Delhi Liquor Scam Updates
ఢిల్లీ లిక్కర్ స్కాం దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. లిక్కర్ కేసులో లావాదేవీలు కీలకంగా మారాయి. లిక్కర్ షాప్ లైసెన్స్ కు పొందిన కంపెనీ లకు నిధుల బదలాయించినట్లు అధికారులు గుర్తించారు. హైదరాబాద్ కేంద్రంగా ఈ లావాదేవీలు సాగినట్లు, పలువురు వ్యాపారవేత్తలు, వారి కంపెనీల జాయింట్ ఖాతా నుండి ఢిల్లీ కంపెనీలకు లావాదేవీలు చేసినట్లు సమాచారం. మొత్తం వ్యవహారం ఇండో స్పిరిట్స్ సమీర్ మహీంద్రు, రాబిన్ దిస్టిలరీ, అరుణ్ పిళ్ళై నడిపించినట్లు, హైదర్రాబాద్ నుండి వెన్నమనేని శ్రీనివాస్, శరత్ చంద్ర రెడ్డిలు నిధులు సమకూర్చినట్లు తెలుస్తోంది. అయితే.. వెన్నమనేని శ్రీనివాస్ పేరు మీద 6 కంపెనీలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
ఒక ప్రముఖ ఫార్మా కంపెనీకి శరత్ చంద్ర రెడ్డి కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వీరి ఇద్దరి కంపెనీల నుండే ఢిల్లీ లిక్కర్ కేసులో లైసెన్స్ పొందిన 5 డీస్టిలరీ కంపెనీ లకు నిధులు బదలాయించినట్లు, ఆ నిధులతోనే డిస్టిలరీలు టెండర్లు దక్కించుకున్నారు. మొత్తం స్కాంలో వెన్నమనేని శ్రీనివాస్, శరత్ చంద్ర రెడ్డి, అరుణ్ పిళ్ళై, సమీర్ మహేంద్రులు కీలకంగా మారారు. వీరి చుట్టూ లిక్కర్ స్కాం దర్యాప్తు జరుగుతుంది. అయితే.. దర్యాప్తు పూర్తి అయ్యేలోగా మరికొందరి పేర్లు బయటకు వస్తాయనే వార్తలు వినిపిస్తున్నాయి.