపీ కనీస సంస్కారం లేకుండా మాట్లాడిందని ఆయన మండిపడ్డారు. చనిపోయిన కుటుంబ సభ్యులకే ఉప ఎన్నికల్లో సీటు ఇస్తే పోటీ పెట్టకూడదనేది టీడీపీ విధానమని, ఈ విధానంతోనే గౌతమ్ రెడ్డి మృతి కారణంగా వచ్చిన ఉప ఎన్నికలో టీడీపీ పోటీ పెట్టలేదని ఆయన వ్యాఖ్యానించారు. తమ పార్టీ నేత చనిపోవడం వల్ల వచ్చిన […]
ఏపీ మంత్రి పినిపే విశ్వరూప్ కొడుకు కృష్ణారెడ్డి బెదిరింపులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అమలాపురం రూరల్ ఈదరపల్లి వైసీపీ ఎంపీటీసీ అడపా సత్తిబాబును ఆయన ఫోన్లో బెదిరించినట్టు ఆరోపిస్తున్నారు. నా ఇంటికి నిప్పు పెడతారా మిమ్మల్ని చంపుతా అంటూ ఎంపీటీసీని మంత్రి తనయుడు బెదిరించినట్టు చెబుతున్నారు. తల్లి, భార్య పేరుతో అసభ్య పదజాలంతో తిట్టడమే కాకుండా తీవ్రస్థాయిలో బెదిరించినట్టు ఆరోపిస్తున్నారు. అయితే ఇది మంత్రి కుమారుడు కృష్ణారెడ్డి ఆడియోనా.. కాదా అని పరిశీలిస్తున్న పోలీసులు. అమలాపురం […]
ఉత్తరప్రదేశ్‌లోని లఖ్‌నవూలో 2 రోజుల పాటు నిర్వహించాల్సిన “నవ సంకల్ప్ కార్యశాల”లో పాల్గొనడానికి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వెళ్లారు. అయితే.. ఉన్నట్టుండి.. ఉత్తరప్రదేశ్ పర్యటనను ముగించుకొని ఢిల్లీకి తిరిగివెళ్లారు. గత ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి గల కారణాలతో పాటు పార్టీని రాష్ట్రంలో బలపర్చే అంశాలపై కీలక చర్చల్లో ప్రియాంక గాంధీ పాల్గొనాల్సి ఉంది. అయితే.. ఆమె ఒక్కసారిగా ఢిల్లీకి ఎందుకు వెళ్లారన్న విషయం ఆ పార్టీ యూపీ నేతలకు కూడా తెలియకపోవడంతో […]
అవినీతి చేసే ఎమ్మెల్యేలు, మంత్రుల కోసం యాప్ ఎందుకు పెట్టలేదు అంటూ వైసీపీ ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ప్రభుత్వ అండ లేకుండా ఎవరైనా మైనింగ్ చేయగలరా..? అని ప్రశ్నించారు. ఇసుక అక్రమాల గురించి బొల్లా బ్రహ్మానాయుడు, విత్తన అక్రమాల గురిoచి ఆర్కే మాట్లాడలేదా..? అని ఆయన అన్నారు. కృష్ణపట్నం పోర్టులోకి లారీలు వెళ్లాలంటే కాకాణి టోల్ […]